పవన్ కల్యాణ్‌పై రెండు అంశాలపై ట్రోలింగ్ నడుస్తోంది… ఏపీ పాలిటిక్స్ గురించి తెలిసిందే కదా… 1) తిరుమల మెట్లు ఎక్కి కొండపైకి వెళ్లేప్పుడు అపసోపాలు పడటం… 2) పవన్ బిడ్డ ఇచ్చిన డిక్లరేషన్…
ఇంతేనా ఆ హీరో స్టామినా..? రోజూ మార్షల్ ఆర్ట్స్ సాధన చేసే పవర్ స్టార్ స్టామినా ఇంతేనా..? రోజూ అనేకమంది వృద్ధులు, పిల్లలు కూడా చకచకా ఎక్కేస్తారు, తనేమో గంటల కొద్దీ టైమ్ తీసుకుని, నానా అవస్థలు పడుతూ, ఫిజియో థెరపీ చేయించుకుంటూ, ఆగుతూ, కూర్చుంటూ… ఓ దశలో ఇక నడవలేడేమో అన్నంతగా… ఇదేనా పవర్..? ఇవేకాదు, ఇంకా హార్ష్ కామెంట్లు కూడా కనిపిస్తున్నాయి సోషల్ మీడియాలో…
ఏపీ పాలిటిక్స్… ఇలాంటివి కనిపించకపోతేనే ఆశ్చర్యపోవాలి… కానీ ఏమాటకామాట… తను కొన్నాళ్లుగా ప్రాయశ్చిత దీక్షలో ఉన్నాడు… వయస్సు కూడా 53 దాకా వచ్చింది… ఫిజికల్ ఫిట్‌నెస్ మీద కూడా శ్రద్ధ తగ్గినట్టుంది… సో, తన స్టామినాను వెక్కిరించాల్సిన అవసరం లేదు… అప్పుడు, ఆ సమయంలో తన దేహదారుఢ్యం పరిస్థితి అదీ…
Ads
ఐనా సినిమాల్లో హీరో పాత్రలు వేరు… వందలాది మందిని తుక్కుగా ఒంటి చేత్తో నరకగలరు, తరమగలరు, తురుమగలరు… దెబ్బ కొడితే ఒక్కొక్కడూ ఖగోళానికే… కానీ రియల్ లైఫ్‌లో ఓ ఆకు రౌడీని కూడా కొట్టలేకపోవచ్చు… పోలిక అనవసరం… అది రీల్, ఇది రియల్… నిజానికి పవన్ మార్షల్ ఆర్ట్స్ సాధన చేసేవాడే… ఫిట్‌గా ఉంచుకోవడానికి ప్రయత్నించేవాడే… పైగా తిరుమల మెట్లు ఎక్కలేని పవర్ స్టార్ అనే వ్యాఖ్యలు వెక్కిరింపులే…
నిన్న సాక్షి సైట్‌లో బోలెడు ఫోటోలు వేసి, అపసోపాలు అని బొంబాట్ చేయడానికి ప్రయత్నించారు… సాక్షి పత్రిక ఇంకెంత రెచ్చిపోతుందో అనుకున్నాను… కానీ మంచి సంయమనం పాటించింది సాక్షి పత్రిక… ఈ వెక్కిరింపులకు పూనుకోలేదు… గుడ్… అవసరమైన విషయాల్లో దూకుడుగా విమర్శలు వేరు, అవసరం లేని సందర్భాల్లో సంయమనం పాటించడమూ అంతే మేలు… తన ప్రజెంట్ స్టామినా సహకరించనప్పుడు పవన్ కూడా రిస్క్ తీసుకోకుండా ఉండాల్సింది…
పవన్ బిడ్డ పోలెనా అంజనా పవనోవా కొణిదెల టీటీడీ అధికారులకు డిక్లరేషన్ ఇచ్చిందనేది తాజా వార్త… మైనర్ కాబట్టి తండ్రిగా పవన్ కూడా సంతకం చేశాడు… ఇంట్లో భార్య, పిల్లలనే మతం మార్పించలేనివాడు సనాతన ధర్మ ప్రవచనాలు చేస్తున్నాడని ఓ ట్రోలింగ్… తను కూడా బాప్టిజం తీసుకున్నానని అన్నాడు కదా ఓసారి, మరి తనెందుకు డిక్లరేషన్ ఇవ్వలేదనే ప్రశ్న మరోవైపు…
ఓ సమాచారం ప్రకారం… పవన్ కల్యాణ్ మూడో భార్య అన్నా లెజినోవా రష్యన్, క్రిస్టియన్… తన మతాన్నే తను అనుసరిస్తుంది… ఇద్దరు పిల్లలు… ఒకరి పేరు మార్క్ శంకర్ పవనోవిచ్… మరొకరి పేరు పోలెనా అంజనా పవనోవా… ఈ పేర్లు పెట్టడమే ఓ విచిత్ర ధోరణి… శంకర్, అంజనా అనేవి హిందూ పేర్లు… వాటికి పవనోవిచ్, పవనోవా అనేవి రష్యన్ పేర్లుగా స్ఫురించేలా, పవన్ అనే పేరు కూడా కలిసొచ్చేలా పెట్టబడినవి… మార్క్, పోలెనా అనే పదాలు లెజినోవా చాయిస్ కావచ్చు… ప్లస్ కొణిదెల ఇంటిపేరు సహజంగానే వచ్చి చేరుతుంది కదా…
సో, బిడ్డ తొలిసారి తిరుమలకు వచ్చింది, ఒకవైపు పవన్ కల్యాణ్ క్యాంపే జగన్ మీద డిక్లరేషన్ రచ్చను పెంచుతోంది… చంద్రబాబు సరేసరి… పొలిటికల్ హీట్ నడుస్తోంది… ఈ స్థితిలో ఆమె డిక్లరేషన్ ఇవ్వకపోతే అదొక వివాదం అయిఉండేది… మామూలు సందర్భాల్లో ఎవరూ పట్టించుకునేవారు కాదేమో… సో, డిక్లరేషన్ ఇప్పించాడు…!!
Share this Article