హీరో అక్షయకుమార్ తన కెనడా పౌరసత్వాన్ని వదులుకోవాలని నిర్ణయించాడు… ఇదీ వార్త… అదేమిటి, తను ఇండియన్ కాదా అనేది చాలామందిలో తలెత్తే ప్రశ్న… అవును, తను ఈరోజుకూ కెనడా పౌరుడే… ఇండియా పౌరసత్వం లేదు… ఇలాంటి భారతీయేతరులు బాలీవుడ్‌లో ఎందరు ఉంటారు..?
భారతీయులు కాదు అంటే… భారతీయ పౌరసత్వం (సిటిజెన్‌షిప్) లేని వాళ్లు… కొందరు వేరే దేశాల్లో పుట్టి ఆటోమేటిక్‌గా ఆ పౌరసత్వం కలిగి ఉండవచ్చు, ఇండియన్ రూట్స్ ఉన్నవాళ్లే కావచ్చు, వలసవెళ్లి వేరే పౌరసత్వం పొందినవాళ్లు కావచ్చు… రకరకాలు… అలాగని వాళ్లు ఇండియన్ సినిమాల్లో నటించకూడదని కాదు… సినిమాకు ప్రాంతం, భాష, దేశం తేడా ఏముంది ఈరోజుల్లో…
ఇండియన్ టాప్ స్టార్స్ కూడా కొందరికి ఇండియన్ సిటిజెన్‌షిప్ లేదు… పెద్ద తేడా ఏముంటుంది..? మహాఅయితే ఇండియాలో జరిగే ఎన్నికల్లో వోట్లు వేయలేరు, ఉన్నవారే వేయడం లేదుగా… ఇంకేం తేడా ఉంటుంది ఇండియన్స్‌కూ, ఈ నాన్-ఇండియన్స్‌కూ..! కొందరు నాన్ ఇండియన్ స్టార్స్ గురించి తెలుసుకుందాం… (వీళ్లు ఎక్కువగా హిందీలో నటించేవాళ్లు… ఇతర భాషల్లో ఎవరెవరున్నారనేది ఈ కథనంలో చెప్పబడలేదు…)
Ads
హెలెన్ అంటే ఓ ఐటమ్ బాంబు… ఇప్పటి తరానికి పెద్దగా తెలియదు గానీ వెనుకటి తరానికి కలలరాణి… 1938లో పుట్టిన ఓ ఆంగ్లో ఇండియన్ తండ్రికీ, బర్మా తల్లికీ పుట్టింది… ఈమెకు బర్మా పౌరసత్వమే ఉండేది… హిందీ సినిమాల్లో తొలి నాన్-ఇండియన్ స్టార్ ఈమె…
2) DEEPIKA PADUKONE
ప్రస్తుతం బాలీవుడ్‌లో నంబర్ వన్ హీరోయిన్… తీసుకునే రెమ్యునరేషన్ విషయంలో గానీ, చేస్తున్న ప్రాజెక్టులు గానీ… పఠాన్ వంటి సినిమాల్లో తన అప్పియరెన్స్, డాన్స్, మూమెంట్స్ అన్నీ అగ్లీ… బోలెడు విమర్శలను కూడగట్టుకుంది… ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ ప్రకాశ్ పడుకోన్ బిడ్డ… డెన్మార్క్‌లో పుట్టింది… బెంగుళూరులో పెరిగినా సరే డేనిష్ సిటిజెన్‌షిప్ కంటిన్యూ చేసేది…
3) AKSHAY KUMAR
బాలీవుడ్ టాప్ స్టార్లలో తనూ ఉంటాడు… అలవోకగా అధిక సంఖ్యలో సినిమాలు తీయడంలో దిట్ట… ఎక్కువగా దేశభక్తి సినిమాలు కూడా తీస్తాడు కదా తరచూ తనపై ఉన్న విమర్శ ఏమిటంటే..? అసలు నువ్వు ఇండియన్‌వే కాదు కదా అనే విమర్శ… తను నిజానికి పంజాబీ… ఢిల్లీలో పెరిగాడు… వరుసగా సినిమాలన్నీ ఫెయిలై కెనడా వెళ్లాడు, అక్కడి పౌరసత్వం వచ్చింది… ఇండియన్ సిటిజెన్‌షిప్ వదులుకోవాల్సి వచ్చింది… ఇండియాకు తిరిగి వచ్చి స్టార్‌గా వెలుగుతున్నా సరే తన కెనడా పౌరసత్వాన్ని అలాగే కంటిన్యూ చేశాడు…
