Bharadwaja Rangavajhala ……………… మిసెస్ తేడా సింగ్ … లెక్చర్ ఆన్ మేల్ డామినేటెడ్ సొసైటీ
ఈ మేల్ డ్యామినేటెడ్ సొసైటీలో ఫీమేలుగా పుట్టడం కన్నా ఏ ఫారెస్టులో అయినా ట్రీగా పుట్టినా మంచిదే అని ఎవడో లిటరరీ పర్సన్ అన్నట్టు సమ్ మౌ నా చిన్నతనంలో విన్నాను..
వాళ్లే మనల్ని డామినేట్ చేసి … మనమేదో వాళ్లని వేదిస్తున్నామని మన మీద జోకులేస్తూంటారు.. దిసీజ్ రెడిక్యులస్ ..
Ads
మా ఇద్దరి మధ్య జరిగింది వింటే అవాక్కవుతారు… దిసీజ్ నాటె యుట్యూబ్ వీడియో టైటిల్ … జస్ట్ నిన్న మా ఇంట్లో జరిగిన సీన్ ను జస్ట్ మీతో షేర్ చేసుకుంటున్నానంతే …
నోనోనో నాట్ లైక్ దట్ … బట్ యు మస్ట్ నో వాట్ హాపెన్డ్ … లిజన్ …
మా వాడు అదేనండీ మా అబ్బాయి … వాడు ధర్డ్ క్లాస్ నుంచీ ఫోర్త్ క్లాసుకు ప్రమోట్ అయినప్పట్నించీ పేద్ద మగాణ్ణనుకుంటున్నాడు.
లిజన్ కేర్ ఫుల్లీ .. మేల్ ఈగో స్టార్ట్ అయ్యేది ఈ టైమ్ లోనే … వెన్ ద మేల్ ఛైల్డ్ జాయిన్ ఇన్ స్కూల్ .. ఈ రియలైజ్ ఐయామ్ మేల్ అని .. అప్పటి దాకా మనం పెట్టింది తిని … చెప్పింది చేసే వీళ్లు .. స్కూల్ నుంచీ మేల్ ఛావనిస్టులుగా మారిపోతారు తెల్సా…
ప్రతిదానికీ వెధవ రీజనింగూ వాడూ …
రీడింగ్ మానేసి ఫోన్ తో సిట్టింగేస్తాడు.
అదేంటంటే … పెద్దగా అరుస్తాడు… నా ఇష్టం …. డోంట్ ఇన్టర్ ఫియర్ ఇన్ మై డేటూడే అఫైర్స్ అనేశాడు మొన్నైతే ..
యూట్యూబ్ వీడియో రైటర్స్ అన్నట్టు అవాక్కయ్యా తెల్సా?
మా అయనే నా ముందు వాల్యూమ్ పెంచడానికి షివర్ అయిపోతూంటాడు…
అలాంటిది వీడు జస్ట్ కిడ్ గాడు … అస్సలు టాలరేట్ చేయలేకపోతున్నాన్నేను.
ఇక లాభం లేదని … మొన్నంతా థింక్ చేస్తే … మా అమ్మమ్మ చెప్పిన మాట గుర్తొచ్చింది ..
పిల్లల పెంపకం అనేది ఉమ్మడి బాధ్యత అని దాంపత్యోపనిషత్ లో రాసుందట …
అంటే పిల్లల విషయం ఇద్దరూ షేర్ చేసుకోవాలని అన్నమాట..
వెంటనే ఆయనకి ఫోన్జేశాను.
ఈ విషయం గుర్తురాక అంత కాలం వాడి బ్రాటప్ లో సురేష్ ని ఇంటర్ ఫియర్ చేయలేదు…
చేయి పెడితే కాల్చి వాత కూడా పెట్టాను.. బికాజ్ నా కొడుకు మేల్ ఛావనిస్ట్ అయపోతాడనే..
పేటలో పెరిగినా .. కోటలో పెరిగినా బుద్దులెక్కడికి పోతాయి…
అని మా అమ్మమ్మ చాలా ఫ్రీక్వెంట్ గా చెప్పేది..
దట్స్ వై … మేల్ ఈజ్ మేల్ దట్సాల్ …
అందుకే … మేల్ ఛావిజానికి మేల్ ఛావనిస్ట్ తోనే ట్రీట్మెంట్ ఇప్పిద్దామనుకున్నాను.
టాక్టికల్లీ ఐయామ్ ఆల్వేస్ రైట్ …
వాటీజ్ ద ఇష్యూ అన్నాడు సురేష్ నాచురల్ మేల్ డామినేటింగ్ ఇరిటేటింగ్ గెస్చర్ లో ..
మీరు ఈవెనింగ్ తొందరగా రావాలన్నాను.
దేనికో చెప్పాలని అప్పుడే వస్తానని లిటికేషన్ పెట్టాడు.
చెప్పాను… బాబు విషయం మాట్లాడాలని … వెంటనే ఎస్కేపిజంలోకి వెళ్లిపోయాడు…
అందరు బ్లడీ మేల్స్ లాగే …
ఫస్ట్ యునో ఒన్ థింగ్ … మేల్స్ ఆర్ ఎస్కేపిస్ట్స్ … ఓకే … దెన్ లిజన్ .. పలాయనం చిత్తగించడంలో మగవాళ్లని మించిన వాళ్లు లేరు అని తెలుగు ..అనువాదం …
తెల్సింది కదా ఇక వినండి …
నీకు వాడి విషయంలో రెస్పాన్సిబిలిటీ లేదా అని ఓ గంట సేపు ఫోన్ లో వాష్ చేస్తే …
ఒప్పుకున్నాడు.
ఈవెనింగ్ ఎర్లీగా వచ్చి మాట్లాడతాను వాడితో అన్నాడు.
నేను ఓకే అని … వెయిట్ చేస్తున్నా … వాడు వాడి రెగ్యులర్ స్టైల్ లో నన్ను కేర్ చేయకుండా ఫోను తో బిజీ అయిపోయాడు.
ఏ మేరకు వాడ్ని సెట్ రైట్ చేస్తాడో చూద్దామని చాలా యాంగ్జైటీతో ఉన్నాన్నేను …
వాడికి చెప్పా … డాడీ నీ తోలు తీసేయడానికి వస్తున్నాడని …
డాడీనా నా తోలా … అని హహహ అని నవ్వేసి ఫోన్లోకి జంప్ చేసేసాడు..
దుర్మార్గుడు.. రైట్ డౌన్ ఎన్ ఇంపార్టెంట్ ఇష్యూ … ఇన్ దిస్ రిగార్డ్ … మేల్ చిల్డ్రన్ ఫాదర్స్ ని పెద్దగా కేర్ చేయరు…
ఫిమేల్ చిల్డ్రన్ కేర్ చేస్తారు… ఈ రెంటి వల్లా నష్టపోయేది మన ఫీమేల్సే …
ఓకేనా …
మనం మళ్లీ స్టోరీలోకొచ్చేద్దాం ..
ఇలా వెయిట్ చేస్తుండగా మా సార్ వచ్చేశారు…
వస్తూనే చాలా సీరియస్ గా … బ్యాగ్ నాకిచ్చి తిన్నగా వాడు కూర్చున్న సోఫా దగ్గరకు పోయి …
వాడితో ఆర్గ్యుమెంట్ కు దిగారు.
వై యుఆర్ నెగ్లెక్టింగ్ యువర్ స్డడీస్ అని మొదలెట్టి కంటిన్యూస్ గా … ఫిఫ్టీన్ మినిట్స్ వాడ్ని చెడా మడా తిట్టేశాడు.
షడన్ గా సునామీ లో చిక్కుకున్నట్టు మొహం పెట్టేసాడు వాడు.
వాడా ఎక్స్ ప్రెషన్ ఫ్రమ్ బార్న్ మెయిన్ టెయిన్ చేస్తున్నాడు…. ఏ ఎక్స్ ప్రెషన్ అయితే పెట్టకూడదనుకున్నానో అదే పెట్టేశాడు..
అది చూడగానే నాకు ఒక్కసారి ఏడుపొచ్చేసింది.. దిసిజ్ ద మదర్ సెంటిమెంట్ …
వి హావ్ ఓన్లీ రైట్ టు పనిష్ చిల్డ్రన్ …
మేల్స్ ఆర్ ఇన్ హ్యూమన్ అని నా ఇన్నర్ వాయిస్ చాలా లౌడ్ గా అరుస్తోంది..
వినాయక చవితి పందిళ్ల దగ్గర మైకుల్లో పాటలంత ఘాట్టిగా … ఓకే …
ఏదో పిల్లల్ని దారిలో పెట్టుకోవాలని చెప్తే … మరీ ఇంత వైలెంట్ గా ఎటాక్ చేయాలా?
దిజ్ మేల్స్ ఆర్ సో ఇర్రెస్పాన్సాన్సిబుల్ ..
అండ్ యారగంట్ ఫెలోస్ … అనిపించి … హాఫెనవర్ తర్వాత ఐ ఎంటర్ ఇన్ టూ డ్రాయింగ్ రూమ్ అన్నమాట..
బన్నీగాడు .. పూర్తిగా సఫకేటివ్ గా అయిపోయాడు.. మొహం అంతా ఎర్రగా అయిపోయింది … ఏడ్చి ఏడ్చి కళ్లు వాచిపోయి ఉన్నాయి…
ఆర్ యు బీట్ హిమ్ అని అడిగాను సురేష్ ని … స్ట్రెయిట్ గా …
నో … ఐ డోంట్ అంటే సరిపోతుంది కదా … డోంట్ ఇంటర్ ఫియర్ ఇన్ దిస్ మేటర్ అని ఒక్కసారి అరిచాడు … నా వైపు
తిరిగి ..
నాకొక్కసారి కోపం వచ్చేసింది… సురేష్ యు హర్టింగ్ మీ అని నేనూ అరిచా …
తను చేతిలో ఉన్న కళ్లజోడును కిందేసి కొట్టేసి యు డోంట్ ఇంటర్ ఫియర్ అని మళ్లీ అరిచాడు..
బన్నీగాడు హడలిపోయాడు… సురేష్ దయ్యం పట్టినట్టు అయిపోయాడు…
సురేష్ నేను వాడ్ని కాస్త రైట్ డైరక్షన్ కి మోటివేట్ చేయమని చెప్పానంతే తప్ప వాడ్ని క్రూయల్ గా హింసించమని చెప్పలేదు అన్నాను… నేను కాదు … టుడే ఆన్ వర్డ్స్ … యు డోంట్ ఇంటర్ ఫియర్ ఇన్ అవర్ ఇష్యూస్ అని బన్నీగాడ్ని ఎత్తుకుని పైకెళ్లిపోయాను…
అంతే తను చాలా రాష్ గా బయటకు పోయి కారు తీసుకుని వెళ్లిపోయాడు… నైటంతా ఇంటికి రాలేదు… నేనూ పట్టించుకోలేదు…
మార్నింగ్ కూడా రాలేదు… నాకు అర్ధమైంది .. సురేష్ ఎక్కడున్నాడో … ప్రశాంత్ కి ఫోన్ చేస్తే చెప్పాడు.. వాళ్ల రూంలోనే పడుకుని పొద్దుననే ఆఫీస్ కి వెళ్లిపోయాడు… ఓకే అనుకున్నా …
ఈవెనింగ్ వచ్చాడు… నేనూ ఏమీ మాట్లాడలేదు.. తన పనులు తాను చేసుకుని భోం చేసి పడుకున్నాడు తప్ప ఏమీ మాట్లాడలేదు…
మేల్ ఇగో చూశారా…
(పిల్లోడి ని దారిలో పెట్టమని పిల్చిందీ ఈవిడే … వాడితో మాట్లాడుతుంటే మధ్యలో వచ్చి వాడ్ని వెనకేసుకొచ్చి తిట్టిందీ ఈవిడే పైగా మేల్ ఈగో అంట ….)
