మామూలుగా చాలా వెబ్ సైట్లలో సినిమా తారల తాజా ఫోటోలు, పాత ఫోటోలు వేస్తుంటారు… వాటికి క్లిక్స్, వ్యూస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కొత్త కొత్త ఫోటోలను పబ్లిష్ చేస్తుంటారు… కాస్త హాట్, బోల్డ్ సినిమా తారలైతే ఎక్కువ ఫోటోలను గుప్పిస్తుంటారు… సరే, అదంతా సైట్ల వ్యూయర్ షిప్, క్లిక్స్ పెంచుకోవడం కోసం ఏదో ప్రయత్నం… దాన్ని తప్పుపట్టడానికి ఏమీ లేదు… ఆసక్తి ఉన్న పాఠకులు ఆ ఫోటోలను చూస్తారు, లేదంటే లేదు…
కానీ సాక్షి వెబ్‌సైట్‌లో ఓ వార్త విచిత్రంగా కనిపించింది… మన స్టేట్ సర్వీస్‌కే చెందిన ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి కొన్నేళ్లు కేంద్ర ప్రభుత్వంలోకి డిప్యుటేషన్ మీద వెళ్లి, మళ్లీ ఈమధ్య రాష్ట్రానికి తిరిగి వచ్చేసింది, తెలుసు కదా… ఆమెకు హెచ్‌ఎండీఏలో జాయింట్ కమిషనర్‌గా పోస్టింగ్ ఇచ్చారు… మూసీ డెవలప్‌మెంట్ అథారిటీ ఆమె బాధ్యత… మొన్నీమధ్య హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ఎండీగా అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు…
Ads
నిజానికి అది పెద్ద వార్తేమీ కాదు… హెచ్ఎండీఏలో ఉన్నతాధికారులకు ఈ అదనపు బాధ్యతలు ఇస్తుంటారు… ఆమెకు ఇవి గాకుండా మరొకటో రెండో అదనపు బాధ్యతలు కూడా ఇచ్చినట్టున్నారు… సరే, అదంతా వేరే కథ… కానీ ఈ వార్త రాస్తూ సాక్షి సైట్ ఆమెవి ఏకంగా 50 ఫోటోలు పెట్టింది… ప్రతి ఫోటో కింద ‘‘హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ ఆమ్రపాలికి హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్) మేనేజింగ్ డైరెక్టర్‌గా ప్రభుత్వం పూర్తి స్థాయి అదనపు బాధ్యతలను అప్పగించింది’’ ఇదే రైటప్… సింగిల్ సెంటెన్స్ న్యూస్‌కు 50 ఫోటోలు అనేది విస్మయకరం…
ఆ ఫోటోల్లో ఆమె కాలేజీ చదువు, ఐఏఎస్ శిక్షణ, ఆమె పెళ్లి, వరంగల్ కలెక్టర్‌గా ఉన్నప్పటి ఫోటోలు సహా ఆమె లైఫ్ ఆల్బమే పబ్లిష్ చేసినట్టుగా ఉంది… అసలు ఆ చిన్న వార్తకూ ఆమెవి అన్ని ఫోటోలు వేయడానికి లంకె ఏమిటి అసలు..? ఆమె ఓ ఐఏఎస్ అధికారిణి, సినిమా తార కాదు… వోకే, ఆమె అందంగా ఉంటుంది, అయితే మాత్రం అలా ఏకంగా 50 ఫోటోల్ని వేసేయడమేనా..? పైగా ఆ వార్త దగ్గర…!!
https://www.sakshi.com/photos/news/ias-officer-amrapali-kata-best-photos-1883208#2
తెలంగాణ సర్వీసులోనే చూసుకుంటే బోలెడుమంది లేడీ ఐఏఎస్ ఆఫీసర్లు అందంగా, మోడరన్‌గా కూడా ఉంటారు… అంతెందుకు..? మొన్నమొన్నటిదాకా తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక స్థానంలో ఉండి, ప్రభుత్వం మారగానే ఇప్పుడు లూప్‌లైన్‌లోకి వెళ్లిపోయిన స్మితా సభర్వాల్ కూడా ఆమ్రపాలికి తక్కువేమీ కాదు… ఆమె పర్సనల్ సోషల్ ఖాతాల్లో అందమైన ఫోటోలు బోలెడు… బట్ అది ఆమె పర్సనల్… పలువురు జూనియర్ ఐఏఎస్‌లు కూడా అందంగా ఉంటారు అలా… అయితే వాళ్లు అడ్మినిస్ట్రేటివ్ హోదాల్లో ఉన్నారు… అంటే సాక్షిలో వేసిన ఫోటోలు బాగాలేవని కాదు… కాకపోతే మరీ సినిమా తారల బొమ్మలు గుప్పించినట్టుగా… పబ్లిష్ చేయడమే ఎందుకో బేసబబుగా అనిపిస్తోంది…!!
Share this Article