మొన్నొకాయనకు కోఫమొచ్చింది… అసలు జబర్దస్త్ లేకుండా ఈటీవీ లేదు, మీరేమో అది రోజురోజుకూ నాసిరకం అయిపోతోంది, ఎవడూ దేకడం లేదు అంటున్నారు… ప్రూఫ్ ఏమిటి అన్నాడు… ప్రూఫ్ ఏమి ఉంటుంది… బార్క్ వాడు ఇచ్చే రేటింగ్సే… ఆ రేటింగ్స్ కూడా ఓ దందాయే, కానీ పరిశీలనకు ఏదో ఓ ప్రామాణికం కావాలి కదా… గతవారం రేటింగ్స్ తీసుకుంటే జబర్దస్త్ 5.47కు, ఎక్సట్రా జబర్దస్త్ 5.52కు పడిపోయింది…
ఏవో స్పెషల్ స్కిట్స్ అనీ, కొత్తకొత్తవాళ్లను తీసుకొచ్చి నానా కథలూ పడుతున్నారు గానీ ఆ షోలు ఇక లేవడం లేదు… నిజంగానే నాసిరకం స్కిట్లతో ఆ షోలను భ్రష్టుపట్టించారు… జబర్దస్త్ షోలను శ్రీదేవి డ్రామా కంపెనీ దాటేసింది… గత వారం 6.13 రేటింగ్స్ సాధించింది… ఇవి చూస్తుంటే… నిజంగా బాగా దిగజారిపోయిన షోలు ఏమేం ఉన్నాయనే ఆసక్తి ఏర్పడింది… అంటే కీలకమైన టైముల్లో ప్రసారం చేసేవి… ఓసారి అవీ చూద్దాం… జెమిని టీవీ ఎవడూ చూడటం లేదు కాబట్టి… నాన్-ఫిక్షన్ కేటగిరీ లేదు, ఫిక్షన్ కేటగిరీ లేదు, అన్నింట్లోనూ వెనుకబాటే కాబట్టి దాన్ని వదిలేద్దాం…
ముందుగా న్యూస్ చానెళ్ల సంగతికొస్తే మళ్లీ ఈసారి కూడా ఎన్టీవీ ఫస్ట్ ప్లేస్… టీవీ9 సెకండ్ ప్లేస్… ఇప్పుడప్పుడే ఇది మారకపోవచ్చు… నిజానికి పెద్ద జోక్ ఏమిటంటే… ఇతర చానెళ్లు చూస్తూ ధూంధాం ముచ్చట, తీన్మార్, మాస్ మల్లన్న, గరంగరం వార్తలు, ఇస్మార్ట్ న్యూస్ వంటి ఫన్ జనరేటింగ్ న్యూస్ షోస్ ఎక్కువ రేటింగ్స్ పొందుతున్నయ్… ఎన్టీవీకి అలాంటిదేమీ లేదు… ఐనా ఫస్ట్… ఎలాగబ్బా అని మెదళ్లు చించుకోకండి, కొన్ని అంతే…
అసలు కిందామీదా పడి కొట్టుకుంటూ, తన్నుకుంటూ, తిట్టుకుంటూ ఉండే డిబేట్లు తెలుసు కదా… వాటిని నిజానికి ఎవడూ దేకడు… ఎవరో టీవీ పిచ్చోళ్లు తప్ప వాటిని సామాన్య ప్రేక్షకుడు ఎవడూ పట్టించుకోడు… అవి అసలు రేటింగ్స్ జాబితాలో ఎక్కడో పాతాళంలో కొట్టుకుంటూ ఉంటయ్… ఆ అంకెలు చెప్పుకోవడం కూడా శుద్ధ దండుగ యవ్వారం… ఎంత తోపు ప్రజెంటర్ నిర్వహించే డిబేట్ అయినా సరే అంతే… పైగా అవి కామన్ మ్యాన్‌ను ప్రభావితం చేస్తాయనే భ్రమల్లో ఉంటయ్ పార్టీలు… అంతెందుకు, రాధాకృష్ణ ఓపెన్ హార్ట్ షో ఉంటుంది కదా… దానికి ఒకటిన్నర రేటింగ్ కూడా ఉండదు…
Ads
రియాలిటీ షోల విషయానికి వస్తే… జీతెలుగు ఆశలు పెట్టుకున్న జీసరిగమప (2.25), సూపర్ క్వీన్ (2.82) రెండూ ఫ్లాపులే… సూపర్ క్వీన్‌కు ఎంచుకున్న కంటెస్టెంట్లు రాంగ్ చాయిస్… పాపం, ప్రదీప్ ఎంత కష్టపడితేనేం, ఇక ఆ షో లేవదు… కాకపోతే జీతెలుగులో ఫిక్షన్ కేటగిరీలో ఆరు సీరియళ్లు సాలిడ్‌గా నడుస్తున్నయ్… కాకపోతే ప్రేమ ఎంత మధురం సీరియల్‌ను ఈమధ్య బాగా చెడగొట్టేశారు… సరిగ్గా తీస్తే మంచి దమ్మున్న సబ్జెక్టు అది…
ఎంత జబర్దస్త్‌కు పోటీ అనుకున్నా సరే, కామెడీ స్టార్స్ ఎందుకో ఇంకా పుంజుకోవడం లేదు… నాగబాబు ఓవర్ నవ్వులు, రియాజ్ స్కిట్స్ కాస్త ఇబ్బందికరమే అయినా ఆ బూతుల, నాసిరకం జబర్దస్త్‌తో పోలిస్తే నాణ్యతలో చాలా బెటర్ ఈ షో ఇప్పుడు… మాటీవీలో మాపరివార్ లీగ్ అనే షో మరో ఫ్లాప్… హోప్లెస్… ఇస్మార్ట్ జోడీ కూడా అంతంతమాత్రంగానే ఉంటోంది… కాకపోతే ఏడు సీరియళ్లు సాలిడ్‌గా మాటీవీని దేశంలోనే నెంబర్ వన్ పొజిషన్లోకి తీసుకుపోయాయి… రాబోయే వారాల్లో కార్తీకదీపం ఇంకా పడిపోవచ్చు, కానీ ఇప్పటికైతే అదే నంబర్ వన్ సీరియల్… వదినమ్మను చేజేతులా భ్రష్టుపట్టించారు…
రియాలిటీ షోలు అధికంగా ఉండే ఈటీవీలో ప్రధానంగా కనిపించే ఫ్లాప్ వావ్… ఎంచుకుంటున్న గెస్టులే పెద్ద శాపం దానికి… సినిమా ప్రమోషన్ల కోసం ముక్కూమొహం తెలియనివాళ్లను కూడా తీసుకొచ్చి ప్రేక్షకులను తెగ విసిగించేస్తున్నాడు సాయికుమార్… నిజానికి సుమ క్యాష్ కూడా అంతే… కానీ ఆ షో రేటింగ్స్ మాత్రం బాగుంటున్నయ్… కాస్త ఫన్, డాన్సులు, సాంగ్స్, సరదా పోటీలు గట్రా ప్రేక్షకుడికి కనెక్ట్ అవుతున్నాయి… ఆలీతో సరదాగా కూడా ఫ్లాప్ షో… సుధీర్, రష్మి వెళ్లిపోయాక ఇక ఢీ షో లేవడం లేదు… దాని గతి అంతే ఇక…
ప్రధానంగా చెప్పుకోవాల్సిన మరో షో పాడుతా తీయగా… అది స్టార్ట్ చేసే ముందే మనం చెప్పుకున్నాం… బాలు పేరును చెడగొట్టే ప్రోగ్రాం అని… అక్షరాలా అదే జరుగుతోంది… ప్రేక్షకుడు తిరస్కరించాడు… మరీ ఘోరంగా 1.2 రేటింగ్స్, అంటే ఎవడూ దేకడం లేదని అర్థం… ఈటీవీ సీరియళ్లు చాలా పూర్ క్వాలిటీ, పూర్ రేటింగ్స్… దాంతో ఈ చానెల్ మూడో ప్లేసుకు వెళ్లిపోయింది… ఇప్పట్లో లేచే సీన్ కూడా కనిపించడం లేదు…
టీవీలతో సంబంధం లేకపోయినా సరే… కాస్త స్మార్ట్ టీవీలకు లింక్ ఉన్న ఓటీటీల సంగతి చూద్దాం… ఆహాలో థమన్, నిత్య, కార్తీక్, శ్రీరాంచంద్ర నిర్వహించే తెలుగు ఇండియన్ ఐడల్ బాగానే ఉంటోంది… ఒకప్పుడు మాటీవీలో బిగ్‌బాస్ చూసేవాళ్లు జనం… ఇప్పుడు ఆ షో ఎవడూ చూడటం లేదు… ఎవడూ పట్టించుకోవడం లేదు… 24*7 కాన్సెప్టు, ఓన్లీ ఓటీటీ అనే కాన్సెప్టు అట్టర్ ఫ్లాప్… నిజానికి ఓటీటీలలో ప్రధానంగా సినిమా వీక్షణాలే ఎక్కువ… మిగతా కంటెంట్ జోలికి పెద్దగా ఎవరూ వెళ్లడం లేదు… తెలుగు కార్యక్రమాలకు సంబంధించి పెద్ద క్రియేటివిటీ కూడా కనిపించడం లేదు…!!
Share this Article