ఇప్పుడు రిషబ్ శెట్టి పేరు దేశమంతా మారుమోగిపోతోంది… 15 కోట్లతో సినిమా తీసి, పాన్ ఇండియా సినిమాగా 300 కోట్లు కొల్లగొట్టిన కాంతార సినిమా దర్శకుడు తను… వరదలా వచ్చిపడుతున్న ప్రశంసలతో ఊపిరాడటం లేదు తనకు… గ్రేట్ టర్నింగ్ పాయింట్… ఫోటోలో రిషబ్ శెట్టితోపాటు కనిపించే మరో వ్యక్తి పేరు రక్షిత్ శెట్టి…
ఎస్, ఈమధ్య చార్లి777 అనే సినిమాతో తను కూడా హిందీలో బోలెడంత డబ్బు వసూలు చేసుకున్నాడు… దాదాపు 100 కోట్ల వసూళ్లతో ఈ సంవత్సరం సూపర్ హిట్ సినిమాల జాబితాలో చేరిపోయాడు… (ఈ రెండూ అధిక వసూళ్ల కన్నడ సినిమాల జాబితాలో చేరాయి…) నిజానికి కాంతారలాగే చార్లి777 కూడా ప్రయోగాత్మక సినిమా… అవి తీయడం కష్టం… కానీ వీళ్లు మొండి ఘటాలు… తీస్తారు… ఇంతకూ కథ ఏమిటంటే…?
ఈ ఇద్దరూ ఇప్పుడు ఈ విజయాల్ని ఆస్వాదిస్తున్నారు కదా… సరిగ్గా ఆరేళ్ల క్రితం… అవును, 2016లో వీళ్లిద్దరూ థియేటర్ బయట నిలబడి, రండి బాబూ రండి, సినిమాను ఉచితంగా చూడండి, ఇవిగో టికెట్లు, బాగుంటే మరో పదిమందికీ చెప్పండి, దయచేసి సినిమా చూడండి అని అరిచిన గడ్డు రోజులున్నయ్… నిజమే… నమ్మబుల్ అనిపించడం లేదు కదా… వాళ్లే రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు…
Ads
చాలామంది అనుకుంటారు గానీ, వాళ్లేమీ అన్నాదమ్ములు కాదు… మంచి స్నేహితులు… ఇండస్ట్రీలో అవకాశాల కోసం వెతుక్కుంటూ ఢక్కామొక్కీలు తింటున్న కాలం అది… తమ కెరీర్ మొదట్లో ఒకరు క్లాప్ బాయ్, ఇంకొకరు అసిస్టెంట్ డైరెక్టర్… రక్షిత్‌కు నటుడిగా అవకాశాల కోసం ఆశ… రిషబ్‌కు దర్శకత్వంపై ధ్యాస… ఇద్దరూ ఫ్రెండ్స్ అయ్యారు… పెద్దగా అవకాశాలు కనిపించేవి కావు…
అప్పటికే రక్షిత్ చిన్నాచితకా వేషాలు వేస్తున్నాడు… కానీ 2016లో రిక్కీ అనే సినిమా రూపంలో రక్షిత్‌కు హీరోగా, రిషబ్‌కు దర్శకుడిగా చాన్స్ వచ్చింది… 2009 నుంచీ రిషబ్ ఈ కథను చెక్కుతూ వస్తున్నాడు… కాంతార సినిమా కథలాగే ఇదీ తమ ఏరియాకు సంబంధించిందే… వాస్తవ కథే… ప్రభుత్వ అధికారులు అన్యాయంగా తమ ఇంటిని కూల్చేసి, తన తల్లిదండ్రుల మరణానికి కారణమయ్యారనే కోపంతో ఓ మహిళ నక్సలైట్లతో చేరిపోతుంది… దాని ఆధారంగా రాసుకున్నదే రికీ కథ…
రికీలో హీరోయిన్ ఇలా నక్సలైట్లలో చేరిపోతుంది… ఆమెను ప్రేమిస్తున్న హీరో ఆమె కోసం అన్వేషిస్తుంటాడు… సరే, ఆ కథలోకి వెళ్లలేం ఇక్కడ కానీ… సినిమా టాక్ బాగా రాలేదు… వీళ్ల కెరీర్లకు ఆ సినిమా చాలా కీలకం… మౌత్ టాక్ కోసం థియేటర్ బయట నిలబడి టికెట్లను ఫ్రీగా ఇచ్చేవాళ్లు… కానీ కొందరు అవి తీసుకుని, తక్కువకు, అంటే మరీ పదిరూపాయలకు ఒక టికెట్లు చొప్పున అమ్మేసుకుని, మద్యం కొనుక్కునేవాళ్లుట… ఆ సిట్యుయేషన్ల నుంచి… అదే సంవత్సరం కిరిక్ పార్టీ ఇద్దరికీ లైఫ్ ఇచ్చింది… వెనక్కి తిరిగి చూసుకోలేదు… ఇప్పుడయితే ఎక్కడికో వెళ్లిపోయారు ఇద్దరూ…! డెస్టినీ అండ్ హార్డ్ వర్క్… ఈ రెండు కారణాలు…!!
Share this Article