.
మన తెలుగు మీడియాలో పెద్ద ప్రాధాన్యత లభించలేదు.. కానీ ఇదొక విశేషమైన వార్తే… బహుశా పుష్ప-2 బాపతు ఉరవడిలో కొట్టుకుపోతున్నాం కదా, మనకు ఇప్పుడు ఇంకేమీ కనిపించవు…
వార్త ఏమిటంటే…? ప్రధాని మోడీ తన కేబినెట్ సహచరులు అమిత్ షా, రాజనాథ్ సింగ్, నితిన్ గడ్కరీ సహా పలువురు ఎంపీలతో కలిసి పార్లమెంటు లైబ్రరీ బిల్డింగులోని బాలయోగి ఆడిటోరియంలో ఒక సినిమా వీక్షించాడు…
Ads
తనే చెప్పాడు, ప్రధాని అయ్యాక చూసిన తొలి సినిమా అని..! అదీ కేబినెట్ సహచారులు, ఇతర ఎంపీలతో కలిసి పార్లమెంటు కాంప్లెక్సులో చూడటం విశేషమే… సినిమా పేరు ది సబర్మతి రిపోర్ట్… ఈ షోకు జితేంద్ర, రాశి ఖన్నా తదితరులూ హాజరయ్యారు…
జితేంద్ర కూతురు ఏక్తాకపూర్ ఈ సినిమాకు నిర్మాతల్లో ఒకరు… రాశి ఖన్నా ఓ ప్రధాన పాత్ర పోషించింది… తరువాత గోధ్రా రైలు బోగీ దహనం తాలూకు అసలు నిజాల్ని బయటపెట్టినందుకు మోడీ సినిమా టీమ్‌ను అభినందించాడు…
ఒక సినిమాను ఒక ప్రధాని చూడటం, పరోక్షంగా ప్రమోట్ చేయడం గతంలో వినలేదు, చదవలేదు… అవును, ఆ రైలు బోగీని కాల్చి అందులోని అయోధ్య కరసేవకులను ఓ అల్లరి మూక సజీవదహనం చేశాక, ఆ చర్యకు ఓ తీవ్ర ప్రతిచర్యగా రాష్ట్రంలో అల్లర్లు ప్రబలాయి… వందల మంది మరణించారు… అప్పుడు మోడీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి…
తను రాజధర్మం పాటించకుండా అల్లర్లు వ్యాపించడానికి కారకుడని కదా మోడీని ప్రపంచం నిందించింది… చివరకు అప్పటి ప్రధాని, తమ సొంత పార్టీ నాయకుడు వాజపేయి కూడా ఇదే విమర్శ చేశాడు… మీడియా ఈ దాడుల్ని హైలైట్ చేసింది తప్ప మూలకారణాన్ని మాత్రం విస్మరించింది…
అదుగో ఆ పాయింటే ఈ సినిమా కథకు మూలం… కథానాయకుడు ఓ హిందీ జర్నలిస్టు… ఈ బోగీ దహనం, అల్లర్లకు సంబంధించి మీడియా తీసుకున్న వైఖరిని చెబుతూనే నాడు ఏం జరిగిందో వివరంగా చెప్పడానికి ఈ సినిమా దర్శకుడు ప్రయత్నించాడు… సినిమా నిర్మాణంలో దర్శకుడు మారిపోయాడు, పలు అడ్డంకులు, చిక్కులు కూడా…
చాలామంది రివ్యూయర్లకు సినిమా నచ్చలేదు… సినిమాలో చూపించిన మీడియా ధోరణిలాగే… కొందరైతే మరీ 1.5 రేటింగ్ ఇచ్చారు… అఫ్‌కోర్స్ కొందరు 3.5 రేటింగ్ ఇచ్చి ప్రశంసించిన రివ్యూయర్లు కూడా ఉన్నారు… అన్నీ కాశ్మీర్ ఫైల్స్ తరహాలో సూపర్ హిట్ అయిపోయి వందల కోట్లు రావాలని ఏముంది..?
ఈ సినిమాకు కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పన్ను మినహాయింపు ఇచ్చినట్టు వార్తలొచ్చా్యి… ఐనాసరే, 15 నవంబరున విడుదలైతే ఈరోజుకు కేవలం 35 కోట్ల వసూళ్లు కూడా దాటలేదు… నిజానికి ఈ సినిమాకు సరైన ప్రచారం కూడా లేదు… జీ5 ఓటీటీలోకి త్వరలోనే రావచ్చు కూడా… (డిస్ట్రిబ్యూటర్లు జీ స్డూడియోస్)…
ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన విక్రాంత్ మాసేకు కొన్ని బెదిరింపులు కూడా వచ్చాయని వార్తలు… తను రీసెంటుగా సినిమాల్లో నటించడం ఆపేస్తున్నట్టు ప్రకటించాడు కూడా… తను చెప్పింది తన ఫ్యామిలీతో గడపడానికి అనీ, అదీ జస్ట్ ఒక బ్రేక్ అనీ…
కానీ మీడియా మొత్తం రిటైర్ అయిపోయినట్టు రాసుకొచ్చింది… తను ఈమధ్య నటించిన ట్వల్త్ ఫెయిల్ సినిమా మంచి సక్సెస్ సాధించింది తెలుసు కదా… అవునూ, సాక్షాత్తూ ప్రధాని పరోక్షంగా ప్రమోట్ చేస్తున్నా సరే, సినిమా వసూళ్లు పెరుగుతాయా..? చూడాలి… ఇది లక్షద్వీప్ బీచులో కుర్చీ వేసుకుని కూర్చోవడం కాదు కదా..!!
Share this Article