.
అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమా… టీవీ యాంకర్ ప్రదీప్ హీరో, మరో టీవీ యాంకర్ దీపిక హీరోయిన్… మస్తు ప్రచారం చేసుకున్నారు టీవీ షోలకు తిరుగుతూ… సహజం, అవసరం…
ఇక్కడ సినిమా గుణవిశేషాలు, సమీక్ష జోలికిపోవడం లేదు… కానీ వసూళ్లు చూద్దాం… మొదటి రోజు కేవలం 15 లక్షలు… 9 వ రోజు నుంచి 14వ రోజు వరకు రోజుకు జస్ట్ లక్ష రూపాయలు… స్థూలంగా 1.3 కోట్లు… ఏం చెబుతున్నాయి ఈ అంకెలు…? డిజాస్టర్ అని మాత్రమే కాదు… జనం థియేటర్లకు రావడం లేదు అని అర్థం..!!
Ads
అవును, మౌత్ టాక్ బలంగా వచ్చిన సినిమా అయితే థియేటర్ వెళ్లడానికి కాస్త ధైర్యం చేస్తున్నారు… సంక్రాంతికి వస్తున్నాం, పుష్ప-2, మ్యాడ్ స్క్వేర్, ఈమధ్య కాస్త కోర్టు… వెరీ సెలెక్టెడ్… ఎండలు, ఐపీఎల్, పరీక్షలు వంటి ఎన్ని కారణాలు చెప్పుకున్నా సరే, మరీ ఏప్రిల్ నెల ఇండస్ట్రీకి చుక్కలు చూపించింది…
నిర్మాతలు రివ్యూయర్లను తిట్టుకున్నా ఎవడూ చేయగలిగేదేమీ లేదు… జస్ట్, ఓటీటీ ఇప్పుడు… నువ్వు టీవీల్లో వేసినా ఎవడూ చూడడు… పర్సుకు బొక్క పెట్టుకుని థియేటర్‌కు పోడు… ఆ సినిమాయే కాదు… కొన్నాళ్లుగా మన సినిమాల వసూళ్లు చూద్దాం….
అంత పెద్ద హీరో నటించిన తుడరం సినిమాకు తెలుగులో 3 రోజుల్లో జస్ట్ 46 లక్షలు… ఓ మోస్తరు రివ్యూలు వచ్చినా సరే సారంగపాణి జాతకం సినిమాకు ఇప్పటికి 1.69 కోట్లు మాత్రమే వసూళ్లు… సక్సెస్ అని ఫంక్షన్ కూడా జరుపుకున్న విజయశాంతి సినిమా అర్జున్ సన్నాఫ్ వైజయంతి వసూళ్లు 12 కోట్లు దాటలేదు…
తమన్నా నటించిన ఓదెల-2 వసూళ్లు 5.5 కోట్లు… రాబిన్‌హుడ్ ఫ్లాప్, జాక్ ఫ్లాప్… అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ వసూళ్లు తమిళంలో 145 కోట్లు, తెలుగులో 6 కోట్లు… మొత్తం 266 కోట్ల వసూళ్ల లెక్కలు చూపిస్తున్న పాన్ ఇండియా సినిమా ఎల్2 ఎంపురన్‌కు తెలుగులో 2.5 కోట్లు మాత్రమే… వన్ పర్సెంట్…
ఈమధ్య మేం మునిగిపోతున్నాం మహాప్రభో అని మలయాళ ఇండస్ట్రీ మొత్తుకుంటోంది… లెక్కలు, నష్టాలు వివరిస్తూ… తెలుగు సినిమా అంత బాగా ఏమీ లేదు అని చెప్పడానికి ఇవన్నీ లెక్కలు చెప్పింది ఇక్కడ… శాండల్ వుడ్ పరిస్థితి ఇంకెంత ఘోరంగా ఉందో కూడా నిన్న చెప్పుకున్నాం కదా…
నిన్నమొన్నటిదాకా హిందీ సినిమా పని ఖతం అనే ప్రచారం జరిగింది, థియేటర్లు ఖాళీ కదా… ఇప్పుడు తెలుగులోనూ అంతే… చాలా సినిమాల్ని మొదటి రోజే ఎత్తిపారేస్తున్నారు, షోలు కేన్సిల్ చేస్తున్నారు… యాక్యుపెన్సీ చూస్తూ థియేటర్ల యజమానులు లబోదిబో… ఇక బయ్యర్ల సిట్యుయేషన్ చెప్పనక్కర్లేదు…
ఓటీటీ, ఆడియో రైట్స్, శాటిలైట్, ఓవర్‌సీస్ రైట్స్ మన్నూమశానం అని ఎన్ని చెప్పినా సరే… సగటు సినిమా నిర్మాణ వ్యయం తగ్గకుండా ఇండస్ట్రీ బాగుపడదు… కానీ దురదృష్టం ఏమిటంటే… అది అనూహ్యంగా, అసాధారణంగా పెరిగిపోతూనే ఉంది… ఇంకా కారణాలు అనేకం… అనేకం…!!
Share this Article