Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చిన్న కిరాణా ఓనర్ కొడుకు… ఓయోతో 9 వేల కోట్లకు ఎదిగిపోయాడు…

May 30, 2022 by M S R

Jagannadh Goud….  రితేష్ అగర్వాల్ : ఓయో రూం వ్యవస్థాపకుడు మరియూ సీఈఓ. రితేష్ ఒరిస్సా రాష్ట్రంలోని రాయగడ జిల్లాలోని ఒక పట్టణానికి చెందిన సాధారణ కుర్రాడు. తల్లిదండ్రులది కిరాణా వ్యాపారం. రితేష్ కి 13 సంవత్సరాలు ఉన్నప్పుడు మొబైల్ సిమ్ కార్డ్ లు అమ్మేవాడు. స్కూల్ పూర్తి అయ్యాక ఢిల్లీ వెళ్ళి కాలేజ్‌‌లో జాయిన్ అయ్యాడు.

చదువు మీద ఇంట్రెస్ట్ కంటే ఏదో ఒకటి చేసి డబ్బులు సంపాదించాలి అనుకున్నాడు. కాలేజ్ చదువుకి స్వస్తి చెప్పి ఒరావెల్ స్టేస్ అని హోటల్ బుకింగ్ పోర్టల్ ని 2012 లో తన 17 వ యేట పెట్టాడు. ఆ తర్వాత ఒక కాంపిటేషన్ లో స్కాలర్ షిప్ వస్తే ఆ డబ్బుతో 2013 లో ఓయో రూంస్ (OYO – On Your Own) స్థాపించాడు తన 18 వ యేట.

ప్రస్తుతం ఓయో రూంస్ ఇండియా లోనే కాదు, యూరప్ మరియూ అమెరికాలో కూడా విస్తరిస్తున్నాడు. డోనాల్డ్ ట్రంప్ ఇండియా వచ్చినప్పుడు రితేష్ ని పిలిపించుకొని మరీ మాట్లాడి పొగిడాడు అతని ఆలోచన విధానాన్ని… మన రాష్ట్రపతి, ప్రధాని, అధానీ అందర్నీ అతను కలిశాడు.

Ads

ప్రస్తుతం అతని వయస్సు 28 సంవత్సరాలు, ఆస్తి 8750 కోట్లు. వెయ్యి కోట్లకి పైగా ఉండేది, కరోనా పాండెమిక్ వలన ప్రస్తుతం 9000 కోట్ల వరకు ఉంది.

ప్రపంచంలోనే స్వయంకృషితో ఎదిగిన రెండవ యువ బిలియనీర్ రితేష్ అగర్వాల్ & ప్రస్తుత యువ భారతానికి ఆదర్శప్రాయుడు. కృషి, పట్టుదల, వినూత్న ఆలోచనా విధానం ఉంటే ఇండియాలో కూడా ప్రపంచం కొనియాడదగిన విజయం సాధించవచ్చు అని ప్రస్తుత తరానికి తెలియచేసిన యువకుడు రితేష్ అగర్వాల్. నా దృష్టిలో ఈ శతాబ్ధపు భారతీయ సృజనాత్మక వ్యక్తి రితేష్ అగర్వాల్ ……… – జగన్

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పేరుకు గోల్డ్ ఫ్లేక్ కింగ్ … గణేష్ బీడీ పొగ… శ్రీశ్రీశ్రీ రాజావారి లంకచుట్ట పొగ…
  • ఇండియాలోకెల్లా హయ్యెస్ట్ పెయిడ్ ఫిమేల్ టీవీ ఆర్టిస్ట్ ఎవరో తెలుసా..?!
  • వేములవాడ ఆవులు, కోడెల ఉసురు ఎవరికి తగలబోతోంది..?!
  • ఈవారం తెలుగు టీవీ వినోద చానెళ్ల స్థితిగతులు, రేటింగులు ఇవీ…
  • తెలుగు టీవీ న్యూస్ చానెళ్లలో ప్రస్తుతం ఎవరు ఏ ప్లేసులో..?!
  • బాలయ్య దంచూదంచూ అని దరువేశాడు గానీ… దంచికొట్టింది భానుమతే…
  • ఫాఫం అనసూయ..! కాస్త మారిందేమో అనుకున్నారా..? నో, నెవ్వర్..!!
  • ట్రంపుపై మస్క్ పేల్చిన చీకటి బాంబు… అమెరికాలో కలకలం… అసలు కథ ఇదీ…
  • దిక్కుమాలిన క్షుద్రానువాదాలు… దరిద్రపు పర్యవేక్షణ అంటే ఇదే…
  • సిల్క్ స్మిత హర్టయ్యింది… ఆ గ్రేట్ కొరియోగ్రాఫర్ కెరీర్ క్లోజయ్యింది…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions