ఆగీ ఆగీ… ఆచితూచి… భలే అవకాశాల్ని కొట్టేసింది సాయిపల్లవి… మూడు… ఆ మూడూ ఆమెకు జాతీయ స్థాయిలో పేరు తెచ్చేవి… పేరు తీసుకొస్తాయో లేదో వేరే సంగతి, తను పాన్ ఇండియా స్టార్ కావాలనే ఎయిమ్‌తో కదులుతోంది…
నిజానికి కొన్నేళ్లుగా చూస్తే ఆమెకు మంచి హిట్ లేదు… ఎంచుకున్న పాత్రలు మంచివే… ఆమెను నటిగా ఆవిష్కరించేవే… లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్, విరాటపర్వం, గార్గి… ప్చ్, ఇవే కాదు, ఫిదా తరువాత ఆమెకు బలమైన హిట్ పడలేదు… ఐనా తన డిమాండ్ ఏమీ తగ్గలేదు… కానీ ఒక్కసారిగా వెనక్కి వెళ్లిపోయింది…
హఠాత్తుగా తెర మీద మాయమైపోయింది… చేతిలో సినిమాల్లేవు… సినిమాలు మానేస్తుందని అనుకున్నారందరూ… నో న్యూస్, నో ఇంటర్వ్యూస్… తన పాత్రకు ప్రాధాన్యం ఉండాలి, సగటు హీరోయిన్ వేషాలు తనకు అక్కర్లేదు… ఈ స్థితిలో మళ్లీ ఏదో తమిళ చిత్రాన్ని అంగీకరించినట్టు వార్తలు, ఫోటోలు… మన సినిమా జర్నలిజం గురించి తెలుసు కదా… నో కవర్, నో కవరేజీ… ఆ తమిళ చిత్రం షూటింగు వార్తల్ని కూడా పట్టించుకోలేదు…
Ads
కానీ ఆమె గురించి రాయకతప్పడం లేదు మన సినీ జర్నోలకు… తప్పదు… ఆమెకు రణబీర్‌కపూర్ హీరోగా నితిష్ తివారీ దర్శకత్వంలో రాబోయే రామాయణ కథలో ఏకంగా సీత పాత్ర దక్కింది… ఇది ఎలాగూ పాన్ ఇండియా సినిమాయే… యానిమల్ సినిమాతో రణబీర్ కపూర్ ఒక్కసారిగా అత్యంత భారీ కలెక్షన్ల హీరోగా అవతరించాడు…
సో.., తన పక్కన సీత పాత్ర తప్పకుండా సాయిపల్లవిని జాతీయ స్థాయిలో హైలైట్ చేస్తుంది… ఇదేకాదు, నాగచైతన్య మళ్లీ తనతో జతకడుతున్న సినిమా తండేల్… అదీ పాన్ ఇండియా సినిమాయే… ఇప్పుడు మరో వార్త వినిపిస్తోంది… కేజీఎఫ్ హీరో యశ్ పక్కన నటించబోతోంది… కేజీఎఫ్ రెండు భాగాలూ పాన్ ఇండియా రేంజ్‌లో ఓ లెవల్ కలెక్షన్లను రాబట్టాయి… సో, ఈ సినిమా కూడా తనకు నేషన్ వైడ్ అప్పియరెన్స్ అవకాశం… అన్నింట్లోనూ సహజంగానే ఆమె తన డబ్బింగ్ తనే చెప్పుకుంటుంది… గుడ్…
మూడు సినిమాలు… మూడూ పాన్ ఇండియా సినిమాలు… డబ్బు, పాపులారిటీ తథ్యం… సీత పాత్రను వదిలేస్తే తండేల్, యశ్ సినిమాల్లో ఆమెకు ప్రాధాన్యమున్న పాత్రలు లభిస్తాయా లేదానేది డౌటే… మరి ఆమె పెట్టుకున్న పాత్ర ప్రాధాన్యం అనే రూల్ ఏమైనట్టు..? ఏమో… ఆ సినిమాల్లోనూ ఆమెకు దక్కిన పాత్రలేమిటో రాను రాను తెలుస్తుంది… కాకపోతే ఆమె మళ్లీ తెర మీద విజృంభించపోతుండటం ఆమె అభిమానులకు నచ్చే విషయం… అదీ సంగతి… కాకపోతే మరీ అలా ఎండుకపోయినట్టు గాకుండా ఓ నాలుగైదు కిలోలు పెరిగితే ఇంకాస్త బెటర్… జీరో సైజ్ కాదు, మైనస్ సైజ్‌లా కనిపిస్తోంది…
Share this Article