Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఫాఫం అనసూయ… ఇప్పుడేమంటావ్…? కామెడీ షోలు పులుపెక్కిపోతున్నయ్…

February 20, 2022 by Rishi

మొన్నామధ్య ఎవడో పాపం… 40 ఏళ్ల దేవకన్య అని ఎక్కడో కామెంట్ చేశాడట… యాంకర్ అన్సవ్వ అలియాస్ అనసూయకు మస్తు కోపమొచ్చింది… ఒరేయ్, నా వయస్సు 36 మాత్రమే, జర్నలిజం తెలుసారా నీకు అంటూ మస్తు ఫైరైంది… కానీ తనే హైపర్ ఆది ఇంకా ఘోరంగా గిచ్చినా కిక్కుమనదు… అనలేదు… పుష్ప స్పూఫ్ చేస్తూ హైపర్ ఆది ఘోరంగా ట్రోల్ చేశాడు తనను… కానీ సైలెంట్… ఎదురు మాట్లాడితే ఇంకా సీన్ పులుపెక్కిపోతుందని తెలుసు కదా… 

ఫాఫం, తన దాక్షాయణి పాత్ర పెద్ద లాఫింగ్ స్టాక్ అయిపోయింది… పుష్ప సూపర్, బంపర్ హిట్… డౌట్ లేదు… ఎటు చూసినా పుష్ప పాటలే… వాటికి పేరడీలు, స్పూఫులు, మీమ్స్… నెట్ హోరెత్తిపోతోంది… అంతా బన్నీ అదృష్టమే… యూట్యూబ్ చానెళ్లు అయితే పుష్ప బాపతు వీడియోలతో పండుగ చేసుకుంటున్నయ్… అంతెందుకు..? స్టార్ మాటీవీ వాడి కామెడీ షోలు, ఈటీవీ వాడి జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ కామెడీలు కూడా అంతే కదా… బాగా పులుపెక్కిపోతున్నయ్… ఈరోజుకూ… 

pushpa

Ads

ఈమధ్య సుడిగాలి సుధీర్, హైపర్ ఆది చేసిన పుష్ప స్పూఫులు సూపర్ హిట్ అయ్యాయి కదా… లేటుగా మాటీవీ వాడికి వెలిగింది… తన కామెడీ స్టార్స్ షోలో ఓ పిచ్చి స్పూఫ్ ప్లాన్ చేశాడు… కానీ చేసేవాడు, చేయించేవాడికి క్లారిటీ ఉండాలి, క్రియేటివిటీ ఉండాలి కదా… అవి లోపించినయ్… వెరసి ఈరోజు ఓ స్కిట్‌ అట్టర్ ఫ్లాప్… చూస్తున్నంతసేపూ వాంతి వచ్చినంత పని… ఎవడు బాబూ, ఈ షో క్రియేటివ్ డైరెక్టర్లు… ప్రత్యేకించి దాక్షాయణి వేషం వేసిన ఎవరో పాత్రధారి… జాలిపడాలి…

anasuya

కాదు, కాదు… యాంకర్ అనసూయ ఇది చూస్తే మాత్రం ఏ అఘాయిత్యానికి పాల్పడుతుందో ఏమో పాపం… అన్సవ్వ ఆ స్కిట్ చూడకూడదనే ఆశిద్దాం… ఈమధ్య కాలంలో కనిపించిన ఓ చెత్తా స్కిట్ అది … దాని గురించి ఎక్కువ చెప్పుకుంటే అంతగా మనకే మరింత వాంతి… దాన్ని వదిలేస్తే ఎక్సట్రా జబర్దస్త్‌లో మళ్లీ ఓ స్పూఫ్ చేశారు… ఓ లేడీ కమెడియన్ (ఈమధ్యే కొత్తగా కనిపిస్తోంది, మంచి ఈజ్ ఉంది) చిత్తూరు యాసలో అదరగొడుతోంది… ఆమెకు పుష్పరాణి అని డిఫరెంటు వేషం వేసి, పుష్ప రివర్స్ పులుపు షో ఒకటి చేశారు…

రోహిణి నిజానికి మంచి కమెడియన్… ఆమె కూడా ఈ పిచ్చి స్పూఫ్ ఎలా చేయాలో అర్థం గాక తెల్లమొహం వేసింది… మరీ పుష్ప స్పూఫులు ఇలా మరీ ఎక్కువ పులుపెక్కిపోతుంటే ప్రతి ఇంట్లోనూ వాంతులు విరేచనాలు… ఇక ఆపండర్రా బాబోయ్… ఇప్పుడు అర్థం అవుతోంది, ఒక స్పూఫ్ చేయడం అంత వీజీ కాదు అని… మాటీవీ, ఈటీవీ రేంజులో చేస్తే కరోనా ఒమిక్రాన్ వేరియెంట్ మరింత వ్యాప్తి చెందే ప్రమాదం కూడా ఉందని…!! ముక్తాయింపు :: వచ్చేవారం శ్రీదేవి డ్రామా కంపెనీలో కొందరు వెటరన్ నటీనటులతో కూడా ఈ స్పూఫ్ చేయించినట్టు ప్రోమో చెబుతోంది… బహుపరాక్…

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అన్ని సినిమాల్లోలాగే… పొలిటిషియన్సే విలన్లు… ఎదిరించేవాడే హీరో…
  • మాస్టర్లందరూ కలిసి వండిన ఓ మాస్టర్ పీస్.. ఇద్దరు..!
  • వ్యక్తిగా తనపై బోలెడు అభ్యంతరాలు… కానీ సంగీతంలో అల్టిమేట్ ఇసై జ్ఞాని…
  • ఘర్షణలో నష్టాలు సహజం… కానీ మనం 100 % అప్పర్ హ్యాండ్ సాధించాం…
  • నో డౌట్… రాఫెల్ అల్టిమేట్ వార్ ఫైటర్… మన పైలట్లూ సేఫ్…
  • అప్పటికప్పుడు కొత్త సీన్లు… ఆలోచనల కసరత్తులు… మేధో మథనాలు…
  • బాపూ, నీ పాదాలేవి..? ఒక్కసారిగా బావురుమని ఏడవాలనుంది..!!
  • మీడియా చెవుల్లో శ్రీలీల పూలు… నువ్వూ తయారయ్యావా తల్లీ…
  • …. అసలు ఇలాంటి సినిమాలు కదా రీరిలీజ్ చేయాల్సినవి…
  • ‘మా’ పూనుకుని… రాజేంద్ర ప్రసాద్‌కు మానసిక చికిత్స చేయించాలి..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions