ఫిలిమ్ ఇండస్ట్రీ అంటే..? షిప్‌కు కెప్టెన్ వంటి దర్శకుడు అయితే..? అబ్బో, ఇంకేముంది..? ప్రాజెక్టు నడుస్తున్నంతసేపూ నిర్మాత ఖర్చుతో విలాసాలు, వైభోగాలు… అందుబాటులో అన్నిరకాల ప్రలోభాలు… బోలెడు సుఖ అవకాశాలు… అసలు ఇండస్ట్రీ అంటేనే రకరకాల ప్రలోభాలు, వ్యసనాలు కదా… కానీ కొందరుంటారు… వాళ్ల గురించి వింటే అస్సలు నమ్మబుద్ధి కాదు మొదట్లో… ఎహె, ఇండస్ట్రీలో అలాంటివాళ్లు ఉంటారా అనేస్తాం… అలాంటోళ్ల జాబితాలో దర్శకుడు ఎఎల్ విజయ్ ఉంటాడు… ఖచ్చితంగా ఉంటాడు… ఓ విశిష్టమైన కేరక్టర్ తను… మరీ మన తెలుగు వాళ్లకు తెలియనివాడేమీ కాదు… కణం, అభినేత్రి, అభినేత్రి-2 దర్శకుడు తను… మరి ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాల్సి వస్తున్నదీ అంటారా..? ఉంది… ఓ విశేషం ఉంది…
సాధారణంగా కంగనా రనౌత్ ఇండస్ట్రీలో ఓ డిఫరెంట్ కేరక్టర్… ధిక్కారి… మొండి… ఫైటర్… చాలామంది దృష్టిలో మెంటల్… మణికర్ణిక సినిమా విషయంలో గానీ, శివసేన ప్రభుత్వంతో పంచాయతీలో గానీ, ఇండస్ట్రీలో పెద్ద తలలతో ఢీకొట్టడంలో గానీ చూశాం కదా… ఆమె ఎవరికీ సర్టిఫికెట్ ఇవ్వదు… ఆమె స్వభావమే అది… కానీ ఈ విజయ్ను ఉద్దేశించి ఏకంగా ‘‘నువ్వు దేవుడివి స్వామీ’’ అనేసింది… అదీ తన ట్విట్టర్లో… అందరికీ షాక్… అసలు కంగనా ఒకరి గురించి పాజిటివ్‌గా మాట్లాడటమే ఓ వింత… అందులో ఒక దర్శకుడిని అంతగా పొగడటం మరీ వింత కదా… ‘‘టీ, కాఫీ, మందు నీ దగ్గరకు రావు… మాంసం, పార్టీలకు దూరం… కోపం, అభద్రత, ఏదో కోల్పోయినతనం. కూడా ఎప్పుడూ కనిపించవు… అందుకే తలైవి షూటింగ్ పూర్తవుతుందీ అంటేనే మిమ్మల్ని మిస్సవుతాననే భావన అసంతృప్తిగా ఉంది’’ అంటూ తెగ మెచ్చేసుకుంది… వావ్… ఎవరీ విజయ్..? కాస్త వెనక్కి వెళ్దాం… నిజంగా కంగనా చెప్పేంత విశిష్టమైన కేరక్టరేనా..?
Ads
ఏఎల్ విజయ్ అళగప్పన్ కొడుకు… ఆయన తమిళ నిర్మాత సంఘం అధ్యక్షుడు… విజయ్ అన్న ఉదయ కూడా నటుడే… మొదట్లో ముంబైలో కమర్షియల్స్ (యాడ్ ఫిలిమ్స్) తీసేవాడు విజయ్… పలు అవార్డులూ కొట్టాడు… తరువాత చెన్నై వచ్చేసి దర్శకుడయ్యాడు… 2007 నుంచీ డైరెక్షన్లోనే ఉన్నాడు… ఏదో ఓ సినిమా తీసినప్పుడు హీరోయిన్ అమలా పాల్‌తో పరిచయం కాస్తా ప్రణయం దాకా పెరిగింది… ఇద్దరూ మొదట్లో సహజీవనం… తరువాత 2014లో కొచ్చిలో నిశ్చితార్థం… పెళ్లి… జస్ట్, రెండేళ్లలోనే విడిపోవాలని నిర్ణయం… 2017లో అధికారికంగా విడాకులు… ఇద్దరూ హూందాగా విడిపోయారు… ఒక్క మాట కూడా ఒకరికొకరు బ్లేమ్ చేసుకోలేదు… ‘‘మేం విడిపోయినా సరే, విజయ్ వంటి స్వీట్ పర్సన్‌ను మళ్లీ నేను చూడలేను..’’ అని పలుసార్లు చెప్పింది అమలా పాల్… దటీజ్ విజయ్ కేరక్టర్… ‘‘పెళ్లి అంటేనే పరస్పర నమ్మకం, సహజీవనం… బేసిక్‌గా ఆ నమ్మకానికే గండిపడినప్పుడు ఇక ఆ సహజీవనానికి అర్థం లేదు, అందుకే విడిపోవాలని అనుకున్నాం… నాకు ఇప్పటికీ ఆమె అంటే ప్రేమే’’ అన్నాడు విజయ్…
ఆమె 18 ఏళ్లకే ఇండస్ట్రీలోకి వచ్చింది… 23 ఏళ్లకే పెళ్లి… 25 ఏళ్లకే విడాాకులు… ఆమెది ఇంకో కథ… విడాకుల తరువాత వైరాగ్యంతో కొంతకాలం పాండిచ్చేరిలోని ఆరావిలీలో గడిపింది… తనకు నటన అంటే పిచ్చి… మళ్లీ ఎంట్రీ ఇచ్చింది… ఆమధ్య ఆడదిలో పూర్తి బరిబాతల నటించింది తెలుసు కదా… అమలతో విడిపోయాక, విజయ్ సాయిపల్లవిని పెళ్లాడబోతున్నాడనీ, ఇద్దరూ సహజీవనం చేస్తున్నారనీ వార్తలొచ్చినయ్… కణం సినిమా సమయంలో ఇద్దరూ కలిసి పనిచేశారు… తరువాత విజయ్ వాటిని ఖండించడమే కాదు, ఓ ప్రొఫెషనల్ డాక్టర్‌ను పెళ్లిచేసుకున్నాడు… ఇప్పుడు జయలలిత బయోపిక్ తలైవి తీస్తున్నాడు… ఇదీ విజయ్ కథ… అంతటి కట్టర్ కంగనాయే సర్టిఫికెట్ ఇస్తున్నప్పుడు… మనమూ భేష్ అని మెచ్చేసుకుందాం… అసలే ఇలాంటోళ్లు అరుదు కదా…
Share this Article