4) ALIA BHATT
బాలీవుడ్ ప్రముఖ నిర్మాత మహేశ్ భట్ బిడ్డ… ఈ తరానికి ఈ పరిచయం అక్కర్లేదు… బాలీవుడ్ టాప్ స్టార్స్‌లో ఒకరు… నిజానికి ఈమె బ్రిటిష్ పౌరురాలు… బ్రిటన్ మూలాలున్న సోని రజ్దాన్‌కు బిడ్డ కావడం వల్ల బ్రిటిష్ పౌరసత్వం ఉంది… ఇండియన్ సిటిజెన్‌షిప్ రాలేదు… ఈమధ్యే రణబీర్‌కపూర్‌ను పెళ్లి చేసుకుని, ఓ భారతీయురాలైన బిడ్డకు జన్మనిచ్చిందని తెలుసు కదా…
5) KATRINA KAIF
హిందీ ప్రేక్షకుల దిల్‌కాదడ్కన్ కత్రినా కైఫ్ కూడా ఇండియన్ కాదు… ఈమె కూడా భారతీయేతరం… ఆమె తండ్రి ఒక కశ్మీరీ… కానీ ఈమె పుట్టింది మాత్రం హాంగ్ కాంగ్… తన తల్లి రూట్స్ బ్రిటన్… ఈమెకు కూడా బ్రిటిష్ పౌరసత్వం ఉంది… కొనసాగుతోంది…
6) IMRAN KHAN
ఆమీర్ ఖాన్ బంధువు ఇమ్రాన్ ఖాన్ అమెరికా పౌరుడు… అమెరికాలోని మాడిసన్‌లో పుట్టాడు… తరువాతకాలంలో విడాకులతో తల్లిదండ్రులు విడిపోయాక తన తల్లితోపాటు ముంబై వచ్చాడు… ఈయన కుటుంబం రకరకాల మతాలతో, ప్రాంతాలతో, దేశాలతో నిండిన ఓ విశ్వకుటుంబం… అది మరెప్పుడైనా చెప్పుకుందాం…
7) JACQUELINE FERNANDEZ
పలు విజయవంతమైన చిత్రాలు చేసిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నిజానికి శ్రీలంక పౌరురాలు… 2006లో మిస్ యూనివర్స్ శ్రీలంక బ్యూటీ కాంటెస్ట్ విజేత… ఆమె పుట్టింది బహరెయిన్ కానీ తల్లిదండ్రుల కారణంగా శ్రీలంక సిటిజెన్‌షిప్ పొందింది… కొనసాగుతోంది…
8) KALKI KOECHLIN
కల్కి… ఈమెకు కాస్త డిఫరెంట్ స్టోరీ… ఆమె పుట్టింది ఇండియాలోని పుదుచ్చేరి… అక్కడ చాలామందికి ఫ్రెంచ్ పౌరసత్వాలున్నాయి తెలుసు కదా… తన ఫ్రెంచ్ తల్లిదండ్రుల ద్వారా ఫ్రెంచ్ పౌరసత్వాన్ని పొందింది… కొనసాగుతోంది…
9) FAWAD KHAN
2014లో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ వర్దమాన నటుడు పాకిస్థాన్ పౌరుడు…
10) SUNNY LEONE
సంభోగ చిత్రాలతో పాపులరైన ఈ నటి గురించి కూడా పరిచయం అక్కర్లేదు… ఇండియన్ సినిమాల్లో నటిస్తోంది ఇప్పుడు… ఈమె కెనడా- అమెరికా పౌరసత్వం ఉంది… ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా… ఆమె అసలు పేరు కరణ్‌జిత్ కౌర్…
11) NARGIS FAKHRI
నర్గీస్ ఫక్రీ… పాకిస్థానీ తండ్రి, జెక్ తల్లి… అమెరికన్ మోడల్… అమెరికా పౌరసత్వం ఉంది… అదిప్పుడూ కొనసాగుతోంది…
12) EVELYN SHARMA
ఇవ్లీన్ శర్మ… కొన్ని సినిమాల్లోనూ చేసినట్టుంది… ఈమె జర్మన్ తల్లికీ, పంజాబీ తండ్రికీ పుట్టిన బిడ్డ…
13) ALI ZAFAR
బాలీవుడ్‌లో కాస్త నిలదొక్కుకుంటున్న తను పాకిస్థానీ…
14) MONICA DOGRA
ఎక్కువగా ఇన్‌స్టాలో కనిపించే ఈ స్టార్ అమెరికాలో పుట్టిన ఇండో-అమెరికన్… నటి, సింగర్… 2011లో ధోబీ ఘాట్ సినిమాతో ఆమె బాలీవుడ్ ఎంట్రీ…
15) SAPNA PABBI
ఖామోషియా ఫేమ్ సప్నా పబ్బీ లండన్‌కు చెందిన పౌరురాలు… బ్రిటిష్ పాస్‌పోర్ట్ ఉంది… ఇండియన్ సిటిజెన్‌షిప్ వదులుకోవాల్సి వచ్చింది…
16) BARBARA MORI
బార్బరా మోరి… హృతిక్ రోషన్ తో కైట్స్ సహా కొన్ని బాలీవుడ్‌లో సినిమాలు చేసింది… ఈమెకు ద్వంద్వ పౌరసత్వం ఉంది… మెక్సికన్, ఉరుగ్వేల నేషనాలిటీ ఈమెది…
17) ELLI AVRAM
ఎల్లీ అవ్‌రాం… స్వీడెన్‌లోని స్టాక్‌హామ్‌లో పుట్టింది… ఇండియా, స్వీడిష్, గ్రీక్ నటి ఈమె… అసలు పేరు ఎలిసాబెట్ అవ్‌రామిడో… స్కాండినేవిన్ టాక్ షో స్కావ్‌లాన్ ద్వారా ఎక్కువ పాపులర్…
18) AMY JACKSON
అమీ జాక్సన్.. అక్షయ్ కుమార్ సింగ్ ఈజ్ బ్లింగ్‌తో చాలామందికి పరిచయం… ఈమె యూకెలోని లివర్‌పూల్‌లో పుట్టింది… బ్రిటిష్ పౌరురాలు… రూపురేఖలు కూడా అచ్చు బ్రిటిషరే…
19) SARAH JANE DIAS
ఈమె ఫెమినా మిస్ ఇండియా 2007 విన్నర్… సారా జానే డయాస్… ఈమె నేషనాలిటీ ఒమన్ లోని మస్కట్… రోమన్ కేథలిక్ పేరెంట్స్… ఎక్కువగా మోడల్…
20) NORA FATEHI
హిందీ, తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో నటించిన ఈమె మొరాకో మూలాలున్న కెనెడియన్… సింగర్, మోడల్, ప్రొడ్యూసర్, డాన్సర్ … ఇలా అడపాదడపా హిందీ సినిమాలు… వీళ్లే గాకుండా వివిధ భాషాచిత్రాల్లో నటిస్తున్నవారు, పాడుతున్నవాళ్లు, ఇతర 24 క్రాఫ్ట్స్‌లో చేస్తున్నవారు బోలెడు మంది… వాళ్లకు ఉపాధి కల్పిస్తున్నది ఇండియా… కాకపోతే వాళ్లంతా టెక్నికల్‌గా విదేశీయులు…!!
Share this Article