Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఫాఫం తెలంగాణ కాంగ్రెస్… బీఆర్ఎస్ పార్టీకి అడ్డంగా దొరికిపోయింది…

March 11, 2025 by M S R

.

ఇది సోషల్ మీడియా యుగం… మెయిన్ స్ట్రీమ్ మీడియాను ఎవడూ పట్టించుకోవడం లేదు… సో, రాజకీయ పార్టీల సమరానికి కూడా సోషల్ మీడియాయే వేదిక… ఎవరు ఎంత ఎఫెక్టివ్‌గా ఈ మీడియాను వాడుకుంటాడో వాడే తోపు ఈరోజుల్లో…

ఐతే క్వాలిటేటివ్ టీమ్స్ ఉండాలి, పార్టీల సోషల్ మీడియా క్యాంపెయిన్లను ఆర్గనైజ్ చేయడానికి, ఆపరేట్ చేయడానికి… ఎదుటి పార్టీ మీద బలమైన దాడులు చేయలేకపోయినా, ఎదుటి పార్టీ చేసే క్యాంపెయిన్‌ను కౌంటర్ చేయలేకపోయినా, తన ప్లస్సులు ప్రాపగాండా చేయలేకపోయినా… కనీసం నెటిజనం నవ్వుకోకుండా ఉంటే చాలు…

Ads

కానీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం పరమ నాసిరకం… అని పదే పదే అదే స్వయంగా నిరూపించుకుంటోంది… ఒకవైపు బీఆర్ఎస్ కోట్లకుకోట్లు ఖర్చు చేస్తోంది… కాంగ్రెస్ మీద ముప్పేట దాడి చేస్తోంది… యూట్యూబ్ చానెళ్లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలు ప్లస్ డిజిటల్ పేపర్లు ఎట్సెట్రా…

దీనికి ప్రతిగా కాంగ్రెస్ అధికారంలో ఉండీ ఖర్చు పెట్టలేక, బీఆర్ఎస్ దాడిని కౌంటర్ చేయలేెక చతికిలపడుతోంది… అదెలా ఉన్నా పిచ్చి పోస్టులు, వీడియోలతో నవ్వులపాలవుతోంది… మా డ్వాక్రా మహిళలకు ఆదానీ, అంబానీలతోనే పోటీ, మా హైదరాబాద్‌కు న్యూయార్క్ వంటి ప్రపంచ సిటీలతోనే పోటీ, మోడీని ప్రశ్నించడానికే హిందీ నేర్చుకున్నా వంటి వ్యాఖ్యలతో రేవంత్ నవ్వు పుట్టిస్తుండగా…

మరోవైపు పార్టీ అధికారిక సోషల్ మీడియా విభాగం ప్రయాస నవ్వును, జాలిని పుట్టిస్తోంది… ఓ తాజా ఉదాహరణ ఏమిటంటే..?

రేవంత్ రెడ్డి సర్కారు విద్యారంగానికి సంబంధించి తీసుకుంటున్న నిర్ణయాలపై ఆ సోషల్ మీడియా విభాగం ఓ వీడియో చేయదలిచింది… మంచి సంకల్పమే, తప్పుపట్టడానికి వీల్లేదు, ప్రభుత్వానికి అనుకూల ప్రచారం కూడా అవసరమే… కానీ అది ప్రిపేర్ చేసిన వీడియోలోని పలు బిట్స్ అండ్ పీసెస్ గతంలో బీఆర్ఎస్ కేసీయార్ సానుకూల ప్రచారం కోసం రూపొందించుకున్న వీడియో నుంచి యథాతథంగా తీసుకున్నారు…

అంటే కాపీ అండ్ పేస్ట్… కాంగ్రెస్ అలా కాపీ కొట్టిన వీడియోలో కేసీయార్ ఫోటో కూడా ఓ బడి గోడపై కనిపిస్తోంది… అంటే తెలంగాణ కాంగ్రెస్ సైతం తమ వీడియోలతో కేసీయార్‌కే ఉల్టా ప్రచారం చేస్తున్నదా..?

కాపీ చేసి భలే దొరికిపోయారులే అనుకున్న బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వింగ్ కాంగ్రెస్ వీడియోను వెక్కిరిస్తూ, అపహాస్యం చేస్తూ దాడికి దిగింది… ఏమీ లేకపోతేనే దాడి చేసే బీఆర్ఎస్ ఇక ఇలాంటివి దొరికితే ఊరుకుంటుందా..? సోషల్ మీడియాలో ఫుల్లు వెటకారపు దాడికి దిగింది… ఇదీ ఆ ట్వీట్…

https://x.com/brsparty/status/1899104400809107893?s=48

ఆమధ్య కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్ ఫామ్ హౌజ్ పాలన బెటరా..? ప్రజాపాలన బెటరా..? అని కేసీయార్ మీద వెటకారంగా ఓ పోల్ నిర్వహిస్తే… ఫామ్ హౌజ్ పాలనే బెటర్ అని మెజారిటీ జనం వోట్లేశారు… దాన్ని సకాలంలో గుర్తించి డిలిట్ చేయలేదు, అది జనంలోకి విస్తృతంగా జనంలోకి నెగెటివ్‌గా వెళ్లిపోయింది…

విజయశాంతికి ఎమ్మెల్సీ పోస్టు వంటి రాజకీయ నిర్ణయాలు కూడా నవ్వు పుట్టిస్తుంటే… ముఖ్యుల వ్యాఖ్యలు నవ్వు పుట్టిస్తుంటే… చివరకు సోషల్ మీడియా విభాగం చర్యలు, చేష్టలు కూడా నవ్వు పుట్టిస్తుంటే… ఇంకెలా సార్..?! చేజేతులా బీఆర్ఎస్‌కు అస్త్రాలు అందిస్తున్నారు..!!

అన్నట్టు… కాంగ్రెస్ తన ట్వీట్ డిలిట్ చేసుకుంది… తాజా అప్‌డేట్ అన్నమాట…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • క్రమేపీ మతానికి దూరమవుతున్న ఓ తూర్పు దేశం… ఇంట్రస్టింగు…
  • శాపగ్రస్త..! రాస్తే నవల… తీస్తే సినిమా… బతుకంతా ప్రేమరాహిత్యమే..!!
  • ఆ కుటుంబమే క్షమించేసింది… మళ్లీ ఇప్పుడు ఈ ఆగ్రహ ప్రకటనలేల..?!
  • “కావమ్మ మొగుడు… అంటే కామోసు అనుకున్నాను… నాకేం సంబంధం…?’’
  • బహుశా విజయశాంతికీ గుర్తుండి ఉండదు ఇదో సినిమా చేసినట్టు..!!
  • దటీజ్ రాజనాల..! వేషం దొరికితే చాలు, దర్శకులకే క్లాసులు…
  • అల్లు రామలింగయ్య ఓ శాడిస్టిక్ విలన్… చిరంజీవి బాధితుడు ఫాఫం…
  • నా పెంపుడు కోడి కాళ్లు విరగ్గొట్టాడు వెధవ… వాడిని వదలొద్దు సర్…
  • అయ్యో రామా… ఓ అనాసక్త సినిమాలో ఆమే ప్లజెంట్ భామ…
  • ‘‘మేం ఏం నష్టపోయాయో, పగిలిన ఒక్క గాజుముక్క చూపించండోయ్…’’

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions