కాదు, ఇప్పుడు చెప్పుకునేది లీనా మణిమేఖలై అనే గొప్ప సృజనాత్మక ఉభయలింగజీవి క్రియేట్ చేసిన కాళి పోస్టర్ గురించి కాదు… దానిపై వార్తల సమాహారం గురించీ కాదు… ఈ దేశంలో హిందువులకు వ్యతిరేకంగా వ్యవహరించడమే ఘనమైన లౌకికతత్వం అనే భ్రమాత్మక మూర్ఖత్వంతో వ్యవహరించే వాళ్ల గురించి కూడా కాదు… అలాంటోళ్లకు దేశంలో కొదువ లేదు… శశిధరూర్ దగ్గర నుంచి తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా దాకా బోలెడు మంది…
సరే, మహువా నోరు పెద్దది… పైగా మమత పక్కా హిందూవ్యతిరేకి… ఇంకేం..? నాకు మంచి మార్కులు పడతాయని అనుకుందేమో… మణిమేఖలై పోస్టర్‌లో తప్పేముంది అనే భావనలతో ‘‘నాకు తెలిసి కాళి పొగతాగుతుంది, మందు తాగుతుంది… డౌటుంటే తారాపీఠం వెళ్లి చూడండి’’ అంటూ ఏదేదో రెచ్చిపోయింది… అసలే దేశంలో నూపుర్ శర్మ వ్యవహారంలో హిందూ సమాజం తీవ్ర అసహనంతో ఉంది… సరే, లీనాపై కేసులు, మహువాపై కేసుల సంగతి అటుంచితే… ఆ వాదనల లోతుల్లోకి వెళ్లకుండా… ఒక్క విషయం చెప్పుకుందాం…
ఈ దేశంలో పిల్లగాడిని అడిగినా చెబుతాడు, మమత అనే కేరక్టర్ హిందుత్వకు ఎలా వ్యతిరేకో… అసలు హిందూ మతాన్ని వ్యతిరేకిస్తేనే నిజమైన లౌకికవాదమనే మూర్ఖత్వానికి ఆమె ప్రతీక… అదేమంటే యాంటీ బీజేపీ… అసలు హిందూమతానికి బీజేపి ఓనర్‌షిప్ ఏమిటనే కామన్‌సెన్స్ కూడా ఆమెలో కనిపించదు… అఫ్‌కోర్స్, అలాంటి పార్టీలు, నాయకులకు దేశంలో కొదవ లేదు… హిందూ మతం వేరు, బీజేపీ వేరు అనే సోయి లేని డొల్ల బుర్రలు…
Ads
సరే, ఆ చర్చ జోలికీ వద్దు ప్రస్తుతానికి… మహువా వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం, వాటితో మా టీఎంసీకి సంబంధం లేదు, మేం ఎండార్స్ చేయడం లేదు, అవి మా పార్టీ విధానవ్యాఖ్యలు కావు అని టీఎంసీ అధికారికంగా మహువా వ్యాఖ్యల్ని ఖండించింది… ఒకరకంగా ఆమెకు చెంపదెబ్బ… నేనేం మాట్లాడినా చెల్లుతుందనే ఆమె నమ్మకానికి బలమైన గండి అది… ఇది దేశవ్యాప్తంగా ఆసక్తిని రేపింది… మమత పార్టీ తమ సహజమైన పద్ధతిలో తమ పార్టీ ఎంపీని వెనకేసుకురాకపోవడం ఆశ్చర్యాన్ని రేకెత్తించింది…
ఒకరకంగా టీఎంసీ ఇలాంటి వివాదాస్పద అంశాల్లో వేళ్లు, కాళ్లు పెట్టకండి అంటూ ఓ కఠినమైన హెచ్చరిక జారీచేయడం వంటిది… ఇక ఇప్పుడేం మాట్లాడాలో మహువాకు నోరు పెగలడం లేదు… కిక్కుమనడం లేదు… అంతకుముందు ‘‘నా మాటలన్నీ కరెక్టే, నేనెవరికీ భయపడను’’ అంటూ మేకపోతు గాంభీర్యాన్ని కనబర్చిన మహువా మొహాన ఇప్పుడు కత్తివేటుకు నెత్తుటి చుక్క లేదు… అయితే మమత పార్టీ హఠాత్తుగా తన సహజమైన హిందూవ్యతిరేక భిన్నమైన వైఖరిని ఎందుకు తీసుకుంది…?
ఆల్‌రెడీ… బీజేపీ ద్రౌపది ముర్మను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించాక మమత మొహం మాడిపోయింది… ముందే చెబితే బాగుండు అని ఏదో కవరింగు ఇచ్చుకుంటున్నా సరే, అనవసరంగా యశ్వంత్‌ను ముందుపెట్టి తప్పు చేశాననే ఫీలింగ్ ఆమెను కిందామీదా పడేస్తోంది… వెరసి యశ్వంత్ వోట్ల పరిస్థితి ఘోరంగా ఉండబోతోంది… ఈ దెబ్బతో ఉపరాష్ట్రపతి అభ్యర్థిత్వంపై ప్రస్తుతం మమత ఫుల్లు సైలెంట్… కాంగ్రెస్ మరీనూ…
రాష్ట్రపతి అభ్యర్థిత్వంపై జేడీఎస్, బిజూజనతాదళ్, జేఎంఎం తదితర పార్టీలు ఆల్రెడీ మమతకు షాక్ ఇచ్చాయి… వోటింగు నాటికి బహుశా కేసీయార్ ఒక్కడే మిగులుతాడేమో యశ్వంత్ వెంబడి… ఏమో, ఆత్మప్రబోధం కోణంలో అదీ డౌటే… ఐనాసరే, మమత మొండిది… యాంటీ హిందూ ధోరణిలో రాజీపడదు… పడ్డట్టు చరిత్రలో లేదు… ఆమె నమ్ముకున్న ప్రశాంత్ కిషోర్ అనే ప్రమాదకర వ్యూహజిస్టు పడనివ్వడు… ఈ నేపథ్యంలో మహువా వ్యాఖ్యల పట్ల ఆమె ఎందుకింత కఠినంగా ఉన్నట్టు..? భలేవారే… విశ్లేషణలకు లొంగితే ఆమెను మమత అని ఎందుకంటారు..?!
Share this Article