Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రోజుకు పదివేలు డిమాండ్ చేసే బౌన్సర్లూ ఉన్నారండోయ్…

December 12, 2024 by M S R

.
మోహన్ బాబు ఇంట్లో గొడవల సమయంలో మనోజ్ 30 మంది బౌన్సర్లను తన వెంట రక్షణగా తీసుకెళ్తే ప్రతిగా మంచు విష్ణు 40 మంది బౌన్సర్ల ను తన ఇంటికి కాపలాగా పెట్టుకున్నాడు

అలాగే ఈ మధ్య సెలబ్రిటీలు తమకు రక్షణగా బౌన్సర్లను పెట్టుకుంటున్నారు అని వార్తల్లో చూస్తున్నాం కదా
సినీ హీరో హీరోయిన్ల ఫంక్షన్లలో ఈ బౌన్సర్లు తరచూ మనకి కనిపిస్తుంటారు.

అభిమానులు తోసుకుని సెలెబ్రిటీల మీద పడిపోకుండా రక్షణ కవచంలా ఈ బౌన్సర్లు ఉంటారు
అంతేనా
బారుల్లో కష్టమర్లు మందు ఎక్కువై గొడవ చేసేటప్పుడు ఈ బౌన్సర్లు రంగ ప్రవేశం చేసి అవసరమైతే దేహ శుద్ధి చేసి లైన్లో పెడతారు.

Ads

పెళ్లిళ్లు, ఇతర పెద్ద ఫంక్షన్లలో కూడా బౌన్సర్లు దర్శనమిస్తున్నారు.. అసలు ఈ బౌన్సర్లు ఎవరు?
ఎక్కడ్నుంచి వస్తున్నారు వీళ్లంతా?

ఇంట్రెస్టింగ్ అనిపించి ప్యారడైజ్ దగ్గర కనపడ్డ ఓ బౌన్సర్ ను ఎంక్వైరీ చేస్తే బోలెడు ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయి
ఒక్క హైదరాబాదులోనే వేల కొద్దీ బౌన్సర్లు ఉన్నారు
వీళ్ల గిరాకీ కూడా మాములుగా ఉండదు
ఒక్కోరికి రోజుకి రెండు వేలు మొదలుకుని పది వేల వరకు ఉంది
గన్ లైసెన్స్ ఉన్నవారికి కొంచెమ్ రేటెక్కువ ఉంటుంది

సెలబ్రిటీలు బాడీ గార్డులుగా నియమించుకున్న వాళ్ళు మినహా మిగిలినవాళ్ళకు నెలంతా పని ఉండదు.
మీకు అంతంత రేట్లు ఎందుకు అని బౌన్సర్న్ అడిగితే,

“సార్ మీరన్నది నిజమే.. మా రేటు ఎక్కువే..ఇదే మామూలు సెక్యూరిటీ గార్డ్ అయితే రోజుకి ఐదు వందలకు కూడా దొరుకుతాడు.. కానీ మాకు అదే ఐదు వందలు ఒక రొజు తిండికే అవుతాయి..పైగా వేలకు వేలు కట్టి జిమ్ములో చేరి రోజూ వర్కౌట్స్ చెయ్యాల్సిందే.. అంత తిని అంత వర్కౌట్స్ చేస్తేనే ఈ ఫిట్నెస్ ఉంటుంది..

మామూలు సెక్యూరిటీ గార్డును మమ్మల్ని పక్కపక్కన పెట్టి చూడండి.. విషయం మీకే అర్థమైపోతుంది.. ఇంకో విషయం, సెక్యూరిటీ గార్డులకు నెలంతా పని దొరుకుతుంది.. మాకు గిరాకీ ఎప్పుడు ఎలా ఉంటుందో మాకే తెలీదు..

సినిమా వాళ్ళ పెద్ద ఫంక్షన్లు జరిగాయి అనుకోండి.. సిటీలో బౌన్సర్లు సరిపోరు.. అలాంటప్పుడు ఓ రూపాయి ఎక్కువైనా వాళ్ళు మా వెంట పడతారు.. ఒక్కోసారి రోజుల తరబడి పని ఉండదు “అని చెప్పుకొచ్చాడు.
ఆ బౌన్సర్ చెప్పింది కూడా నిజమే అనిపించింది.

“గొడవలు జరిగినప్పుడు పోలీసు కేసులు అవ్వవా?” అని ప్రశ్నించినప్పుడు ,
” అవుతాయి సార్! కానీ ఆ కేసుల గురించి మమ్మల్ని పెట్టుకున్న సెలబ్రిటీలే చూసుకుంటారు.. మాకు రూపాయి ఖర్చు కాదు.. మహా అయితే ఓ రెండ్రోజులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి ఉంటుంది, అంతేగా” అని నవ్వాడు . వార్నీ అనుకున్నా .. అన్నట్లు లేడీ బౌన్సర్స్ కూడా ఉంటారు. కానీ తక్కువ… – పరేష్ తుర్లపాటి

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఫిక్సింగ్… విజయోత్సవాల్లో ఏదో కుట్రకోణం… 11 మంది ఉసురు తీసిందెవరు..?
  • ఆహా… ఏం తెలివి..? ఆటో-పే సబ్‌స్క్రిప్షన్ తిర‘కాసులు’…!!
  • ఏడీ..? ఏమైపోయాడు నేను ప్రేమించిన ఆ నా మణిరత్నం..?!
  • భారీ డిజాస్టర్ దిశగా థగ్ లైఫ్… హిందీవాడు అడ్డంగా ఛీకొట్టేశాడు…
  • అమెరికా అధ్యక్షుడు… ఆ టేబుల్‌కు ఆ రెండు ఇంపార్టెంట్ బటన్లు…
  • మహేష్ బాబును త్వరగా పంపించేయండి, నిద్రకు ఆగలేడు… కెవ్వు కేక..!!
  • తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం కాక..! అసలు దోషి ఎవరు..?!
  • మిలమిల మెరిసిన తార… వెన్నెల పైటేసిన కిన్నెరసాని…
  • అల్లరి నవ్వుల అల్లు రామలింగయ్య … మనెవ్వరికీ తెలియని ఓ ఫ్లాష్ బ్యాక్ …
  • సో, ప్లీజ్… దయచేసి ఎవరూ ఆ ఇద్దరికి మాత్రం ఈ స్టోరీ చూపించొద్దు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions