Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

క్వశ్చన్ అవర్..! పాత అక్రమాలకు ప్రతిపక్షం ప్రశ్నించబడుతోంది..!!

June 10, 2025 by M S R

.

మామూలుగా ప్రతిపక్షం అంటే..? ప్రభుత్వం చేసే అక్రమాల్ని, తప్పు నిర్ణయాల్ని, ప్రజావ్యతిరేక విధానాల్ని ప్రశ్నించేది… నిలదీసేది… అంతే కదా… సాధారణంగా జరిగేది అదే కదా…

నో, తెలంగాణలో జరుగుతున్నది వేరు… ప్రతిపక్షమే ప్రశ్నించబడుతోంది… ప్రశ్నల తాకిడికి తల్లడిల్లిపోతోంది… తను అధికారంలో ఉన్నప్పుడు పాల్పడిన అక్రమాలపై నిలదీయబడుతోంది… అదీ బహుముఖంగా…

Ads

అడ్డగోలుగా ఫోన్ ట్యాపింగులకు పాల్పడిన పోలీస్ విలనుడు రాను రాను అని అమెరికాలో హఠం వేసుకుంటే… ఎలా రప్పించాలో మాకు తెలుసులేవో అని రకరకాల ఇంటర్ పోల్ కార్నర్ నోటీసులు ఇచ్చి, అడ్డంగా కార్నర్ చేసి దాదాపుగా లాక్కొచ్చారు… ఇప్పుడు ప్రశ్నించబడుతున్నాడు…

అది కాంగ్రెస్ కమిషన్, భయం లేదు, బాజాప్తా హాజరవుతాను అంటూ హరీష్ రావు ఘోష్ ముందుకు వెళ్లాడు… ప్రశ్నించబడ్డాడు… నానారకాలుగా కసరత్తు చేసుకుని మరీ వెళ్లాల్సి వచ్చింది… సాక్షిగా కాదు, ఓ నిందితుడిగానే ప్రభుత్వం పరిగణిస్తోంది తనను…

రేపో మాపో తెలంగాణ జాతిపిత, తొలి ముఖ్యమంత్రిగా కీర్తించబడే కేసీయార్ కూడా అదే కమిషన్ ఎదుట ప్రశ్నించబడనున్నాడు… శుక్రమహర్దశ కలకాలం ఉండదు కదా… చేసిన అక్రమాలు నేల మీదకు తీసుకువస్తాయి… నిందితుడిగా నిలబెడతాయి… వేలెత్తి చూపిస్తాయి… అదీ టైమ్ అంటే, అదీ డెస్టినీ అంటే…

ఆ టైమ్ ఎలాంటిదంటే… సాక్షాత్తూ కన్నబిడ్డే నీ చుట్టూ చేరిన ఆ కొరివి దెయ్యాల మాటేమిటి డాడీ అని ప్రశ్నిస్తుంది, నిలదీస్తుంది… మరి ఆ కన్నకొడుకు..? ఆ వారసుడు..? తనూ ప్రశ్నించబడుతున్నాడు… ఫార్ములా రేసు బాపతు అక్రమాల మాటేమిటి, కొన్ని ప్రశ్నలున్నాయి, కాస్త వస్తారా అని ఏసీబీ మళ్లీ పిలిచింది…

ఐతే… రాటుదేలిన రాజకీయం కదా… ఎహె, మేం ప్రశ్నిస్తున్నామనే మమ్మల్ని బుక్ చేస్తున్నారు అని ఎదురుదాడికి దిగుతుంది… ట్యాపింగ్ దోషి పోలీసు కదా… ఇరకకుండా దొరకకుండా జవాబులు చెబుతూ… అబ్బే, నాకేం సంబంధం అని బుకాయిస్తాడు… తెలియదు, గుర్తులేదు, మరిచిపోయాను పడికట్టు సమాధానాలు…

రాజకీయం ఎలాంటి సమాధానం ఇస్తుందంటే… రెండూ రెండూ కలిస్తే ఆరే కదా అంటుంది… అదే నమ్మాలని దబాయిస్తుంది… ఎలాగంటే..? లక్ష కోట్ల కాళేశ్వరం అప్పు ఎలా తీరుద్దామనుకున్నారయ్యా అనడిగితే, దాందేముంది, నీళ్లు అమ్మి కట్టేస్తామని అనుకున్నాం అని అలా అలవోకగా ఓ జవాబు అలా విసిరేస్తుంది…

చెప్పేవాడికి అడిగేవాడు ఎప్పుడూ లోకువే కదా… ఎవరికి నీళ్లమ్ముతాడు..? రైతులకా..? సాధ్యమేనా..,? మొత్తం తెలంగాణ సమాజం చెవుల్లో పెట్టడం కాదా ఇది… అల్లుడిలాగే మామ కూడా అవే జవాబులు చెప్పబోతున్నాడు… అదేమంటే కేబినెట్ నిర్ణయం అంటాడు… కేసీయారే కదా మంత్రులు అంటే, ఇంజినీర్లు అంటే… ప్లానర్, డిజైనర్, సూపర్‌వైజర్ అన్నీ ఆయనే కదా…

అదే కేటీయార్ ఏమంటాడు..? ఫార్ములా రేసు నిర్వహణతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీ హఠాత్తుగా ఆకాశానికి ఎగిసింది అంటాడు… అదే గొంతు ప్రపంచ సుందరి పోటీలను వెక్కిరిస్తుంది, ఆక్షేపిస్తుంది… రాజకీయం… సో, ప్రస్తుతం తెలంగాణలో క్వశ్చన్ అవర్ నడుస్తోంది… పోనీ, ఇంటరాగేషన్ సీజన్ అనుకొండి…

ప్రశ్నల వడగళ్లతో పెద్దతలలు బొప్పి కడుతున్నాయి సరే… ఇదేమిటయ్యా కేసీయారూ, నమ్మి నీకు పదేళ్లు కుర్చీ అప్పగిస్తే ఇన్ని అక్రమాలకు పాల్పడ్డావా అని ప్రజలూ ప్రశ్నిస్తున్నారు… అవును, ప్రతిపక్షం ఘోరంగానే తట్టుకోలేని రీతిలో ప్రస్తుతం ప్రశ్నించబడుతోంది..!! క్వశ్చన్ అవర్, క్విజ్ టైమ్, గ్రిల్ సీజన్, ఇంటరాగేషన్ పీరియడ్… పేరు ఏదైనా పెట్టుకొండి..!!

ఐతే దోషులు ఎవరు..? జరిగిన తప్పులేమిటో… ఏసీబీలు, కమిషన్లు తేలుస్తాయి… మళ్లీ కోర్టుల్లోనూ క్వశ్చన్ అవర్లు నడుస్తాయి… బహుముఖ ప్రశ్నాధ్యాయం..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇవే, తగ్గించుకుంటే మంచిది… శ్రీలీల వస్తే మంత్రి స్పీచ్ ఆగిపోవాలా..?
  • కాలం మారింది… పేరున్న నటులూ ఓటీటీల్లోకే నేరుగా ఎంట్రీ…
  • గికియు… గూగీ… ఒక ఆఫ్రికన్‌ వీరగాథ… వీరుడా, నీకు జోహార్లు…
  • క్వశ్చన్ అవర్..! పాత అక్రమాలకు ప్రతిపక్షం ప్రశ్నించబడుతోంది..!!
  • అఖండ తాండవం… బాలయ్య సినిమాలో పహల్‌గాం బాపతు సీన్…
  • వైరల్ సాంగ్ దారిపొంటత్తుండు… ఆ పాట సాహిత్యం ఇదుగో ఇలా…
  • ట్రిపుల్ యాక్షన్… కురూపి పాత్ర… కృష్ణ మరో సాహసం ఇది…
  • మరణం తరువాత..? ఓ చిక్కు ప్రశ్న… ‘మళ్లీ బతికిన’ ఆమె చెప్పేదేమిటంటే..?
  • ఆ NTR డర్టీ వెగటు పాటతో ఇక డ్యూయెట్స్ పూర్తిగా మానేసింది వాణిశ్రీ..!!
  • నాలుగో క్లాసులో గొడవ… 53 ఏళ్ల తరువాత తన్నుకున్నారు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions