.
అసభ్య వస్త్ర ధారణే మందల నడుమ మగాళ్ల అసభ్య ప్రవర్తనకు కారణమా..? మగ శివాజీ వ్యాఖ్యలతో రెండుమూడు రోజులుగా తెలుగు సమాహంలో ఇదే చర్చ నడుస్తోంది… చివరకు మహిళా కమిషన్ ఎదుట విచారణకు కూడా హాజరయ్యాడు… తప్పేనని ఒప్పుకున్నాడు… తన మాటలకు తనే క్షమాపణ చెబుతూనే నామీద ఏదో భారీ కుట్ర జరిగింది అంటాడు… శివాజీ మీద కుట్ర పన్నాల్సినంత సీన్ ఉందా అసలు..?! ఇది మరోరకం గరుడ పురాణం..!!
నేను ఎవరికీ భయపడను అంటున్నాడు… మరి ‘నీ రుణం తీర్చుకుంటాను’ అని అనసూయను బెదిరిస్తే ఆమె బెంబేలెత్తిపోవాలా..? ఇదేమైనా బిగ్‌బాస్ షోయా..? శోభాశెట్టి, ప్రియాంక జైన్‌లను ‘ఇదే మా ఇంట్లో ఆడవాళ్లు చేస్తే చంపి పాతరేసేవాడిని’ అని నోరుపారేసుకోవడానికి..? పైగా బహిరంగ వేదికల మీద ఎలా ‘పద్ధతిగా’ మాట్లాడాలో కూడా డీసెన్సీ లేకపోతే ఎలా..?
Ads
నిధి అగర్వాల్ వస్త్రధారణ సరిగ్గా లేదు, వోకే… కానీ సమంత డ్రెస్సు బాగానే ఉంది కదా శివాజీ చెప్పినట్టు ‘పద్ధతిగా’… మరి ఆమెకు ఎందుకు మందలో భంగపాటు..? సరైన సెక్యూరిటీ లేకపోవడంతో పాటు టీవీల్లో, సినిమాల్లో గ్లామరస్‌గా కనిపించే తారలు కళ్లముందు కనిపించేసరికి ఎగబడే మూక తత్వం అది… మంద మనస్తత్వం అది…
- నిధి అగర్వాల్ ఇన్సిడెంటు సమయంలో మందలో ఒకరిద్దరు ఓ నిర్మాత ‘సామాన్ల’ పనిపట్టారని ఓ సమాచారం… వేదిక ఎక్కగానే పిచ్చి కూతలు కూస్తుంటాడు కదా ఒకాయన… ఆయనే..! అంటే మందలో ఒకరిద్దరు హోమోలు ఉండి ఉంటారు… చాన్స్ తీసుకున్నారు… అదొక దరిద్రం… జన్మతః, పెంపకంలోనూ లోపించిన సంస్కారం అది…
రెచ్చిపోయిన జెన్‌జీ, యువత ఓ దేశాధ్యక్షురాలి అధికారిక నివాసంలో జొరబడి, కాలబెట్టి, బ్రాలను చేత్తో పట్టుకుని ఫోటోలు దిగి, మంచాల మీద పడుకుని దొర్లుతూ వీడియోలు తీసుకుని… వికటాట్టహాసం చేసే ఉన్మాదాన్ని చూశాం కదా… ఆ మూకోన్మాదమే ఇక్కడ కూడా… ఆడవాళ్లే కాదు, హీరోలు, ప్రముఖ నటులు దొరికినా వదలదు మంద… అందుకే బోలెడు మంది బౌన్సర్లుంటారు చుట్టూ..!
సో, ఒళ్లు కనిపించే దుస్తులు వేసుకుంటేనే ఇవన్నీ జరుగుతున్నాయనేది అబ్సర్డ్… నిండా కప్పుకోకపోతేనే అలా మనుషులు ఎగబడి, సామాన్ల పనిపడుతున్నారనేది అబద్ధం… అసలు సమస్య తను వాడిన ‘సామాన్లు’ ‘దరిద్రపు ముండ’ అనే పదాలు కాదు… వస్త్రధారణపై శివాజీ వంటి గరుడ పురాణ ప్రవచనకర్తల మాటలు క్రమేపీ ఆడవాళ్లు చీరెలే కట్టాలి అనే ఫత్వాల జారీ దాకా వెళ్తుంది…
పురుషులు ఏదైనా ధరించొచ్చా..? ఆమె చీరె అవశ్యమైతే, మరి అతడికి ధోవతి, జుబ్బా తప్పనిసరి కావాలి కదా మరి..? అందుకని ఈ రచ్చే అనవసరం... అసలు ప్రి-రిలీజు ఈవెంట్లు, సక్సెస్ మీట్లే పెద్ద సాంస్కృతిక కాలుష్యం... ఇక వాటిల్లో ‘పద్ధతి’ని వెతకడం, ఆశించడం అంతకన్నా పెద్ద *భ్రమపదార్థం..!!
- చివరగా…. నిధి అగర్వాల్ మళ్లీ అలాంటి డ్రెస్సింగుతోనే రాజా సాబ్ ఈవెంటుకు హాజరైంది నిన్న రాత్రి… కాకపోతే ఈసారి చుట్టూ బౌన్సర్లు…!!
నిర్మాత పేరు ఎస్‌కేఎన్… పతంగ్ అనే సినిమా వచ్చింది కదా మొన్న… దాని సక్సెస్ మీట్‌లో మాట్లాడుతూ… ‘‘ప్రెస్‌మీట్‌లో ఏదైనా కంట్రవర్సీ మాట్లాడితే పబ్లిసిటీ వస్తుందని ఈ సినిమా నిర్మాతలకు తెలియదు, సినిమా బాగుంటే ప్రేక్షకులు వచ్చేస్తారు థియేటర్లకు అనుకుంటున్నారు… ఇప్పుడు మొత్తం మారిపోయింది, ఒకడు ఏదో రివ్యూ రాస్తాడు, మరొకరు ఇంకేదో మాట్లాడి అటెన్షన్ తనవైపు తిప్పుకుంటాడు…
ఆడవాళ్లూ మీకిష్టం వచ్చిన, కంఫర్ట్ ఉండే బట్టలు వేసుకొండి… బట్టలు మీపై మీకు నమ్మకాన్నివ్వాలి, అంతేతప్ప ఎవడో బట్టల సత్తిగాడు చెప్పిన మాటల్ని పట్టించుకునే పనేమీ లేదు…’’ అని చెప్పుకొచ్చాడు… సో, శివాజీ తన సినిమా పబ్లిసిటీ కోసం, తనవైపు అటెన్షన్ తిప్పుకోవడం కోసం మాట్లాడిన ఓ బట్టల సత్తిగాడు అని అంటున్నాడన్నమాట..!! ఈ రచ్చ ఇప్పట్లో ఆగేలా లేదు..!!
Share this Article