…. అఖిల్, అవినాష్ తప్ప అందరూ ఈసారి నామినేషన్లలో ఉన్నారు కదా… వాళ్లలో వీక్ కంటెస్టెంటు మోనాల్… అనేకసార్లు అదుగో ఔట్, ఇదుగో ఔట్ అనుకుంటూనే ఉన్నా సరే… ఎప్పటికప్పుడు ఆమె కాపాడబడుతూనే ఉన్నది… అభిజిత్ భాషలో చెప్పాలంటే .. ఖుదా మెహర్బాన్ తో గధా పహిల్వాన్… దేవుడు కరుణిస్తే అంతే… బిగ్‌బాస్ దేవుడు కూడా కావచ్చు… సరే, ఏదోలా ఆమె హౌసులో కంటిన్యూ అవుతూనే ఉంది…
కొన్నాళ్లు అఖిల్‌తో… ఇంకొన్నాళ్లు అభిజిత్‌తో… మరికొన్నాళ్లు ఇద్దరితో… ప్రేమ నటిస్తూనే ఉంది… ఆమె కథానాయకి… అనగా హీరోయిన్… నటన ఆమెకు కొత్త కాదు… బిగ్‌బాస్ రాసిస్తాడు, ఆమె నటించి చూపిస్తుంది… అంతే… ప్రేమ లేదు, దోమ లేదు… నిజానికి మోనాల్ బాగా ఎమోటివ్… ప్రత్యేకించి దుఖాన్ని ఆపుకోలేదు… అది మాత్రం నటన కాదు… కడుపులో నుంచి తన్నుకొచ్చే దుఖమే…
అయితే ఆ శోకాలే ప్రేక్షకులకు నచ్చవు… ఒక ఎమోషనల్ సీన్లో కన్నీళ్లు పెడితే తప్పులేదు, కానీ ప్రతి దానికీ… ఆనందమొచ్చినా, బాధ కలిగినా అవే కన్నీళ్లు… పదే పదే… పైగా ఈ ప్రేమ నాటకాలు… ఫిజికల్ టాస్కుల్లో పెద్దగా ఇంట్రస్టు చూపించకపోవడం… కాస్త అసభ్యంగా ఉండే డ్రెస్సు… అన్నీ కలిసి మోనాల్ మీద ప్రేక్షకుల్లో పెద్ద ప్రేమ పుట్టలేదు… పైగా పలుసార్లు ఆమె వోట్ల జాబితాలో దిగువన ఉండిపోయింది… ఐనా సరే, ఆమె కంటిన్యూ అవుతూనే ఉంది…
Ads
కాలం గడిచేకొద్దీ… అభిజిత్ ఆమెతో విడిపోయాడు, హారికతో జతకట్టాడు… అవినాష్ అరియానాతో సల్లాపాలు మొదలుపెట్టాడు… అఖిల్‌తోనూ మోనాల్ బంధం ఉండీలేనట్టుగా మారింది… ఈమధ్య ఆమెలో కొంత వ్యవహారశైలిలో కొంత మెచ్యూరిటీ కనిపిస్తోంది… ఇక వెళ్లాల్సిన సమయం వచ్చినట్టు అర్థమైనట్టుంది… తనను చూడటానికి సోదరి వస్తే కూడా… అఖిల్ వ్యవహారం సొసైటీలో చెడుగా ప్రొజెక్ట్ అవుతోందా అని అడిగింది… నటనకు ఫుల్ స్టాప్ పెట్టేయాల్సిన టైం వచ్చినట్టుంది…
ఆమె స్ట్రాంగ్… తనకు నచ్చని కోడిగుడ్డును కనీసం తాకలేదు తను… ఎవరు తీసుకొచ్చినా తగలనివ్వలేదు… ఫిజికల్‌గా ఎంత స్ట్రాంగో ప్రేక్షకులందరూ ఈరోజు చూశారు… నిజంగా రియల్ మోనాల్ కనిపించింది… ఒకవైపు తోపు అని చెప్పుకునే సొహెయిల్ మధ్యలోనే అఖిల్‌ను కిందపడేశాడు… కూలబడిపోయాడు… ఇంకోవైపు అవినాష్ అభిజిత్‌ను ముందుగానే దింపేశాడు… కానీ మోనాల్ మాత్రం హారికను అలాగే స్థిరంగా, కదలకుండా, ఏమాత్రం తొణకకుండా… ఓ స్థంభంలా నిలబడి… హారికను గెలిపించింది…
అఖిల్‌కు ఎక్కడో కాలింది… ఆవేశాన్ని అణుచుకోలేక బెడ్ దగ్గర ఏదేదో ప్రతాపం చూపించాడు… మధ్యలో మోనాల్ వస్తే, నన్ను కాసేపు వదిలెయ్ అన్నాడు రగిలిపోతూ… అవును మరి… ఆమె తప్పేం ఉంది..? తను అఖిల్‌ను ఎత్తుకుని ఉండాల్సిందా..? అదేనా అఖిల్ కోరుకున్నది..? లేక అఖిల్‌ను గెలిపించడానికి హారికను ఆమె కిందపడేయాల్సి ఉండేదా..? ఆ అఖిల్ భావనల్లోనే చిన్నతనం ఉంది… తరువాత అభిజిత్‌తో మాట్లాడుతూ మోనాల్ వైరాగ్యం కనబర్చింది… అఖిల్‌తో కట్… సోవాట్..?
ఆమె ప్రస్తుతం మొహంలో ఏ ఫీలింగ్సూ లేకుండా తేటగా కనిపిస్తోంది… హారిక, లాస్య, అభిజిత్, తను కలిసి ఒక్కచోట జోకులు వేసుకుంటుంటే… ఆమె మాత్రం అటూఇటూ నిర్లిప్తంగా చూస్తూ కనిపించింది… అవును, పాత మోనాల్ ఇప్పుడు లేదు… ఎటొచ్చీ… హౌస్ నుంచి వెళ్లిపోయేముందు ఆమె ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు పొందుతున్నదా..? అదే నిజమైతే మాత్రం పిటీ…!!
తాజా వార్త :: అఖిల్‌తో కట్టయ్యాక… బిగ్ బాస్ స్క్రిప్టు పూర్తయ్యాక ఇక మోనాల్‌తో పనేం ఉంది..? ఇన్నాళ్లూ కాపాడుతూ వచ్చాడు కదా… చిటారు కొమ్మలు ఎక్కించాడు కదా… ఇప్పుడు వదిలేశాడు… ఆమె ఔటయిపోయింది ఆటలో… ఎలిమినేట్ అయిపోయింది… ముందే అనుకున్నాం కదా… ఆ సూచనలు కనిపిస్తూనే ఉన్నాయని… చివరకు అదే జరిగింది…
తాజా అప్ డేట్ :: బిగ్ బాస్ ట్విస్టు ఇచ్చాడు… పాత్రికేయలోకాన్ని ఆమె ఔటయ్యిందనే మాయలో పడేసి, చివరకు లాస్యను ఔట్ చేశాడు… అది మరో కథనంలో చెప్పుకుందాం…
Share this Article