Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆది సాయికుమార్… శాపగ్రస్తుడేమీ కాదు, అందరికన్నా లక్కీఫెలో…

December 31, 2022 by M S R

నిజానికి టాప్ గేర్ అనే సినిమా చూసొచ్చాక మనకు అనిపిస్తుంది… ఆది సాయికుమార్ శాపగ్రస్తుడా..? ఫీల్డుకొచ్చి 12 ఏళ్లు, పుష్కరం అవుతున్నా సరే, ఇదీ నా సినిమా అని చెప్పుకునేందుకు ఒక్కటీ లేదు… సరిగ్గా లెక్క చూస్తే ఏడాదికి ఒకటీ ఒకటిన్నర సినిమాలే తేలతాయి… కానీ రెండేళ్లుగా తనకు వరుస ఆఫర్లు…

ఆ సినిమాలు ఫ్లాపా..? అట్టర్ ఫ్లాపా ఎవడూ చూడడు… ఒకడు కాకపోతే మరొకడు వస్తున్నాడు, అడ్వాన్స్ చేతిలో పెడుతున్నారు, ఆది సరేనంటున్నాడు… వరుస పెట్టి చేస్తూనే ఉన్నాడు… ఏ సినిమా ఎప్పుడొచ్చిందో హఠాత్తుగా అడిగితే తనే చెప్పలేడు… ఈ ఏడాదే తీసుకొండి అతిథి దేవోభవ, బ్లాక్, తీస్మార్‌ఖాన్, క్రేజీ ఫెలో అని సినిమాలు తీశాడు… ఇప్పుడు తాజాగా టాప్ గేర్… అన్నీ ఫ్లాపులే అని చెప్పనక్కర్లేదు కదా…

ఇలాంటి ఫ్లాప్ చరిత్ర ఉంటేనేం… ఈరోజుకు తన చేతిలో నాలుగు సినిమాలున్నయ్… రాసి పెట్టుకొండి, అవి రిలీజయ్యేలోపు మరో నలుగురు నిర్మాతలు అడ్వాన్సులు ఇస్తారు… కొందరు ఇలా పెట్టిపుడతారన్నమాట… పోనీ, సినిమా ఎలా ఉన్నా సరే, మినిమం వసూళ్లు ఉంటాయని చెప్పడానికి తను మాస్ హీరో కూడా కాదు…

Ads

నిజానికి తను ఏ కథ ఒప్పుకుంటున్నాడో, ఏం సీన్లు చేస్తున్నాడో తనకే సోయి ఉండటం లేదు… ఈరోజు రిలీజైన టాప్ గేర్ మరీ నాసిరకం… ఆ సినిమా సమీక్షకు వస్తే స్పేస్ వేస్ట్ అన్నట్టుగా ఉంది… అసలు ఒక క్రైమ్ థ్రిల్లర్ తీయాలంటే కథనం మీద, సీన్ల మీద బాగా వర్క్ జరగాలి… అదేమీ జరిగినట్టు కనిపించదు…

aadi

థియేటర్ నుంచి బయటికి వచ్చేటప్పుడు మాత్రం అనిపించేది ఒకటే… హమ్మయ్య, త్వరగానే వదిలాడురా బాబూ అని..! సినిమా చాన్స్ వస్తుందా లేదా అనేది మాత్రమే చూసుకుంటున్నట్టున్నాడు ఆది… ఏడాదికి ఒకటి చేసినా సరే, ప్రేక్షకుల మెదళ్లలో రిజిష్టరయ్యే కథను ఎంపిక చేసుకోవచ్చు కదా… అది చేతకాదు… సరే, ఈ కొత్త ఏడాదిలో కూడా బోలెడు సినిమాలు వస్తాయి, ఆ తరువాత ఏడాది కూడా వస్తాయి… తరువాత..?

ఈ ప్రశ్నకు జవాబు ఆది దగ్గర కూడా లేదు… ఎందుకంటే..? తన ఆలోచనలు ఎప్పుడో గతి తప్పాయి… ఏమో, తక్కువ బడ్జెట్‌లో సినిమా చుట్టేయడం, ఓటీటీకి అమ్మేసుకోవడం, థియేటర్లలో పరిగె ఏరుకోవడం… బహుశా ఈ స్ట్రాటజీలో పోతున్నాడేమో… నిర్మాతలకూ సేఫ్ కదా… అవునూ, ఆదీ… నిఖిల్ సిద్ధార్థ వంటి జూనియర్లు కూడా ప్రయోగాలకు, కొత్త కథలకు సై అంటున్నారు కదా, మరి నీకెందుకు ఆ తోవ కనిపించడం లేదు..?! ఇంతకీ ఈ టాప్ గేర్ సినిమా సంగతేమిటి అంటారా..? చూడండి పర్లేదు అని ఎవడైనా సలహా ఇస్తే కదా…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అవునూ హరీషూ… కొండగట్టు బస్సు ప్రమాద మృతులు గుర్తున్నారా..?!
  • సైన్స్, ఎమోషన్, సంప్రదాయం ఆస్తికత్వం, హేతువాదం… హేట్సాఫ్ టి.కృష్ణ..!!
  • ‘‘హస్తరేఖలు మన పిడికిట్లో ఉన్నట్టే ఉంటాయి, కానీ మన మాట వినవు’’
  • వినేవాడు వెర్రివెంగళప్ప అయితే… చెప్పేది రష్మిక మంధానా..!!
  • పరమ నాసిరకం ఫైటర్లను ఇండియాకు అంటగట్టే యత్నం… పార్ట్-2
  • మోడీ వినక తప్పలేదు… బనకచర్ల కుట్రను చేధించిన రేవంత్‌రెడ్డి…
  • F-35 …. అడ్డగోలు లోపాల ఫైటర్… అమెరికా అంటగట్టే యత్నం… పార్ట్-1
  • దిల్ రాజు మారడు… ఎవడూ తన కళ్లకు ఆనడు… ప్రతి మాటలో అహం..!!
  • ‘సంఘ్’ నేపథ్యమే ప్రధాన అర్హతా..? చంద్రబాబు మాటే చెల్లుబాటా..?!
  • కామాఖ్య కాదు… మన ‘మహా నేతలూ’ నమ్మిన ఈ తాంత్రిక గుడి వేరు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions