ఇండియనైజ్ చేయడం… అనగా భారతీయీకరించడం… అంత వీజీ కాదు… ఏవేవో టిక్‌టాక్స్, రీల్స్, మీమ్స్ ఎట్సెట్రా బొచ్చెడు చూస్తుంటాం… గానీ ఇదెవరు చేశారో గానీ ఇరగేశారు… జేమ్స్ బాండ్ థీమ్ సాంగ్ తెలుసు కదా… దశాబ్దాలుగా కోట్లాది మంది బాండ్ ప్రేక్షకాభిమానుల్ని అలరిస్తున్న థీమ్ అది… అనేక భాషల్లోకి కాపీ చేసుకున్నారు, కాస్త మార్చి వాడుకున్నారు… చివరకు ఆ జేమ్స్ బాండ్ సినిమాల నిర్మాతలు కూడా స్వల్ప మార్పులతో తమ సినిమాల్లో ఈ థీమ్ సాంగ్ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు… మొత్తం సినిమా ప్రపంచంలో ఇప్పటివరకూ ఇంత పాపులర్ థీమ్ సాంగ్ మరొకటి లేదేమో బహుశా… ఓసారి ఒరిజినల్ సాంగ్ చూడండి…
కాస్త అటూ ఇటూ మొత్తం జేమ్స్ బాండ్ సినిమాల్లో ఇలాగే ఉంటుంది… మరి దాన్ని ఇండియనైజ్ చేస్తే ఎలా ఉండాలి..? మన సినిమాల సంగీతంలాగే ఉండాలి… వీలయితే కాస్త నాగిన్ స్వరం పెట్టేయాలి… లోకల్ శాస్త్రీయ సంగీతం వాసనలు కలిపేయాలి… మన స్వరగతులు జొప్పించాలి… మన తాళం, మన శృతి రంగరించాలి… మొత్తానికి బ్రిటన్ పిజ్జాని మనం పెరుగువడ టైపులోకి తీసుకురావాలి… తీసుకొచ్చారు… చాలా చాలా ఇమిటేషన్స్ మనం టిక్‌టాక్ వీడియోల్లో, రీల్స్ వీడియోల్లో చేసి ఉంటాం కదా… వాళ్లందరికీ తాత ఇది…
Ads
హిందీహాలీవుడ్ పేరిట ఫేస్‌బుక్‌లో… కొందరి పోస్టుల్లోనూ కనిపిస్తోంది… బాగున్నట్టనిపించింది… జస్ట్, అర నిమిషమే… చూసేశారుగా… స్వస్తి… మనవాళ్లు మంచి క్రియేటర్లండీ… ఇప్పటికైనా ఒప్పుకుంటారా లేదా..? పెద్ద పెద్ద దర్శకులే బోలెడు విదేశీ సినిమా కథల్ని, సీన్లను కాపీ కొట్టేసి వేల కోట్ల దందాతో మన సినిమాల్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకుపోయారనే పేరు ప్రఖ్యాతులు సంపాదించారు… సంపాదిస్తూనే ఉన్నారు… మన సంగీత దర్శకులయితే ఇక చెప్పనక్కర్లేదు… వాళ్లతో పోలిస్తే ఈ బుల్లి క్రియేటర్ ఎవరో గానీ, అభినందించాలి… వీళ్లే కాస్త నయం…!!
Share this Article