.
హీరో అజిత్… తను రీల్ హీరో మాత్రమే కాదు… రియల్ హీరో కూడా… చాలా అంశాల్లో..! ఓ హైదరాబాదీ బైక్ మెకానిక్ కోట్ల మంది అభిమానించే హీరోగా రాణించడం మాత్రమే కాదు… తను ఫార్ములా కార్ రేసర్, డ్రోన్ల నిర్మాత… వాట్ నాట్..? ఈ వైట్ అండ్ వైట్ ఫేస్ హీరో కంప్లీట్లీ డిఫరెంట్…
డౌట్ టు ఎర్త్ మనిషి… తన జీవిత కథ మొత్తం ఇక్కడ మళ్లీ మళ్లీ చెప్పదలుచుకోలేదు గానీ… తన మెంటాలిటీ, తన పర్సనాలిటీ ఏమిటో చెప్పే ఓ ఉదాహరణ చెప్పుకుందాం… హిపోక్రసీకి, డాంబికాలకు, పొగరుబోతు తత్వాలకు, చిల్లర వేషాలకు పేరుమోసిన ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తను మంచి ఒద్దికైన హీరో అనిపిస్తాడు…
Ads
నిజానికి ఇది ఓ పాత కథ… కానీ జర్నలిస్టు పాండ్యన్ తాజాగా రివీల్ చేశాడు ఏదో ఇంటర్వ్యూలో… అదిప్పుడు తమిళనాట వైరల్… ఆ కథేమిటంటే..?
అజిత్ బేబీ నటి నుంచి హీరోయిన్‌గా ఎదిగిన షాలినిని పెళ్లి చేసుకున్నాడు తెలుసు కదా… సినిమా కెరీర్ మొదట్లో సరైన హిట్లు లేక నిలదొక్కుకోవడానికి ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో తమిళ జర్నలిస్టులకు, ప్రత్యేకించి గాసిప్స్, చెత్తా కల్పిత కథనాలు రాసుకునే మ్యాగజైన్లకు అజిత్ అంటే తేలికభావం…
పెళ్లయ్యాక రెండేళ్ల దాకా పిల్లల్లేరు, కావాలనే వాళ్లు గ్యాప్ తీసుకుని ఉండవచ్చు… కానీ తిరైచ్ఛువై అనే ఓ పత్రికలో విజయ్ అనే జర్నలిస్టు (?) అజిత్‌కు మగతనం లేదు, అందుకే పిల్లలు పుట్టడం లేదు, కుటుంబంలో కలహాలు మన్నూమశానం అని ఏదేదో రాసిపారేశాడు…
తమిళంలో అలాంటి మ్యాగజైన్లు అప్పట్లో బాగానే ఉండేవి… ఇప్పుడు అధికశాతం యూట్యూబ్ చానెళ్లుగా, సోషల్ మీడియా వేదికలుగా మారిపోయాయి, అది వేరే సంగతి… ఆ కథనం చదివి అజిత్ ఏమీ ఉడుక్కోలేదు, మరీ తెలుగు ఇండస్ట్రీ పెద్దల్లా బూతులంకించుకోలేదు… సింపుల్‌గా నవ్వుకుని ఊరుకున్నాడు… తన పొటెన్సీకి ఇతరులు సర్టిఫికెట్లు ఇవ్వనక్కర్లేదు కదా అనుకున్నాడేమో…
అదే విజయ్ కొన్నాళ్లకు గుండెపోటుకు గురై ఆసుపత్రిలో పడ్డాడు… సగటు జర్నలిస్టు బతుకు అంతే కదా… కష్టంలో ఎవడూ ఆదుకోడు, రాడు, చేయూతనివ్వడు… జర్నలిస్టు జోష్‌లో ఉన్నప్పుడే లోకం కనిపించదు… అదొక ఐరనీ… ఈ విషయం తెలిసి అజిత్ స్వయంగా హాస్పిటల్‌కు వెళ్లాడు… 2.5 లక్షలు ఇచ్చాడు…
వాడికి నువ్వు సాయం చేయడం ఏమిటి అని పీఆర్ఓ ఎవరో అడిగాడు… ‘‘బలంగా ఉన్నప్పుడు గొడవపడొచ్చు, నేను అదీ చేయలేదు, పైగా తను నిస్సహాయంగా బెడ్ మీద పడున్నాడు, ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే అది అమానుషం… పర్లేదు, ఇలాంటప్పుడు మనం సాయం చేస్తేనే నిజమైన మనుషులం’’ అన్నాడు… వావ్…
ఈ ఒక్కటీ చాలు, తను ఎంత ఎత్తులో నిలబడ్డాడో చెప్పడానికి..! తను బోలెడు గుప్తదానాలు చేస్తాడు, ఒక్కటీ చెప్పుకోడు… స్వీయ పొగడ్తలు, అంటే స్వకుచమర్దనాలు ఉండవు… తన స్టాఫ్‌కు ప్రత్యేకంగా ఇళ్లు కట్టించాడు తను… ప్రత్యేకించి మన సౌత్ హీరోలు కొందరు తత్వాలను గమనిస్తూ ఉంటాం కదా… ఒక్కసారి అజిత్‌తో పోల్చుకుంటే హస్తిమశకాంతరం… దానికి వివరంగా అర్థం అడక్కండి… అందరికీ తెలుసు..! అందుకే ఆ వార్త అంత బాగా నచ్చింది… నీకు చప్పట్లు బ్రదర్…
ఈ హీరో గురించి గతంలో ముచ్చట రాసిన ఓ కథనం… ఇంట్రస్టు ఉన్నవారు ఓ లుక్కేయొచ్చు… ఇదీ లింక్…
హీరో అంటే అజిత్..! సోకాల్డ్ హీరోల లక్షణాలేమీ కనిపించని విశిష్ట హీరో..!!
Share this Article