ఖచ్చితంగా మీడియా సర్కిళ్లకు సంబంధించి అది పెద్ద వార్తే… ఇండియాటుడే కన్సల్టింగ్ ఎడిటర్, కాలమిస్టు, న్యూస్ యాంకర్, సీనియర్ జర్నలిస్టును సదరు ఇండియాటుడే సంస్థ హఠాత్తుగా రెండు వారాల సస్పెన్షన్, ఓ నెల జీతం కోత గట్రా సీరియస్ నిర్ణయాలు తీసుకోవడం అనూహ్యం… సరే, ఆయన తరువాత వాళ్లతో కలిసి పనిచేస్తాడా, లేదా… ఆల్రెడీ, నీ కొలువుకో దండంరా బాబూ అని చెప్పేశాడా అనేది వేరే సంగతి… తనతోపాటు మరికొందరు జర్నలిస్టులపై పోలీసులు సీరియస్ కేసులు కూడా పెట్టారు… అయితే ఇక్కడో డౌట్… ఉద్రిక్తతలు పెంచే ‘తప్పు’ చేస్తే జర్నలిస్టులకు ఏమైనా మినహాయింపులు ఉంటాయా..? ఆ చర్చ మాటెలా ఉన్నా… అరె, ఇండియాటుడే వాడికి అంత నియ్యత్, అంత స్టాండర్డ్ ఎక్కడి నుంచి వచ్చినయ్…? రాజ్‌దీప్ తనేదో వ్యక్తిగతంగా ట్వీట్లు చేసుకుంటే, సంస్థ తనకు అట్రిబ్యూట్ చేసుకుని, ఉలిక్కిపడి, చెప్పాపెట్టని చర్యలకు తీసుకునేంత సీన్ ఉందా..? అనే డౌట్ వచ్చింది అందరికీ ఈ వార్తలు చదువుతుంటే…? కానీ…
రాజ్‌దీప్ కొలువుకు, ఇజ్జత్‌కు ఎసరు పెట్టింది ఈ ఫోటో… తను ట్రాక్టర్ ర్యాలీ జరిగిన రోజు పోలీసుల కాల్పుల్లో ఓ రైతు మరణించాడు, నీ త్యాగం వృథా కానివ్వం అంటూ ఏదో ట్వీట్ పెట్టాడు… టీవీలో ఏదేదో ‘ఉద్రిక్తత పెంచే వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలకు దిగాడు’… తరువాత ఆ స్థలానికి వెళ్లాడని ఓ ప్రచారం ఉంది… అదంతా పక్కన పెడితే, నిజానికి ఆ తప్పుడు ట్వీట్ కారణంగా తనను మెడపట్టుకుని బయటికి గెంటేయలేదు… దానికి వేరే కారణం ఉంది… అదే ఈ ఫోటో… రాష్ట్రపతి కోవింద్ మొన్నామధ్య నేతాజీ జయంతి రోజున ఓ చిత్రపటాన్ని రాష్ట్రపతి భవన్లో ఆవిష్కరించాడు… అయితే ఒరిజినల్‌గా నేతాజీ ఫోటో బదులు, గుమ్నామీ మూవీలో నేతాజీగా నటించిన ప్రసేన్‌జిత్ ఛటర్జీ బొమ్మను రాష్ట్రపతి ఆవిష్కరించాడు అంటూ కొందరు తప్పుడు ట్వీట్లు పెట్టారు… ఈ రాజదీపుడు కూడా ఆ పనే చేశాడు… అంత సీనియర్ కదా, ఓసారి కన్ఫరమ్ చేసుకోవచ్చుగా… చేయడు, ఈ తప్పుడు ట్వీట్ల అలవాటు ఉంటే ఇదే నష్టం… ఇదుగో ఆ ట్వీట్… (తరువాత డిలిట్ చేశాడు… దాన్ని కవర్ చేసుకోవడానికి నానా కథలూ పడ్డాడు…)
Ads
ఎవరో సాదాసీదా నెటిజనం, ఏదిపడితే అది ట్వీటితే, సోషల్ మీడియాలో పోస్టితే… చిన్నాచితకా మీడియా సంస్థలు తప్పుడు వార్తలు ప్రసారం చేస్తే, ప్రచురిస్తే రాష్ట్రపతిభవన్ పెద్దగా స్పందించదు… కానీ రాజదీప్ వంటి ఎమినెట్ పర్సనాలిటీ తప్పుడు ట్వీట్ పెడితే ఊరుకోదు… అదీ తనకు సంబంధించిన ట్వీట్ కాబట్టి… అది ఈ దేశంలోకెల్లా అత్యున్నత అధికారాలున్న భవనం కాబట్టి…! రాష్ట్రపతిభవన్ ప్రెస్ సెక్రెటరీ అజయ్ కుమార్ సింగ్ ఓ ఘాటు లేఖ పెట్టాడు ఇండియాటుడే ఛైర్మన్, ఎడిటర్ ఇన్ చీఫ్ అరుణ్ పూరికి… నిజంగా చాలా ఘాటు లేఖయే… సిగ్గూశరం ఉందా మీకు అన్నట్టుగా ఉంది… పొలిటికల్ గెయిన్స్ కోసం బాధ్యతారహితంగా… బాలనేరస్థుల తరహాలో ఉంది మీ సిబ్బంది చర్య అని కడిగిపారేశాడు… అసలు తప్పు జరిగితే, దాన్ని వెంటనే డిలిట్ చేయడమే కాదు, దానికి కారణాలతో సహా హుందాగా క్షమాపణ చెప్పాలి కదా… ఆ ప్రొఫెషనల్ నిజాయితీ ఏమైంది అని ప్రశ్నించింది రాష్ట్రపతి భవన్… అంతేకాదు…
మీ చర్యలు, మీ అడుగులు క్షమార్హం కావు… అందుకని మీ గ్రూపుతో ఎలా వ్యవహరించాలో మేం రివ్యూ చేసుకోవాల్సి ఉంది అని ఆ లేఖలో ముక్తాయింపు ఉంది… అధికారిక భాషలో దానికి కాస్త ఎక్కువ సీరియస్‌నెస్ ఉంటుంది… అరుణ్పూరికి ఎక్కడో సెగ మొదలైంది… నషాళానికి అంటింది… కుతకుతలాడుతున్నాడు, ఈ ట్రాక్టర్ ర్యాలీ రైతు మరణం అనే తప్పుడు ట్వీటు తోడైంది, ఇక సందర్భం వచ్చింది కదా అని స్పందించి, ఇలా రాజదీప్పై చర్యలు… అయితే కాల్పుల్లో ఓ రైతు మరణించాడు అని రాసిన పత్రికలు, ప్రసారం చేసిన టీవీలు (ప్రత్యేకించి లెఫ్ట్ ఓరియంటెడ్) కాల్పుల వల్ల మరణించలేదు అనే నిజం తెలిసి కూడా… ఆ వార్తను అలాగే ప్రచారం చేశాయి… తప్పుడు వార్తలకు క్షమాపణల్లేవ్, వాటి పాఠకుల పట్ల, వాటి ప్రేక్షకుల పట్ల వాటికి గౌరవమూ లేదు… వీటిల్లో తెలుగు మీడియా హౌజులు కూడా ఉన్నయ్… ఎహె, బోలెడు తప్పులు దొర్లుతూ ఉంటయ్, ప్రతిదానికీ ఖండనలు, వివరణలు రాస్తారా అని అంటారా..? అంతేలెండి… మన పత్రికలు, మన టీవీలన్నీ మూసీ మురికి నడుమ కొలువైన టైపు…!!
Share this Article