యస్ మేల్ ఈగోనే … కంప్లైంట్ ఇచ్చింది నేను కనుక … నన్ను అడిగి … నేను చెప్పిన లిమిటేసన్స్ లోనే కదా తను యాక్ట్ చేయాల్సింది … అలా చేయలేదు కనుక ఖచ్చితంగా మేల్ ఈగోనే …
హీ వాంట్ టూ టేక్ ద టోటల్ సీన్ ఇన్ టూ హిజ్ హాండ్స్ …
చూశారా …దీజార్ ద స్ట్రాటజీస్ ఆఫ్ ద మేల్ పీపుల్…
ఫస్ట్ హీ వాంట్ టూ కంట్రోల్ మై ఛైల్డ్ .. దెన్ హీ వాంట్ టేక్ మీ ఇన్ టూ హిజ్ కస్టడీ … దీజార్ ద టాక్టిక్స్ … ఎవరికి చెప్తారండీ .. ఐనో ఆల్ … నాకు అన్నీ తెల్సు…
(అయ్యబాబోయ్ … పాపం సురేషు … ఆ గదిలో ఏమాలోచిస్తున్నాడో పాపం … వచ్చే జన్మలో అయినా భార్యగా పుట్టి వీళ్ల తోలు తీయకపోతానా అని ఆలోచిస్తున్నట్టున్నాడు పాపం … )
యునో .. గృహలక్ష్మి అంటే ఏమిటో తెల్సా? … గృహమంతా కంట్రోల్ లో పెట్టుకోవడమే భర్తల ఇన్ కమ్ ఖర్చులు అన్నీ మన కంట్రోల్ లోనే నడవాలి … అలా కంట్రోల్ చేయడం ద్వారా లాటాఫ్ మనీ సేవ్ చేయవచ్చు… దట్స్ వై మన్ని గృహలక్ష్ములు అంటారు..
అలా గృహాన్ని కంట్రోల్ లో పెట్టుకోని వారెవరూ గృహలక్ష్ములు అనిపించుకోలేరు… యునోదట్ … దటీజ్ ఇష్యూ … ఇప్పుటికైనా తెల్సిందా … మనం మేల్ డామినేటింగ్ సైసైటీలో ఉన్నామని అర్ధమైందా … సో బీ కేర్ఫుల్ … టేక్ కంట్రోల్ ఆన్ యువర్ హజ్బెండ్ ఓకే …
( మేల్ అండ్ ఫీమేళ్ల మధ్య ఉండాల్సింది … ఫ్రెండ్షిప్ తల్లీ … కంట్రోలో డామినేషనో కాదు … మొత్తానికి మొత్తం ఆడజాతికే నాయకత్వం వహించేస్తున్నావు …నీకు తేడా సింగని ఊర్కే పేరెట్లేదు… )
యస్ .. ఐ వాంటి టూ అవేర్ ఆల్ ఫీమేల్స్ విత్ మై ప్రీచెస్ .. వాటీజ్ ద ప్రాబ్లమ్ … మీ మగాళ్లు చేయడం లేదా ఇది … ఐ వాంట్ టూ నో.. చెప్పలేరు.. బికాజ్ ఆల్ మేల్స్ ఆర్ ఒన్ కదా …
ఓకే ఫ్రెండ్స్ … మరో ఇంట్రస్టింగ్ టాపిక్ తో మళ్లీ కలుద్దాం. అంటల్ దెన్ బైబై .. టేక్కేర్ … బీ వేర్ ఆఫ్ మేల్స్ … దిసీజ్ ద కాషన్
Share this Article