Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

థంబ్ నెయిల్ పైత్యానికి పరాకాష్ట… చరణ్‌కు పుట్టింది అసలు పాపే కాదట..!!

June 21, 2023 by M S R

టీవీ ప్రోమోలు ఎలా ఉంటయ్… కావాలనే ప్రేక్షకుల్ని తప్పుదోవ పట్టించి, సీరియల్ మీద ఆసక్తిని క్రియేట్ చేయించే లక్ష్యంతో తిక్కతిక్కగా కావాలనే క్రియేట్ చేస్తుంటారు… అఫ్ కోర్స్, ఇప్పుడు టీవీ ప్రోగ్రామ్స్, షోలకూ ఇదే పైత్యం చూపిస్తున్నారు… ఇక యూట్యూబ్ చానెళ్లయితే మరో ఘోరం… లోపల వీడియోల్లో ఉండేదొకటి, వీళ్ల థంబ్ నెయిల్స్ మరొకటి… ఎవడికి ఆ టైమ్‌కు ఏది తోస్తే అది రాసిపారేస్తుంటారు… ఒకే లక్ష్యం… వ్యూయర్‌ను ఆ వీడియోలోకి తీసుకుపోవాలి… దానికి నానా చెత్తా పోగేసి థంబ్ నెయిల్స్, హెడింగ్స్ పెడుతుంటారు…

దురదృష్టం ఏమిటంటే… వీళ్లంతా జర్నలిస్టులం అని చెప్పుకుంటారు… టీవీ మీడియా, ప్రింట్ మీడియా, వెబ్ మీడియా తరహాలో ఇది థంబ్ మీడియా అట… ప్రేక్షకులంటే హౌలాగాళ్లు, మనం ఏ డర్టీ, అగ్లీ కంటెంట్ ప్రసారం చేసినా చూడక చస్తారా అనుకునే ఓ చానెల్ ఉంది… ఎస్ టీవీ అని లోగోలు, మైకులు కనిపిస్తుంటయ్… పర్సులో యాలకులు, తేనె డబ్బాల్లో ఫోటోలు వంటి భ్రష్ట వీడియోలకు ఆద్యులు వాళ్లే… మిగతావాళ్లు ఇంకా రెచ్చిపోతున్నారు, అది వేరే సంగతి…

ఇప్పుడు ఈ ధోరణికి పరాకాష్ట అని చెప్పదగిన మరో థంబ్ నెయిల్ కనిపించింది… చిరంజీవి మనవరాలి పుట్టుక మీద జనం ఎలాగూ ఆసక్తిగా చూస్తున్నారు కదా… యూట్యూబ్ చానెళ్లు, మెయిన్ స్ట్రీమ్ చానెళ్లు ఏదో ఒకటి చూపించేస్తున్నారు కదాని వైబ్రంట్ టీవీ అట… మేమేదైనా కొత్తగా చెప్పాలి అనుకుని, చెప్పడానికి ఏమీ లేక, అందరూ చెప్పిందే చెప్పీ చెప్పీ చావకొడుతున్నారు కాబట్టి ఇదుగో ఇలా కొత్తగా ట్రై చేశారు… దీనికి పెట్టిన శీర్షిక, థంబ్ నెయిల్, హెడింగ్ ఏమిటో తెలుసా..? ఇండియన్ మెడికల్ హిస్టరీలోనే ఇది ఒక మిరాకిల్… చరణ్‌కు పుట్టింది పాప కాదు…

Ads

వీడియో ఏమిటంటే..? అపోలో మహిళా వైద్యులు చరణ్, ఉపాసనకు ఆడపిల్ల పుట్టిందనీ, ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారనీ, త్వరలోనే ఇంటికి వెళ్లిపోతారనీ చెప్పారు… అంతా శుభమేనని చెబుతూ పనిలోపనిగా ఉపాసనను అభినందించారు… బిడ్డ పుట్టినందుకు కాదు, తను గర్భిణిగా ఉన్నప్పుడు ఫిట్‌నెస్, న్యూట్రిషన్ ఫుడ్ విషయంలో మంచి ప్రమాణాలు పాటించినందుకు… గుడ్… ప్రతి గర్భిణికి ఆదర్శమని చెప్పారు… గుడ్…

డబ్బుంటే ఎవరికైనా తల్లి కాబోతున్నప్పుడు మంచి న్యూట్రిషస్ ఫుడ్ తీసుకోవాలనే ఉంటుంది… శిశువు సరైన పెరుగుదల, గర్భిణి ఆరోగ్యానికి అవి మస్ట్… ఇక్కడి వరకూ వీడియో బాగుంది… కానీ వీళ్లు పెట్టిన థంబ్ నెయిల్ ఎంత దరిద్రంగా ఉంది..? పుట్టింది పాపే కాదట… మరేమిటో… ఇండియన్ మెడికల్ హిస్టరీలోనే ఒక మిరాకిల్ అట… ఆ అద్భుతం ఏమిటో చెప్పి చావడు… ఆ మిరాకిల్ ఏమిటో చెప్పరాదుర భయ్… అసలు, నిజానికి వీళ్లు చిరంజీవి, రాంచరణ్ ఇజ్జత్ తీస్తున్నారా కావాలనే…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఫిక్సింగ్… విజయోత్సవాల్లో ఏదో కుట్రకోణం… 11 మంది ఉసురు తీసిందెవరు..?
  • ఆహా… ఏం తెలివి..? ఆటో-పే సబ్‌స్క్రిప్షన్ తిర‘కాసులు’…!!
  • ఏడీ..? ఏమైపోయాడు నేను ప్రేమించిన ఆ నా మణిరత్నం..?!
  • భారీ డిజాస్టర్ దిశగా థగ్ లైఫ్… హిందీవాడు అడ్డంగా ఛీకొట్టేశాడు…
  • అమెరికా అధ్యక్షుడు… ఆ టేబుల్‌కు ఆ రెండు ఇంపార్టెంట్ బటన్లు…
  • మహేష్ బాబును త్వరగా పంపించేయండి, నిద్రకు ఆగలేడు… కెవ్వు కేక..!!
  • తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం కాక..! అసలు దోషి ఎవరు..?!
  • మిలమిల మెరిసిన తార… వెన్నెల పైటేసిన కిన్నెరసాని…
  • అల్లరి నవ్వుల అల్లు రామలింగయ్య … మనెవ్వరికీ తెలియని ఓ ఫ్లాష్ బ్యాక్ …
  • సో, ప్లీజ్… దయచేసి ఎవరూ ఆ ఇద్దరికి మాత్రం ఈ స్టోరీ చూపించొద్దు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions