పార్ధసారధి పోట్లూరి….. సోషల్ మీడియా, ప్రింట్, ఎలెక్ట్రానిక్ మీడియాలలో ఎన్ని సంఘటనల గురించి ఎన్నో విషయాలు బయటపెడుతున్నా అవేవీ ప్రేమ మైకం కమ్మిన యువతులకి వినపడట్లేదు, కనపడట్లేదు! రెండు రోజుల క్రితం బయట పడ్డ ఢిల్లీ హత్య ఉదంతం ఒక ఉదాహరణ మాత్రమే !
అఫ్తాబ్ అమీన్ పూనావాల [Aftab Ameen Poonawala] మరియు శ్రద్ధ వాకర్ ఇద్దరూ ముంబైలోని ఒక కాల్ సెంటర్ లో పనిచేసేవాళ్ళు. శ్రద్ధ వాకర్ ఫేస్బుక్ లో యాక్టివ్ గా ఉండేది. అఫ్తాబ్ కూడా ఫేస్బుక్ లో యాక్టివ్ గా ఉన్నాడు. అయితే ఒకే కాల్ సెంటర్ లో పనిచేస్తున్న ఇద్దరికీ ఒక డేటింగ్ ఆప్ ద్వారా పరిచయం ఏర్పడింది.
నిజానికి అఫ్తాబ్ అమీన్ పూనావాల హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసి మొదట ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో చెఫ్ గా పనిచేసి, తరువాత వివిధ రెస్టారెంట్స్ కి చెందిన ఫుడ్ ఐటమ్స్ ని ఫోటోలు తీసి వాటిని ప్రమోట్ చేయడానికి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ వాటి మీద వచ్చే ఆదాయంతో బ్రతుకుతున్నాడు.
Ads
మొదట డేటింగ్ ఆప్ ద్వారా పరిచయం అయినా, తరుచూ ఇద్దరు బయట కలుసుకునేవాళ్ళు. ఈ విషయం శ్రద్ధ వాకర్ ఇంట్లో తెలిసిపోయింది. శ్రద్ధ తండ్రి వికాస్ వాకర్ [పాల్ఘార్,మహారాష్ట్ర ] ఇలాంటి పరిచయాలు తీవ్ర పరిణామాలకి దారితీసే ప్రమాదం ఉందని, కాబట్టి మానుకోమని తన కూతురిని గట్టిగానే హెచ్చరించారు. కానీ అప్పటికే ఆర్ధికంగా తన కాళ్ళ మీద నిలబడగల స్టేజ్ లో ఉన్న శ్రద్ధ తండ్రి హెచ్చరికలని పెడ చెవిన పెట్టింది.
ఇలా మూడేళ్ళ పాటు ఇద్దరూ డేటింగ్ ప్రాసెస్ లో ఉన్న తరువాత శ్రద్ధ తల్లితండ్రుల నుండి వొత్తిడి ఎక్కువ కావడంతో ముంబైలో ఉండే కంటే ఢిల్లీ వెళ్ళడం మంచిది అని భావించి, ఇద్దరూ ఢిల్లీలోని బహుళజాతి సంస్థకి చెందిన మరో కాల్ సెంటర్ లో ఉద్యోగం సంపాదించి, ఇద్దరూ ఢిల్లీ వెళ్లిపోయారు. కానీ అఫ్తాబ్ అప్పటికే శ్రద్ధతో పాటు మరో అమ్మాయితో కూడా డేట్ చేస్తున్నాడు కానీ శ్రద్ధకి ఈ విషయం తెలియదు.
***************************
2022, మే నెల మొదటి వారంలో ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లకి జాలీ టూర్ వెళ్ళి వచ్చి, ఢిల్లీకి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న మెహ్రౌలి ప్రాంతంలో ఉన్న చత్తార్ పూర్ పహాడీలో [Chhattarpur Pahadi] ఒక అపార్ట్మెంట్ లోని ఫ్లాట్ ని అద్దెకి తీసుకున్నాడు అఫ్తాబ్ May 8 న… శ్రద్ధ, అఫ్తాబ్ లు ఇద్దరూ ఒకే ఫ్లాట్ లో ఉంటూ సహజీవనం చేయడం మొదలుపెట్టారు.
అఫ్తాబ్ ముందే ఒక కండిషన్ పెట్టాడు, నాతో కలిసి సహజీవనం చేయాలి అంటే నీ కుటుంబం గురుంచి పూర్తిగా మర్చిపోవాలి అని. మొదట్లో శ్రద్ధ నిరాకరించింది కానీ తరువాత అఫ్తాబ్ కండిషన్ కి ఒప్పుకొని తన తల్లితండ్రులు, సోదరుడితో పూర్తిగా తెగతెంపులు చేసుకొని వాళ్ళతో ఫోన్ లో మాట్లాడడం మానేసింది. కనీస శ్రద్ధ తల్లి తండ్రులు మొబైల్ ద్వారా క్షేమ సమాచారం గురించి మెసేజ్ లు పెట్టినా రిప్లై ఇవ్వడం మానేసింది.
తరుచూ అఫ్తాబ్ ఆగ్రహం ఎలాంటిదో ప్రత్యక్షంగా రుచి చూసింది శ్రద్ధ. సహజీవనం మొదలుపెట్టాక ముందు శ్రద్ధ కుటుంబం నుండి వేరు చేశాడు పూర్తిగా! తరువాత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండవద్దు అంటూ ఆంక్షలు విధించాడు. తిరస్కరించిన శ్రద్ధని కొట్టేవాడు. దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడం తగ్గించింది శ్రద్ధ.
తరుచూ ఏదో ఒక ఫోటో పెట్టి యాక్టివ్ గా ఉండే శ్రద్ధ యాక్టివ్ గా లేకపోవడం గమనించిన శ్రద్ధ మరో స్నేహితుడు అయిన లక్ష్మణ్ నాడార్ అనే మరో యువకుడు ఫోన్ చేసి క్షేమ సమాచారం గురించి వాకబు చేయగా, తరుచూ అఫ్తాబ్ నన్ను కొడుతున్నాడు అని బహుశా నన్ను చంపేస్తాడు అని భయంగా ఉంది, కాబట్టి వొకసారి తమ ఫ్లాట్ కి రావాలని అభ్యర్ధించింది శ్రద్ధ. కానీ లక్ష్మణ్ నాడార్ ఈ విషయం గురించి ఆఫ్తాబ్ కుటుంబసభ్యులకి తెలియచేశాడు సమస్య తీవ్రం అవుతున్నది అంటూ.
మేము ఆఫ్తాబ్ తో మాట్లాడుతాము అని తల్లితండ్రులు హామీ ఇచ్చారు లక్ష్మణ్ నాడార్ కి. దాంతో సమస్య పరిష్కారం అవుతుంది అని భావించిన లక్ష్మణ్ నాడార్ తర్వాత శ్రద్ధ అఫ్తాబ్ లు ఉంటున్న ఫ్లాట్ కి వెళ్లలేదు. కానీ శ్రద్ధ సోదరుడితో ఫోన్ లో మాట్లాడాడు సమస్య తీవ్రం కావొచ్చు ఒకసారి ఢిల్లీ వచ్చి తన సోదరితో మాట్లాడమని, కానీ అప్పటికే తన కుటుంబ సభ్యులని దూరం పెట్టిన శ్రద్ధ తమ మాట వింటుంది అని నమ్మకం లేకపోవడంతో ఎలాంటి చర్యా తీసుకోలేదు శ్రద్ధ కుటుంబ సభ్యులు.
************************************
15 May 2022 న అఫ్తాబ్ ని పెళ్లిచేసుకోమని బలవంతం చేయడంలో అఫ్తాబ్ నిరాకరించి శ్రద్ధని తీవ్రంగా కొట్టడంతో చనిపోయింది. ఇక మిగిలింది శ్రద్ధ శవాన్ని ఎలా వొదిలించుకోవాలి ? తాను హోటల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ సమయంలో తెలుసుకున్న దానిని బయటికి తీశాడు. అడుగు పొడుగు కల చెఫ్ లు వాడే రంపం [Saw ] తో శ్రద్ధ శవాన్ని 35 ముక్కలుగా నరికాడు. తరువాత 300 Ltr పెద్ద ఫ్రిడ్జ్ ని ఆన్ లైన్ లో ఆర్డర్ చేసి దానిలో శ్రద్ధ అవయువాలని పెట్టాడు చల్లగా ఉండడానికి, ఎందుకంటే కుళ్లిన వాసన రాకుండా ఉండడానికి. యధాప్రకారంగా తన డ్యూటీకి వెళ్ళే ముందు ఫ్లాట్ నిండా అగరబత్తీలు వెలిగించి వెళ్లిపోయేవాడు.
*************************************
అఫ్తాబ్ ఎంతటి దుర్మార్గుడు అంటే శ్రద్ధ అవయవాలు ఫ్రిడ్జ్ లో ఉంచి, వాటి పక్కనే తాను వాడే కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్ లని పెట్టి వాడిని వాడేవాడు. అంతే కాదు తాను శ్రద్ధతో కాకుండా వేరే అమ్మాయితో టచ్ లో ఉన్నాడు కదా, ఆ అమ్మాయిని శ్రద్ధని చంపిన మరుసటి రోజే తన ఫ్లాట్ లోకి తెచ్చుకున్నాడు. తన రెండో గర్ల్ ఫ్రెండ్ ని ఫ్రిడ్జ్ ని ముట్టుకోనిచ్చేవాడు కాదు.
అమెరికన్ టీవి సీరియల్ Dexter ని స్ఫూర్తి!
Dexter అనే అమెరికన్ సీరియల్ హత్య చేసిన తరువాత ఎలా తప్పించుకోవాలి అనే కధతో నిండి ఉంటాయి చాలా ఎపిసోడ్ లు. అచ్చం Dexter సీరియల్ లో చూపించిన విధంగానే ప్లాన్ చేశాడు. రోజూ అర్ధరాత్రి 2 గంటలకి మెహరౌలీ దగ్గర ఉన్న చిన్న అటవీ ప్రాంతంలో తన కారులో రోజుకో అవయవం పారేస్తూ వచ్చాడు. అలా మొత్తం 35 ముక్కలని రోజుకో ప్రాంతంలో పారేసి వచ్చేవాడు 15 రోజుల పాటు.
శ్రద్ధ స్నేహితుడు లక్ష్మణ్ నాడార్ ఫోన్ చేసినప్పుడల్లా శ్రద్ధ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉండడం జరిగింది. బహుశా అఫ్తాబ్ వత్తిడి వల్ల తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వుండవచ్చు అని భావించాడు లక్ష్మణ్ నాడార్ కానీ ఈ విషయం శ్రద్ధ తండ్రికి ఫోన్ చేసి చెప్పాడు. మే నెలలో శ్రద్ధని అఫ్తాబ్ చంపేస్తే నవంబర్ వరకు ఎవరికీ ఎలాంటి అనుమానం రాలేదు, ఎందుకంటే శ్రద్ధ తల్లితండ్రులని మొదట శ్రద్ధతో సంబంధాలని కట్ చేశాడు అఫ్తాబ్. తరువాత తన క్లోజ్ ఫ్రెండ్స్ తో కాంటాక్ట్ చేయకుండా కట్టడి చేశాడు.
