ఏమిటీ హైపర్ ఆది కూడా జంపా..? అరె, ఇప్పటికే చాలా మంది ఈటీవీకి, మల్లెమాలకు ఓ దండంరా బాబూ అని బైబై చెప్పేస్తున్నారు… రోజా కూడా పోయింది… సుధీర్, ఆటో రాంప్రసాద్ ఎన్నాళ్లుంటారో తెలియదు… గెటప్ సీను కూడా రావడం లేదు… మరి ఈటీవీకి కాస్తోకూస్తో టీఆర్పీ మద్దతు ఇస్తున్న జబర్దస్త్, ఎక్సట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామాకంపెనీ, ఢీ కామెడీ స్కిట్స్ ఎట్సెట్రా ప్రోగ్రాముల గతేమిటి..? ఇంకెవడు చూస్తాడు వాటిని..?
కామెడీ స్టార్స్‌లో చేరిన నాగబాబు కావాలనే అందరినీ మల్లెమాల టీం నుంచి లాగేస్తున్నాడా..? రియాలిటీ షోల రేటింగ్స్ దెబ్బకొట్టడానికి మాటీవీ ప్లాన్‌డ్‌గా వ్యవహరిస్తోందా..? ఇన్నిరకాల చర్చలు సాగుతున్నయ్ కదా సైట్లలో, ట్యూబ్‌లో… కానీ ఓ మార్పు గమనించడం లేదు చాలామంది… హఠాత్తుగా ముగ్గురు మగ కమెడియన్లు, ముగ్గురు ఆడ కమెడియన్లు వెలుగులోకి వచ్చారు… ఏ షో చూసినా వాళ్లే… మరీ ప్రత్యేకంగా చెప్పాలంటే…
పంచ్ ప్రసాద్, ఇమాన్యుయెల్ అలియాస్ ఇమ్ము, నూకరాజు… ఈ ముగ్గురూ ఫుల్లు ఫామ్‌లో కనిపిస్తున్నారు… కామెడీలో భలే టైమింగు కనబరుస్తున్నారు… జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, జాతిరత్నాలు షోలలో వాళ్లే హైలైట్ అవుతున్నారు… వాళ్ల మీద వాళ్లే సెటైర్లు వేసుకుంటూ, నవ్విస్తూ, ఎదుటోళ్ల మీద పంచులు వేస్తూ ఈటీవీ కామెడీ షోలకు ఊతంగా నిలబడుతున్నారు…
Ads
వీళ్లలో పంచ్ ప్రసాద్‌కు రెండు కిడ్నీల సమస్య… నూకరాజుకు సుగర్… నూకరాజు, ఇమ్ము ఇద్దరూ నల్లబంగారాలు… అయితేనేం, ఆ ముగ్గురూ వెలుగుతున్నారు ప్రస్తుతం… టీవీల్లో కామెడీ, రియాలిటీ షోలు చూసేవాళ్లకు అర్థమవుతుంది వాళ్లు ఎంత ఫామ్‌లో ఉన్నారో… ఉదాహరణకు ఈటీవీ ప్లస్‌లో వచ్చే జాతిరత్నాలు అనే స్టాండప్ కామెడీ షో…
వందల మందిని ఆడిషన్లకు పిలిచి, వడబోసి, అనేకమందిని ఎంపిక చేశారు… ప్రతిరోజు అరగంట ప్రోగ్రాం ఉంటే, అందులో ఇద్దరు ముగ్గురు మాత్రమే మూడునాలుగు నిమిషాలపాటు టైం తీసుకుంటున్నారు… చాలామంది అప్‌టు మార్క్ లేరు… కొందరే బాగా చేస్తున్నారు… మిగతా టైం అంతా ఇక ఇమ్మూ, పంచ్ ప్రసాద్, నూకరాజు, శ్రీముఖి తమ కామెడీ పార్టుతోనే లాక్కొస్తున్నారు… శ్రీముఖి ఎనర్జీ, స్పాంటేనిటీ, కామెడీ టైమింగు కొంత ఈ షోకు ప్లస్ అవుతోంది… లేకపోతే ఫట్‌మని పేలిపోయేది…
మరో ముగ్గురు కమెడియన్ల గురించి కూడా చెప్పాలి… ఆడ కమెడియన్లు… లేడీ గెటప్పులతో ఇన్నేళ్లుగా ఈటీవీ నెట్టుకొచ్చింది… జనం కూడా అలవాటయ్యారు… కానీ మెల్లిమెల్లిగా లేడీ కమెడియన్లు కూడా అడుగుపెట్టారు… రోహిణి, ఫైమా, వర్ష… ఈ ముగ్గురూ జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీకి ఊతంగా నిలుస్తున్నారు… కొంతమేరకు బాడీ షేమింగుకు గురవుతూనే మంచి టైమింగుతో, మంచి ఎనర్జీతో భలే కొనసాగుతున్నారు… మగ, ఆడ కమెడియన్లు చాలామంది వస్తున్నారు, పోతున్నారు… కానీ ఆ మగ మూడు, ఈ ఆడ మూడు కేరక్టర్లు నిలదొక్కుకున్నాయి…
మంచిదే… మేం తోపులం అనుకున్న చాలామంది ఈటీవీని వదిలేసి చెంపలేసుకున్నారు… తప్పు తెలుసుకున్నారు… ఇప్పుడూ కొందరు వెళ్లిపోతున్నారు… అదొక ప్రవాహం… ఈమధ్యలో కొన్ని కొత్త కేరక్టర్లు వస్తాయి… తాము నిలబడతాయి… షోలు నిలబెడతాయి… మంచిదే… కొత్త మొహాలు, వైవిధ్యం, కొత్తవారికి అవకాశాలు, ఉపాధి… చూసేవాళ్లకు రిలీఫ్… మంచిదే…!!
Share this Article