నేను ప్యూర్ బెంగాలీ లోకల్… గుజరాతీ వాళ్లను రానిస్తామా..? నేను బ్రాహ్మణురాలిని… నేను హిందూ మహిళను… రోజూ చండీపారాయణం చేస్తే తప్ప ఇంటి నుంచి బయటికి రాను తెలుసా..? మంత్రపఠనాల్లో నాతో ఎవరు పోటీకి వస్తారో రండి, కమాన్… అంటూ మమత బెనర్జీ ఓ సగటు ఇండియన్ లీడర్ అవసరార్థం వేషాలన్నీ నటిస్తోంది… చివరకు ఎవరో నన్ను తోసేశారు, కాలు బెణికింది, ఛాతీ నొప్పి, నడుం నొప్పి అని ఏడుపు మొహం పెట్టింది… కొంతకాలంగా తన ఫైటింగ్ స్పిరిట్ కోల్పోయి, ఆడుతున్న హిపోక్రటిక్ డ్రామాల్లో ఇది పరాకాష్ట… వీటన్నింటి వెనుకా ప్రశాంత్ కిషోర్ ఉన్నాడా, ఆమె సొంత పైత్యమా వదిలేస్తే… మనకు ఇన్నాళ్లూ కనిపిస్తున్న సివంగి స్థానంలో ఇంకెవరెవరో కనిపిస్తున్నారు… నో డౌట్… ఈమె మమత కాదు… ఇంకెవరో… ఇంకెవరో… ఎందుకు అనుకోవాల్సి వస్తున్నదో చెప్పుకుందాం… ముందుగా ఒక డిస్‌క్లెయిమర్… మోడీ, అమిత్ షా బెదిరింపుల రాజకీయాలకు వెరవకుండా, ఏం చేస్తారో చేయండి అని తల ఎగరేసి మరీ నిటారుగా నిలబడిన లీడర్ ఆమె… ఈ రేంజ్ పొలిటికల్ ప్రత్యర్థిత్వం దేశంలో ఏ నాయకుడికీ చేతకావడం లేదు… ఆమె మళ్లీ బెంగాల్ ముఖ్యమంత్రి అయితే మంచిదే… బలంగా ప్రశ్నించగల ప్రతిపక్షం ఉండాలనే కదా మనమూ కోరుకోవాల్సింది… ఎటొచ్చీ తన ఒరిజినాలిటీని కోల్పోయిన తీరే ఆమె పట్ల సానుభూతి చూపించేలా చేస్తున్నది… తన హత్యా రాజకీయాలతో బీజేపీ, సీపీఎం, కాంగ్రెస్ శ్రేణులు గంగవెర్రులెత్తేలా వెంటాడి, వేటాడిన లీడరేనా ఈమె అనిపించేలా చేస్తున్నది…
- నేను ప్యూర్ బెంగాలీ… గుజరాతీ వాళ్లను రానిస్తామా అనేది ఆమె నినాదం… ఆమె బెంగాలీ కాదని ఎవరన్నారు…? రేప్పొద్దున టీఎంసీ దెబ్బతిని, బీజేపీ ఒకవేళ గెలిచినా బెంగాలీయే సీఎం అవుతాడు… ఒక సివంగి మమత బదులు, ఒక బెంగాలీ టైగర్ సౌరవ్ గంగూలీ కావచ్చు… ఒక బెంగాలీ త్రాచుపాము మిథున్ చక్రవర్తి కావచ్చు… ఇంకెవరైనా కావచ్చు కదా…
- నేను బ్రాహ్మణురాలిని అనేది మరో క్లెయిమ్… అవును, నువ్వు పుట్టుక రీత్యా బ్రాహ్మణురాలివే, కాదని ఎవరన్నారు..? నీ రాజకీయ విధానాల్ని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి… దానికి జవాబు చెప్పకుండా బ్రాహ్మణురాలిని అని చెప్పడం అంటే… బ్రాహ్మణులకే అగ్రాసన అర్హత అని పరోక్షంగా చెబుతూ, అగ్రవర్ణిజాన్ని బయటపెట్టుకుంటున్నట్టా..?
- నేను హిందూ మహిళను, రోజూ చండీపారాయణం చేసి గానీ బయటికి రాను… మంత్రపఠనాల్లో నాతో పోటీకి రండి…. ఇది మరో సవాల్… హిందూ అయితే తప్పకుండా పూజలు, పునస్కారాలు చేయాలా..? చండీపారాయణాలు చేయాలా..? లేకపోతే హిందూ అనిపించుకోరా..? ఇదెక్కడి దరిద్రపు వాదన..? హిందువుల్లో నాస్తికులు లేరా..? ఉండకూడదా..? నువ్వు శ్లోకాలు బాగా చదివితే మాంచి నాణ్యమైన హిందువు అవుతావా..? ఇదేం భావజాలం..? ఎటు తీసుకుపోతున్నట్టు..?
- నేను బెంగాలీ, నేను హిందూ, నేను బ్రాహ్మిణ్ అని పదే పదే చెప్పుకోవడం సరే గానీ… బెంగాలీ సంస్కృతిలో కొట్టొచ్చినట్టు కనిపించే బొట్టు ముఖ్యం… ఇస్లామిక్ హిస్టరీలో పీజీ చేసిన మమత బొట్టు ఎందుకు పెట్టుకోదు అనే ప్రశ్నకు మాత్రం జవాబు దొరకదు…
- ఇప్పుడు ఎవరో నలుగురు తనను కారులోకి తోసి, బలవంతంగా డోర్ వేశారు… ఇదీ క్లెయిమ్… ఎవరో కుట్రతో చేశారని ఆమె పరోక్షంగా చెబుతోంది… సరే, వాళ్లు బీజేపీయా, సీపీఎమ్మా వదిలేద్దాం… కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర దాకా ఎవరో నలుగురు వచ్చి కారులోకి నెట్టేశారంటే… అసలు ఆమె దగ్గర దాకా వెళ్లారంటేనే… అనూహ్యంగా ఉంది…! చివరకు సీఎం రక్షణకు కూడా దిక్కు లేదా..? ఆమె పాలనలో పోలీసు వ్యవస్థ అంత నిర్వీర్యమైపోయిందా..? తనే సిగ్గుపడాలి… పోనీ, ఆమె చుట్టూ ఉండే టీఎంసీ కార్యకర్తలు ఏమయ్యారు..? కత్తులు, కటార్లతో తిరుగుతూ ఉంటారు కదా…
- నిజంగానే ఆమె మీద దాడికి వస్తే.., జస్ట్, అలా కారులోకి తోసేసి, డోర్ బలవంతంగా వేసేసి వెళ్లిపోతారా దుండగులు..? ఇదేమైనా తెలుగు టీవీ సీరియలా..? అర్థంపర్థం లేకుండా పాత్రలు బిహేవ్ చేయడానికి..?
- నిజానికి కారు డోర్ తెరిచి ఉంచి, ఆమె జనానికి అభివాదం చేస్తుంటే… కారు మెల్లిగా కదులుతోంది… డ్రైవర్ సరిగ్గా గమనించలేదు, ఒక మూడు ఫీట్ల పిల్లర్‌కు కారు డోర్ తగిలి, అది విసురుగా మూసుకుపోయింది… దాంతో ఆమెకు దెబ్బ తగిలింది… ఇదీ జాతీయ మీడియా కథనం…
- అకస్మాత్తుగా తను మహానటి వేషం వేయటానికి కారణాలు, ఆశించే ప్రయోజనాలు ఏమైనా సరే… ఈ నాటకం ఏదో బెడిసికొట్టినట్టే అనిపిస్తోంది… రేప్పొద్దున ఆమె గెలిచి మళ్లీ సీఎం అయినా సరే… గెలవడానికి ఆమె పడ్డ ప్రయాసలు, వేసిన వేషాలు కనిపిస్తాయే తప్ప… నిజంగా పోరాడి గెలిచే దూకుడు స్వభావి, ఆ పాత మమత మాత్రం మళ్లీ కనిపించదు… చివరగా…. మమత మేనల్లుడు, టీఎంసీ చక్రధారి అభిషేక్ బెనర్జీ పొలిటికల్ ట్వీట్ ఇది చూడండి…
.@BJP4Bengal Brace yourselves to see the power of people of BENGAL on Sunday, May 2nd.
Get READY!!! pic.twitter.com/dg6bw1TxiU
— Abhishek Banerjee (@abhishekaitc) March 10, 2021
Ads
Share this Article