స్నేహితులు కూడా తరుచూ ఫోన్ చేస్తే అఫ్తాబ్ కి కోపం వచ్చి శ్రద్ధని కొడతాడు కాబట్టి రోజూ ఫోన్ చేయడం మానేశారు. అందుకే 5 నెలల నుండి శ్రద్ధ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉన్నా ఎవరూ ఆ విషయం సీరియస్ గా తీసుకోలేదు. కానీ జూన్ నెలలో శ్రద్ధ క్రెడిట్ కార్డ్ కి సంబంధించి తానే పేమెంట్స్ చేశాడు అనుమానం రాకుండా. వారానికి ఒకసారి ఇన్ స్టాగ్రామ్ లో ఏదో ఒక ఫోటో పెట్టేవాడు శ్రద్ధ స్నేహితులకి అనుమానం రాకుండా. కానీ తన కూతురు గురించి ఆందోళనగా ఉన్న శ్రద్ధ తండ్రి వికాస్ గారు ఢిల్లీ వచ్చి తన కూతురు ఆచూకీ తెలియట్లేదు అని ఫిర్యాదు చేశాడు. దక్షిణ ఢిల్లీ పోలీస్ ఇంచార్జ్ అయిన అంకిత్ చౌహాన్ దర్యాప్తు చేపట్టి అఫ్తాబ్ ని అరెస్ట్ చేసి ఇంటరాగేట్ చేసిన తరువాత నిజాలు బయటపడ్డాయి. అఫ్తాబ్ చెఫ్ గా ట్రైనింగ్ అవడం వలన ఎలాంటి కత్తిని వాడాలో బాగా తెలుసు అని అంకిత్ చౌహాన్ వెల్లడించారు.
******************************
మెహ్రౌలి అటవీ ప్రాంతంలో శ్రద్ధ అవయవాలని పారేసిన ప్రాంతాలలో సెర్చ్ చేసిన పోలీసులకి శ్రద్ధ అవయవాలు కొన్ని మాత్రమే దొరికాయి. శ్రద్ధని హత్య చేయడానికి వాడిన కత్తి కూడా దొరకలేదు. కాబట్టి ఈ కేసు పెద్ద చిక్కుముడిగా మిగిలిపోయే అవకాశం ఉంది. ముందు ప్రాసిక్యూషన్ వారు దొరికిన అవయవాలు శ్రద్ధకి సంబంధించినవే అని నిరూపించగలగాలి. అలాగే హత్యకి ఉపయోగించిన కత్తి కూడా దొరకాలి అప్పుడే అఫ్తాబ్ కి శిక్ష పడుతుంది. ఇదంతా జరగడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఎవరూ చెప్పలేరు.
********************************
శ్రద్ధ అమాయకత్వం ఎలా ఉంది అంటే తనకి పరిచయం కాకముందు, పరిచయము అయిన తరువాత కూడా అఫ్తాబ్ కి చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని వాళ్ళ ఫోటోలు కూడా చూసింది కానీ రియలైజ్ అవ్వలేదు. పక్కా యాంటీ హిందూ అని నిరూపించే దీపావళి వ్యతిరేక పోస్టులు తన ఫేస్బుక్ వాల్ మీద ఉన్నా పట్టించుకోలేదు శ్రద్ధ.
అఫ్తాబ్ తనని తాను మహిళా ఉద్దారకుడిగా చెప్పుకునే వాడు ! మహిళా సాధికారిత అంటూ పోస్టులు పెట్టేవాడు. ఇక అఫ్తాబ్ కుటుంబ సభ్యులు చాలా తేలికగా తీసుకున్నారు తమ కొడుకు చేస్తున్న పనిని. ఆఫ్ కోర్స్ ఇప్పుడు డిఫెన్స్ లాయర్ ని కూడా పెట్టి కేసు నుండి బయటపడేయానికి కావాల్సినంతా చేస్తారు.
********************************************
మీడియా నిర్వాకం ఎలా ఉందో ఒకసారి చూడండి !
ఎన్డిటివి హెడ్డింగ్ ఎలా వ్రాసిందో చూడండి : Delhi man killed his girl friend and cut the body into 35 pieces. అఫ్తాబ్ అమీన్ పూనావాల అని మొత్తం పేరు వ్రాయకుండా పూనావాల అని, శ్రద్ధ పేరుని శ్రద్ధ వాకర్ గా కాకుండా వాకర్ అని వ్రాసారు. ఇక్కడ వీళ్ళ జిమ్మిక్కులు ఎలా ఉన్నాయి అంటే చదివే వాళ్ళకి పూనావాల మరియు వాకర్ ల మధ్య ఏదో జరిగిందిలే అని మామూలుగా అనుకోవాలి. వాహ్ ! ఇనసేన్ ఫ్లేవర్ ఆఫ్ సెక్యులర్ జర్నలిజం !
Share this Article