ఇంట్రస్టింగే… చాన్నాళ్లుగా వినిపిస్తున్నదే… సుడిగాలి సుధీర్‌కు పొమ్మనలేక పొగబెడుతున్నారు, ఈటీవీ నుంచి ఇక బయటికి వెళ్లకతప్పదు అని… అనుకున్నట్టే ముందుగా స్పెషల్ ఈవెంట్స్ నుంచి తప్పించారు… తరువాత ఢీ షో నుంచి తరిమేశారు… ఇప్పుడు జబర్దస్త్‌లో కూడా రావడం లేదు… ఒక్క శ్రీదేవి డ్రామా కంపెనీలో మాత్రమే హోస్టింగ్ చేస్తున్నాడు తను… తాజా సమాచారం ఏమిటంటే… అందులో నుంచి కూడా సుధీర్ బయటికి వచ్చేశాడు…
విశేషం ఏమిటంటే… సుధీర్ ప్లేసులో తన జాన్ జిగ్రీ రష్మి హోస్ట్‌గా మారడం… నిజానికి ఈ షో స్టార్టయి ఇంతకాలం అవుతున్నా ఏ ఒక్క రోజు కూడా రష్మి ఈ షోలో కనిపించలేదు… ఇప్పుడు ఏకంగా సుధీర్ ప్లేసులో హోస్టింగ్ చేయడం ఇంట్రస్టింగే… మొన్నటి ఎపిసోడ్ గుర్తుందా..? అయ్యాగారే నంబర్ వన్ అని ఒక ఎపిసోడ్… అందులో మొత్తం సుధీరే… తన ఈటీవీ కెరీర్ మీద క్రియేటివ్‌గా మలిచిన ఒక ఏవీ అనుకోవచ్చు… అంటే ఒకరకంగా అలా మల్లెమాల ప్లస్ ఈటీవీ కలిసి సుధీర్‌కు అలా వీడ్కోలు చెప్పాయా అనిపించేలా సాగింది అది… అదే జరిగింది…
మే 29 న ప్రసారమయ్యే ఎపిసోడ్‌లో ఉంటాడు తను… (ఇంద్రజ లేదు, ఆమని వచ్చి కూర్చుంది)… ఆ తరువాత రష్మి రంగప్రవేశం అన్నమాట… సుధీర్ మాటీవీలో ప్రసారమవుతున్న సూపర్ సింగర్ జూనియర్ షోకు అనుసూయతో కలిసి హోస్టింగ్ చేస్తున్నాడు… హీరోగా చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి… తనే కాదు, గెటప్ సీను కూడా ఈటీవీ వైపు వెళ్లడం లేదు… మొన్న ఏదో ఎపిసోడ్‌లో ఆటోరాంప్రసాద్ కూడా అదే చెప్పి బాధపడ్డాడు తెలుసు కదా… బహుశా తను కూడా ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు…
Ads
మరి ఆది… తనూ మానేశాడు… జబర్దస్త్ షో చేయడం లేదు… అనసూయతో కూడా పడటం లేదు… ఢీ సీజన్ నడుస్తోంది కాబట్టి పనిలోపనిగా శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా కనిపిస్తున్నాడు… ఢీ ప్రస్తుత సీజన్ అయిపోతే ఇక ఆది కూడా ఈటీవీకి పూర్తిగా బైబై చెప్పే అవకాశముంది… ఇవేకాదు, ఇంటర్నల్‌గా మల్లెమాల కంపెనీలో మార్పులు వేగంగా జరిగిపోతున్నయ్… ప్రసన్న అనే డైరెక్టర్ వెళ్లిపోయాడట… సో, శ్రీదేవి డ్రామా కంపెనీ భవిష్యత్తు ఏమిటో చూడాలి… మణికంఠ అనే మరో డైరెక్టర్ జబర్దస్త్ చేయడం లేదట…
నిజానికి ఈటీవీలో నెలకొన్న ఈ గందరగోళాన్ని జీటీవీ, మాటీవీ అందుకోవాలి… అవి అసలే నాన్-ఫిక్షన్, అంటే రియాలిటీ షోలలో వీక్… మాటీవీ వాళ్లు ఒకరిద్దర్ని కామెడీ స్టార్స్ వైపు లాగుతున్నా సరే… అదసలే క్లిక్ కావడం లేదు… అంటే, స్కిట్లలో నాణ్యత ఉండటం లేదు… జబర్దస్త్‌కు కాపీగా కాదు, కొత్తగా ఇంకేదైనా చేయగలగాలి… అది మాటీవీ టీంకు చేతకావడం లేదు… ఫైమా, ఇమ్మూ, నూకరాజు లేకపోతే ఇక జబర్దస్త్ కూడా లేనట్టే… సో, దాన్ని చూసి వాతలు అక్కర్లేదు… కొత్త కామెడీ ప్రయోగాలు ఆలోచించాలి… అదే జరగనప్పుడు ఆదిని, సుధీర్‌ను లాగినా ఫలితం సున్నా…!!
Share this Article