ఈటీవీ కన్నడ… 2003 నుంచి… అయిదారేళ్లపాటు ఓ సీరియల్‌ను లాగించారు… పేరు ‘గుప్తగామిని’… అందులో ఇద్దరు అక్కాచెల్లెళ్ల పాత్రలు ఉంటాయి… విపరీతమైన మెలోడ్రామా… ఒకరికి తెలియకుండా ఒకరుగా ఆ ఇద్దరూ ఒకే వ్యక్తిని రహస్యంగా పెళ్లి చేసుకుంటారు… ఇంకేముంది..? కథను పదహారు వేల వంకర్లు తిప్పీ తిప్పీ, సాగదీసీ దీసీ… ఏళ్లుగా ప్రసారం చేశారు… ఆ రెండు పాత్రల్ని పోషించిన నటుల పేర్లు పవిత్ర, మల్లిక…
ఆ సీరియల్ టైంలోనే సుచేంద్రప్రసాద్ అనే నటుడు కమ్ దర్శకుడు కమ్ రచయిత కమ్ వ్యాఖ్యాత అందులో నటిస్తున్న మల్లికతో ప్రేమలో పడ్డాడు… ఇద్దరూ థియేటర్ ఆర్టిస్టులు… సమాంతర సినిమా మీద ఆసక్తి ఉన్నవాళ్లు… మంచి ప్రతిభావంతులు… ఇద్దరూ తమ పాత పెళ్లిళ్ల నుంచి విడాకులు తీసుకున్నవాళ్లే… కానీ..?
సీరియల్ నడుస్తున్నట్టుగానే… సుచేంద్రప్రసాద్‌కు మల్లిక మీద ఆసక్తి తగ్గింది… మల్లికకు ఇంకెవరితోనైనా రిలేషన్ పెరిగిందా అనేది తెలియదు… కానీ సుచేంద్ర మాత్రం పవిత్రకు మనసు పారేసుకున్నాడు… సీరియల్ అయిపోయేలోపు… మల్లికకు విడాకులు ఇచ్చేశాడు… పవిత్రను పెళ్లి చేసుకున్నాడు… ఆగండి… ఇక్కడ ఇంకో ట్విస్టు…
Ads
ఆ సుచేంద్రకూ, ఆ మల్లికకు పాత కథలున్నట్టే… పవిత్రకు కూడా ఓ కథ ఉండేది… తను హైదరాబాదులో ఓ సాఫ్ట్‌వేర్ అబ్బాయితో కలిసి ఉండేది… సినిమాలు, సీరియళ్ల కోసం హైదరాబాద్- బెంగుళూరు నడుమ చక్కర్లు కొడుతూ ఉండేది… కానీ ఒక్క ఏడాదే… ఆ రిలేషన్ కటయిపోయింది… సుచేంద్రతో పెళ్లయిపోయింది… మల్లిక ఏమైంది..? ఇంకెవరినైనా చేసుకుందా..? తెలియదు… ఔనా..? పవిత్రకు సుచేంద్రతోకన్నా ముందే పెళ్లయిందా అని ఆశ్చర్యపడకండి… అప్పట్లో పలు కన్నడ పత్రికలు అవే చెప్పాయి మరి…
మధ్యలో మరో పిట్టకథ… ఈ పవిత్ర తండ్రి పేరు లోకేష్… నటుడు… సర్వమంగళ అనే డబ్బింగ్ ఆర్టిస్టును లేవదీసుకుపోయాడు… వాళ్లిద్దరికీ అప్పటికే పెళ్లిళ్లయిపోయాయి… విడాకుల్లేవ్, పెటాకుల్లేవ్… ఫాఫం, సర్వమంగళ భర్త, లోకేష్ భార్య ఒంటరిగానే బతికారు… వేర్వేరుగానే… మళ్లీ పవిత్ర దగ్గరకు వద్దాం…
ఆ సుచేంద్రకూ ఆమెకూ పడలేదు… ఇద్దరు పిల్లలు… పెరుగుతున్నారు… ఐనా సరే, విడిపోయింది… అధికారికంగా విడాకులు వచ్చాయో లేదో తెలియదు… 42, 43 వయస్సుకు చేరుకుంది… ఈలోపు ఓ తెలుగు సీనియర్ నటుడు నరేష్ ఆమె మీద కన్నేశాడు… ఆమె కూడా కన్ను కలిపింది… తను తక్కువేమీ కాదు… ఇప్పటికే మూడు పెళ్లిళ్లయిపోయాయి… 60 ఏళ్లొచ్చాయి… ఆమెతో నాలుగో పెళ్లికి రెడీ అయిపోయాడు… కానీ మాట్లాడితే ఈ పెళ్లిళ్ల సిస్టమే నాన్సెన్స్ అని తిట్టి పోస్తుంటాడు…
సో, ఆయనకు నాలుగో పెళ్లి… ఆమెకు మూడో పెళ్లి అన్నమాట… పోనీ, అధికారికమో, అనధికారికమో గానీ మూడోవాడు… ఆయనకు మూడో పెళ్లాం అధికారికంగా విడాకులు ఇచ్చిందో లేదో తెలియదు… కానీ విడిపోయాడు… ఇదండీ కథ… వెరసి ఈ కథలో నీతి ఏమిటి..? ఏముంది..? అంతగా ఆశ్చర్యపడటానికి..! చెన్నైలో వనిత విజయకుమార్ అనే నటికి ఆల్‌రెడీ అయిదు పెళ్లిళ్లయిపోయాయి… అందరూ పవిత్రను, నరేష్‌ను ఆడిపోసుకుంటారేమిటి అదేదో అసాధారణం అన్నంత హాశ్చర్యంగా…!! ఇంతకీ ఆ మొదటి హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఏమైపోయాడో…!!
Share this Article