Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అదే జరిగితే ఇక అమెరికాతోనే నేరుగా రష్యా యుద్ధం… గాడితప్పింది…!

April 15, 2022 by M S R

పార్ధసారధి పోట్లూరి…….    ఈ దారి ఎటు వెళ్తున్నది ? ఫిన్లాండ్, స్వీడన్ సరిహద్దుల వద్ద హెవీ మిలటరీ ఎక్విప్మెంట్ ని మోహరించింది రష్యా! ఫిన్లాండ్ మరియు స్వీడన్ లు కనుక నాటో కూటమిలో చేరితే అణు దాడి చేయడానికి అయినా వెనుకాడను అంటూ పుతిన్ హెచ్చరిక చేశాడు. కోల్డ్ వార్ సమయం నుండి ఫిన్లాండ్, స్వీడన్ లు ఎటు వైపు మొగ్గకుండా తటస్థంగా ఉంటూ వచ్చాయి ఇప్పటి వరకు… కానీ ఉక్రెయిన్ మీద రష్యా దాడి చేయగానే అమెరికా దాని మిత్రపక్షాలు మెల్లగా ఫిన్లాండ్ , స్వీడన్ లని భయపెట్టడం మొదలుపెట్టాయి రష్యా మీ మీద కూడా దాడి చేసి స్వాధీనం చేసుకుంటుంది అంటూ…

దాంతో ఫిన్లాండ్ మరియు స్వీడన్ లు NATO లో సభ్యత్వం కోసం అభ్యర్ధించాయి. బహుశా వారం రోజుల్లో ఈ రెండు దేశాలకి NATO లో సభ్యత్వం ఇవ్వవచ్చు… ఇదే జరిగితే మాత్రం ఇక రష్యా నాటో దేశాలతో పాటు అమెరికాని నేరుగా ఎదుర్కోవాల్సి రావొచ్చు… బహుశా ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయవచ్చు…

 

Ads

ఫిన్లాండ్ ప్రధాని శాన్నా మారిన్ [Sanna Marin] మాట్లాడుతూ నాటోలో సభ్యత్వం కోసం అడిగాము, ఎలాంటి ఆలస్యం చేయకుండా నాటో మా అభ్యర్ధనని మన్నించి కూటమిలో చేర్చుకుంటుంది అని భావిస్తున్నానంది… ఇక స్వీడన్ ప్రధాని మాగ్డలెన ఆండెర్సన్ కూడా నాటో ఆలస్యం చేయదనే భావిస్తున్నాను అని అన్నారు… ఇది తొందరగా తీసుకోవాల్సిన నిర్ణయం అని ఇరు దేశాల ప్రధానులు అడుగుతున్నారు…

 

1600–1725 ల మధ్య రష్యా స్వీడన్ ల మధ్య బాల్టిక్ సముద్ర తీర ప్రాంతాల మీద పట్టు కోసం యుద్ధాలు జరిగాయి. అప్పట్లో ఫిన్లాండ్ స్వీడన్ లో కలిసే ఉండేది. కానీ 1809లో అప్పటి జార్ చక్రవర్తుల కాలంలో ఇప్పటి ఫిన్లాండ్ దేశాన్ని రష్యాకి అప్పచెప్పింది స్వీడన్. అయితే ఫిన్లాండ్ కి అటానమస్ స్టేటస్ ఇచ్చింది రష్యన్ జార్ ప్రభుత్వం…

 

1917 లో అంటే 108 సంవత్సరాల పాటు రష్యా కింద ఉన్న ఫిన్లాండ్ తిరుగుబాటు చేసి, అప్పటి సోవియట్ సైన్యంతో యుద్ధం చేసి స్వతంత్రం పొందింది… అందుకే కోల్డ్ వార్ సమయంలో అటు అమెరికాతో ఇటు రష్యాతో వైరం లేకుండా తటస్థంగా ఉంటూ వచ్చాయి ఫిన్లాండ్ , స్వీడన్ లు… ఫిన్లాండ్ చాలా చిన్న దేశమే అయినా సోవియట్ యూనియన్ కి చెందిన సైన్యంతో తీవ్రంగా తలపడింది అప్పట్లో…

 

ukraine

నిజానికి ఈ రెండు దేశాలూ నాటోలో చేరడానికి ఆసక్తి కనపరచకపోతే పుతిన్ ఎలాంటి ఆక్రమణకి పాల్పడే వాడు కాదు, కానీ తన సరిహద్దుల్లో నాటో దళాలు ఉండడం క్షేమం కాదని పుతిన్ భావిస్తున్నాడు. ఇప్పుడు యుద్ధం జరగాలా వద్దా అనేది నాటో తీసుకునే నిర్ణయం మీదే ఆధార పడి ఉంది.ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ మాత్రం నాటో నుండి వైదొలిగే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

ఈ సంవత్సరం జరగబోతున్న ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న Marion Anne Perrine తాను గెలిస్తే ఫ్రాన్స్‌ను నాటో కూటమి నుండి బయటికి తీసుకొస్తాను అంటూ ఎన్నికల హామీని ఇస్తున్నది. ఫ్రాన్స్ అధ్యక్షుడుగా ఎవరు గెలిచినా నాటో నుండి వైదొలిగి పోతుంది ఫ్రాన్స్. అదే బాటలో జెర్మనీ కూడా బయటికి రావొచ్చు.

జో బిడెన్ అధికారంలోకి వచ్చాక తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఫ్రాన్స్ చాలా కోపంగా ఉంటున్నది అన్న సంగతి తెలిసిందే.. అదే సమయంలో జెర్మనీ రష్యాతో శత్రుత్వం పెంచుకోకూడదు అని నిర్ణయం తీసుకున్నది… కానీ నాటోలో ఉండడం వలన తప్పనిసరి పరిస్థితిలో తల వంచక తప్పట్లేదు. చివరికి నాటో కూటమిని చిన్నాభిన్నం చేసి కానీ వదిలేట్లు లేడు జో బిడెన్…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…
  • విశాఖ గ్యాస్ లీక్‌కు ఐదేళ్లు… ఒక్క జర్నలిస్టయినా ఫాలోఅప్ చేశాడా..?!
  • Dekh Thamaashaa Dekh… ఓ కోర్టు కేసు విచారణపై ఫన్నీ ప్రజెంటేషన్…
  • పాపం ఉండవల్లి, ఎంత లాజిక్స్ మాట్లాడేవాడు, ఎలా అయిపోయాడు..?
  • కథ ప్రజెంట్ చేసే దమ్ముండాలే గానీ… పనిమనిషి కూడా కథానాయికే…
  • పర్లేదు, వితండవీరులు కూడా చదవొచ్చు ఈ కథను… కథ కాదు, చరిత్రే…
  • ఒక పనిమనిషి మరణిస్తే ఇంత దయా..?! ఇప్పటికీ వెంటాడే ఆశ్చర్యం..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions