రోజూ వంద మంది స్టార్స్ వస్తుంటారు… పోతుంటారు… సినిమా ఇండస్ట్రీ ఓ దీపం… మిడతలు ఆకర్షింపబడుతూనే ఉంటాయి… ఒక లేడీ స్టార్ ఎన్నేళ్లు తెరపై తన సొగసును, తన పాపులారిటీని, తన మెరిట్‌ను, తన జీల్‌ను కాపాడుకుంటూ ఉండగలదు… మహాఅయితే ఆరేడేళ్లు, పదేళ్లు, పదిహేనేళ్లు… అది చాలా ఎక్కువ పీరియడ్… కొన్ని మినహాయింపులు ఉంటాయి… వారిలో త్రిష ఉంటుంది… ఐశ్వర్యారాయ్ ఉంటుంది… సేమ్, అదే లుక్కు… ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఎలాగో… అలాగే…
వీరిద్దరిలోనూ ఐశ్వర్య భిన్నమైన స్టోరీ… 15 ఏళ్ల క్రితమే పెళ్లి చేసుకుంది… బిడ్డకు పదేళ్లు… స్టిల్ ఐశ్వర్య అంటే ఐశ్వర్య, అంతే, ఎవరితోనూ పోలిక లేదు… ఈరోజుకూ మణిరత్నం వంటి దర్శకుడిని ఆమే లీడ్ హీరోయిన్‌గా కావాలి… 48 ఏళ్ల వయస్సులోనూ ఆమె ఆకర్షణ అదీ… ఎప్పుడో మోడల్‌గా 30 ఏళ్ల క్రితం ప్రారంభమైన తన కెరీర్, మిస్ వరల్డ్ మీదుగా, ఇప్పటికీ వన్నె తగ్గని హీరోయిన్‌గా… వావ్… అంతే… ఆమెతో పోలిస్తే త్రిష ఎనిమిదేళ్లు చిన్న…
తను కూడా మోడల్‌గానే కెరీర్ స్టార్ట్ చేసింది… 20 ఏళ్లయింది… స్టిల్ లీడ్ రోల్స్‌కు దర్శకుల చాయిస్… వాళ్లిద్దరూ కలిసి పోటాపోటీగా నటిస్తే..? ఎస్, అదే పొన్నియిన్ సెల్వన్ సినిమా… ఈ రెండు భాగాల సినిమా మణిరత్నం కలల ప్రాజెక్టు… ఇందులో త్రిషది అత్యంత కీలకమైన పాత్ర… కుందవి… కత్తిపట్టకుండా, కిరీటం ధరించకుండా, కుర్చీపై కూర్చోకుండా… చోళ సామ్రాజ్యాన్ని నిర్మించింది, విస్తరించింది, కాపాడింది… పెళ్లి చేసుకోలేదు… మొత్తం పొన్నియిన్ సెల్వన్ చరిత్రలో ఇరుసు వంటి పాత్ర ఆమెది…
Ads
త్రిష ఏమేరకు దానికి న్యాయం చేస్తుందనేది పక్కన పెడితే… ఐశ్వర్యది మరింత మేజర్ పార్ట్… ఆమెవి రెండు పాత్రలు… ఒకటి రాణి నందిని… రెండు మందాకిని దేవి… నిజానికి మణిరత్నం ఆ నవల కంటెంట్‌ను అదే స్పిరిట‌్‌తో తీస్తాడని ఎవరూ అనుకోవడం లేదు… దానికి కారణం, కుందవి పాత్రను నిజంగా దాని ప్రాధాన్యం మేరకు హైలైట్ చేస్తే కార్తి, విక్రమ్ ఇగోలు దెబ్బతింటాయి… సో, కుందవిని అండర్ ప్లే చేస్తాడు… అంతేకాదు, తను ఐశ్వర్యను బాగా ఇష్టపడతాడు, త్రిష పాత్ర ముందు ఆమె రెండు పాత్రలు వెలవెలాపోవడం తనకే ఇష్టం ఉండదు… సో, క్రియేటివ్ ఫ్రీడం విపరీతంగా వాడేస్తాడు…
వీళ్లిద్దరూ గాకుంగా ఐశ్వర్య లక్ష్మి పాత్ర సరేసరి… సముద్రపుత్రిక పూంగరిళి… ఆమెకూ ఓ పాట… కాస్త ఆమె పాత్రకు ప్రాధాన్యం పెంచితే ఆమె పాత్ర డామినేట్ చేసేట్టుగా ఉంది… ఆల్‌రెడీ జలసఖి పాటలో ఆమె అదరగొట్టేసింది… ఎటొచ్చీ ఇక్కడ విక్రమ్, కార్తిల పాత్రలను అండర్ ప్లే చేయకుండా, వాళ్లిద్దరి ఇగోలు కాపాడేందుకు… మరి పెద్ద హీరోలు కదా… కథకు ఇష్టారాజ్యం మార్పులు చేయకతప్పదు… చేస్తాడు… చేశాడు… మగ తోపులు చిన్నబుచ్చుకోవద్దు కదా…
ఇక్కడ అసలైన విషాదం ఏమిటంటే… ఇంత భారీగా ఖర్చు పెడుతున్నారు కదా… మిగతా భాషల్ని వదిలేస్తే… తెలుగులో ఒక్కటంటే ఒక్క పాట ప్రేక్షకుడిని కనెక్టయ్యేలా లేదు… రెహమాన్ సంగీతం ఇంప్రెసివ్‌గా లేదు… ఇలాంటి సినిమాల్లో పాత్రలు, సీన్లు ఎలివేట్ కావాలంటే బీజీఎం అదిరిపోవాలి… అదే మైనస్ అయ్యేలా ఉంది… అలాగే అనువాద డైలాగుల్లో పెద్దగా జీవం ఉండదు… సో, కేవలం త్రిష, ఐశ్వర్యారాయ్, ఐశ్వర్యలక్ష్మిల (48 ఏళ్లు- 40 ఏళ్లు- 32 ఏళ్లు) అందచందాలను తెరపై పరిస్తే సరిపోదు కదా మణిరత్నం సాబ్…!!
Share this Article