మోడీ అంటే ప్రపంచ స్థాయి లీడర్… ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియాలో టాప్ పర్సనాలిటీ… అంతటి గొప్ప మనిషిని కోట్ల మంది ట్విట్టర్లో ఫాలో అవుతారు, ప్రపంచ రికార్డులు… కానీ తను ట్విట్టర్ ఫాలో అయ్యేవాళ్లు స్వల్పం… అంతటి గ్రేట్ పర్సన్ తను ట్విట్టర్లో ఫాలో అవుతున్నాడూ అంటే… వాళ్లు గొప్పవాళ్లనే లెక్క నిజానికి…. కానీ ఈ కథ పూర్తిగా వేరు… మోడీ పర్సనాలిటీకి కూడా ఓ మరక వంటి ఉదంతం… అమిత్ జైస్వాల్ జైన్ అనే ఓ ఆర్ఎస్ఎస్ కార్యకర్త… లక్షల మంది మోడీ వీరాభిమానుల్లో ఆయన కూడా ఒకరు… కాదు, అందరికన్నా చాలా ఎక్కువ… తను ఎంత వీరాభిమాని అంటే సాక్షాత్తూ మోడీయే తన ఖాతాను ఫాలో అవుతాడు… మరి అంతటి వ్యక్తికి ఆపద వస్తే మోడీ ఎలా రియాక్ట్ కావాలి…? ఒక ప్రధానిగా వదిలేయండి, ప్రధానిగా 140 కోట్ల మందినీ పట్టించుకోవాలి… కానీ తను ఫాలో అవుతున్న ఓ విశిష్ట వ్యక్తికి ఆపద వస్తే వెంటనే స్పందించాలి కదా… ఆదుకోవాలి కదా… కనీసం ఆదుకునే ప్రయత్నం చేయాలి కదా…. ఇప్పుడు విషయం ఏమిటంటే..?
ఈ 42 సంవత్సరాల అమిత్ జైస్వాల్‌కు కరోనా సోకింది… తనతోపాటు తల్లికీ సోకింది… తన కారు వెనుక మోడీ పెద్ద పోస్టర్… తెల్లారి లేస్తే మోడీని కీర్తిస్తూ, అభిమానిస్తూ, మోడీ వ్యతిరేకులను చీల్చి చెండాడుతూ, ఆర్ఎస్ఎస్ భావజాలానికి సంపూర్ణంగా అంకితమైన కార్యకర్త తను… తను కరోనా సోకితే… మథుర హాస్పిటల్లో జాయినయితే, పట్టించుకునేవారు లేక… ఆగ్రాలో ఓ పెద్ద హాస్పిటల్లో ఒక బెడ్ దొరికే అవకాశం లేక, వేరే దిక్కులేక… పాపం, ఆయన సోదరి సోనూ అలఘ్ ఓ పనిచేసింది… మోడీ ఫాలో అయ్యే ఆ ట్విట్టర్ నుంచే ఓ ట్వీట్ చేసింది… అయ్యా, కాపాడండి మహాప్రభో అని వేడుకుంది… మోడీని, యోగిని ట్యాగ్ చేసింది… మొత్తుకుంది… అయ్యా, సాయం చేయండి, ఫలానా చోట ఉన్నాడు, కనీసం ఓ రెమ్‌డెసివర్ ఇంజక్షన్ అయినా ఇప్పించండి ప్రభో అని బతిమిలాడింది… అది అమిత్ ఖాతాయే కాబట్టి మోడీ చూస్తాడని ఓ ఆశ…
Ads
Myself Sonu Alagh
Mr. Amit Jaiswal’s sister
This is to inform that we are facing issues regarding arrangement of Ramdesivir and treatment. He is admited in NAYATI hospital, Mathura. We are need your help. He is not well @PMOIndia @narendramodi @myogiadityanath
8171010496— 𝐀𝐦𝐢𝐭 𝐉𝐚𝐢𝐬𝐰𝐚𝐥 𝐉𝐚𝐢𝐧 (@ArkJaiswal) April 25, 2021
ఈ అమిత్‌కు వాణిజ్య ప్రకటనలకు సంబంధించిన బోర్డులు, బ్యానర్లు తయారు చేసే వ్యాపారం… దాన్ని చూసుకుంటూనే తన టైంలో ఎక్కువ భాగం ఆర్ఎస్ఎస్ కోసం, మోడీ కోసం, యోగి కోసం ప్రచారం చేసేవాడు… ఎవరూ రూపాయి సాయం చేయకపోయినా తన సొంత డబ్బే ఖర్చు పెట్టేవాడు… అలాంటి అమిత్ కరోనా సోకి, మథుర హాస్పిటల్లో చేరితే, ఒక్క రెమ్‌డెసివర్ ఇంజక్షన్ కూడా దొరక్కపోతే ఆయన సోదరి ఈ ట్వీట్ చేసింది… స్పందన లేదు… కనీసం మోడీ పర్సనల్ ఖాతాను హ్యాండిల్ చేసే వాళ్లయినా సంబంధిత అధికారులనో, అవసరమైన వ్యక్తులనో అలర్ట్ చేయాలి కదా, అదీ లేదు… ఆయన సోదరి వాళ్లనూవీళ్లనూ బతిమిలాడి ఒక్క ఇంజక్షన్ సంపాదించింది… కానీ లాభం లేదు, అప్పటికే అమిత్ ప్రాణాలు కోల్పోయాడు… ఆయనకూ, ఆయన తల్లికీ కలిసి బిల్లు మొత్తం 15.75 లక్షలు… ప్రైవేటు హాస్పిటల్స్ అంటేనే దోపిడీ కేంద్రాలు అని తెలుసు కదా… ఇప్పుడు ఆ అమిత్ సోదరి, ఆమె భర్త కోరుతున్నది ఏమిటో తెలుసా..? ‘‘ఈ నిర్లక్ష్యం విలువ ఎన్ని ప్రాణాలు..? ఈ దోపిడీ తీవ్రత ఎంత..? నీకు ఏమైనా అర్థమవుతోందా..?’’ ది ప్రింట్ సైటు వాడి వీడియో వార్త చూడండి, వాళ్ల ఆగ్రహం అర్థమవుతుంది… విషయం ఏమిటంటే..? ఈ దేశాన్ని పాలించే ప్రభువులకు డ్రగ్స్, వేక్సిన్లే కాదు… తమ వీరభక్తులను కాపాడుకునే సోయి కూడా లేదు…!! లాస్ట్, నాట్ బట్ లీస్ట్…. వ్యక్తి పూజల్లో తరించే ప్రతి వీరాభిమానికీ ఇది ఓ గుణపాఠం…… ఆయన ట్విట్టర్ ఖాతా కూడా డిలిట్ అయిపోయింది…!!
Share this Article