Nationalist Narasinga Rao…. అనంత్ అంబానీ అంటే అంబానీ కొడుకుగా ఒక పెద్ద భారీ కాయం వేసుకొని (సారీ, ఇది నేను వాడే జనరల్ పదం కాదు) సీట్లో కూర్చుని IPL మ్యాచ్ లు చూస్తూ అప్పుడప్పుడూ చప్పట్లు కొడుతూ TV లలో కనబడే వ్యక్తిగా ఎక్కువ మందికి తెలిసి ఉండొచ్చు (ఇది నా ఫీలింగ్).. పైగా దేశంలోనే ఒక పెద్ద బిజినెస్ లార్డ్ కొడుకు అంటే తాత తండ్రి సంపాదించిన డబ్బులతో జులాయిగా తిరుగుతూ నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ, విచ్చలవిడిగా తిరిగే వ్యక్తి అనేది జనరల్ గా సమాజంలో ఉండే అభిప్రాయం.. అదీ ముఖ్యంగా 25 -30 ఏండ్ల మధ్య వయసు ఉండే వాళ్ళ మీద…
కొద్దిగా లోతుల్లోకి వెళితే…
28 ఏండ్ల అనంత్ అంబానీ రాధికా మర్చంట్ ప్రి వెడ్డింగ్ సెలబ్రేషన్ వల్ల మళ్లీ అనంత్ వార్తల్లోకి వచ్చాడు… ఆయన న్యూస్ 18 కు ఇచ్చిన ఇంటర్వ్యూ పరిశీలిస్తే సహజంగా మనం అనుకునే వారసులు వేరు అనంత్ అంబానీ వేరు అనే అభిప్రాయం బలంగా ఏర్పడుతుంది …. కారణం
Ads
అనంత్ ఆలోచనలు, అభిప్రాయాలు, ఆయన విజన్ ఆ ఇంటర్వ్యూలో కళ్ళకు కట్టినట్లు వివరించాడు…
గుజరాత్ లోని జామ్ నగర్ దగ్గర్లో 3000 ఎకరాల్లో గాయపడిన, ఆదరణ కోల్పోయిన, వేటగాళ్ల చెంత బందీ అయిన ప్రాణులను రక్షించి చికిత్స చేయడం, సంరక్షించడం, పునరావాసంపై దృష్టి పెట్టడం కోసం స్టార్ ఆఫ్ ద ఫారెస్ట్ వంతారా అనే ప్రాజెక్ట్ వన్య ప్రాణుల సంరక్షణ కేంద్రం ప్రారంభించాడు…
మొత్తం అంబానీ కుటుంబం వన్య ప్రాణుల పట్ల ప్రేమ, దయ కలిగి ఉంటాం అనీ, ఇది మాకు మా నాయనమ్మ కోకిలాబెన్ నేర్పింది అనీ వినమ్రంగా చెప్పడం విశేషం…. ఇదే కాకుండా అక్కడే రిలయెన్స్ రిఫైనరీలో గుజరాత్ ప్రభుత్వ సహకారంతో ఒక జూ కూడా నిర్వహిస్తున్నారు… ఇందులో ఏనుగుల సంరక్షణ కేంద్రం ఉంది, సుమారు 200 ఏనుగులు ఉన్నాయి… ఇవే కాకుండా 100 రకాల ఇతర ప్రాణులు ఉన్నాయి.. అన్ని రకాల జంతువులను సంరక్షించడానికి 3000 మంది సిబ్బంది ఉన్నారు….
ఈ జూ తన తల్లిదండ్రుల కలల రూపం అనీ, ఇంకా చాలా విషయాల్లో అభివృద్ధి జరగాలి అనీ, ఆ విధంగా అమలు చేయడానికి కృషి చేస్తున్నాం అనీ చెప్పాడు… ఇది ఒకవైపు… మరొక వైపు ఇండియా టుడే రాహుల్ కన్వల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనంత్ లో ఇంకొక కొత్త వ్యక్తి , ఆధ్యాత్మిక భావాలు ఉన్న వ్యక్తి నాణేనికి ఇంకో వైపున కనిపించడం విశేషం.. ఈ సుదీర్ఘ ఇంటర్వ్యూ చూస్తే మనకు ఈ విషయం స్పష్టంగా అర్ధం అవుతుంది…..
కొన్ని పెద్ద కుటుంబాల వారు తమ పిల్లల పెండ్లిండ్లను విదేశాల్లో చేసుకుంటున్నారు… ఇది కొంత ఆందోళన కలిగించే అంశం..వెడ్ ఇన్ ఇండియా అలవర్చు కోవాలి అని మన్ కీ బాత్ లో ప్రధాని నరేంద్ర మోడి చెప్పిన మాటలు నా మనసును తాకాయి… అందుకే జామ్ నగర్ లో నేను పెండ్లి చేసుకోవాలి అని నిర్ణయించుకున్నా… నేను ఇక్కడే పెరిగాను, ఇక్కడే వేడుకను ప్లాన్ చేసుకోవడం నా అదృష్టం. ఇది నా తండ్రి జన్మ భూమి మరియు నా దాదా మరియు నాన్నల కర్మ భూమి. ఎవరైనా ఇక్కడే పెళ్లి చేసుకోవాలని మా ప్రధాని చెప్పడం గర్వంగా మరియు సంతోషించాల్సిన విషయం. భారతదేశం నా ఇల్లు…’’ అని అనంత్ అంబానీ అన్నారు…
ఒక 28 ఏండ్ల యువకుడు, అదీ దేశంలోనే నంబర్ వన్ సంపన్న కుటుంబానికి చెందిన అబ్బాయి నోటి వెంట కర్మ భూమి, జన్మ భూమి, మాతృ భూమి లాంటి పదాలు వూహించలేము… ఈమధ్య కాలంలో సనాతన ధర్మం మీద తమిళనాడు మంత్రి ఉదయనిధి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు, సోషల్ మీడియా మీడియాలో కొంత అపప్రథ కూడా మూట కట్టుకున్నాడు…
ఇదే సనాతన ధర్మం అనే విషయం ఉదయనిధి కన్నా సుమారు 18 ఏండ్లు చిన్న అయిన అనంత్ అంబానీ ఎంతో పరిణతి చెందిన వ్యక్తిగా తన అభిప్రాయాలు వెలిబుచ్చడం విశేషం…
ఆయన మాటల్లో… ‘‘మాది ప్రపంచ స్థాయి వ్యాపార కుటుంబం, మా కుటుంబ సభ్యులు ముఖ్యంగా నా నాయనమ్మ సనాతన ధర్మాన్ని అనుసరించే వారు … నా నాయనమ్మ మాత్రమే కాకుండా నా కుటుంబంలో అందరూ భక్తులే. నా సోదరుడు పెద్ద శివభక్తుడు. మా నాన్న వినాయకుడిని పూజిస్తారు. మా అమ్మ నవరాత్రులలో తొమ్మిది రోజులు ఉపవాసం ఉంటుంది. మా కుటుంబంలో అందరూ భగవంతుని పట్ల అంకితభావంతో ఉన్నారు. మనకున్నదంతా భగవంతుని ద్వారానే మనకు అందించబడింది. నేను ఇప్పటికీ 9 సార్లు భగవద్గీత చదివాను, పూర్తిగా అర్థం చేసుకోలేనప్పటికీ ధర్మాన్ని ఆచరించే కుటుంబంలో పుట్టడం నా అదృష్టం…’’
Share this Article