అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంపు కొన్ని పిచ్చి వ్యాఖ్యలు చేశాడు… అఫ్‌కోర్స్, తనకు అలవాటైన పనే కదా… మేఘన్, హ్యారీ విడిపోతారట… ఎవరీ మేఘన్… ఎవరీ హ్యారీ…? బ్రిటిష్ రాజకుమారుడు హ్యారీ=… ఆయన భార్య మేఘన్… ఒకప్పుడు ప్రపంచమంతా ఆరాధించిన లేడీ డయానా కొడుకే ఈ హ్యారీ… మన మీడియాకు ఇలాంటి కథనాలు పెద్దగా పట్టవు… కానీ ఇంట్రస్టింగే… ఎందుకంటే..?
ఈ మేఘన్ ఆ రాజరికాన్ని, ఆ వారసత్వాన్ని, ఆ సంపదను, ఆ కృత్రిమత్వాన్ని ఎడమకాలితో తన్నేసి, మొగుడిని తీసుకుని బయటికి వచ్చేసింది… అందుకని ఆమె వార్తలంటే అమెరికా, యూరప్ తదితర దేశాల్లో ఆసక్తి… నిజానికి ఆమెది సినిమా కుటుంబం… తండ్రి థామస్ మార్కెల్ సినిమాటోగ్రాఫర్… ఇప్పుడు రిటైర్డ్… తల్లి డొరియా రగ్లాండ్… మేకప్ ఆర్టిస్ట్, యోగా ఇన్‌స్ట్రక్టర్… మేఘన్ కూడా టీవీల్లో, సినిమాల్లో నటించేది… రచయిత్రి కూడా… హ్యారీతో తనది ప్రేమవివాహం…
వాస్తవానికి ఆమెకు ఇది రెండో పెళ్లి… మొదట్లో ఓ నిర్మాతను పెళ్లి చేసుకుంది, విడాకులయ్యాక కొన్నాళ్లు ఓ కెనడా సెలబ్రిటీతో ఉంది… 2017లో హ్యారీని చేసుకుంది… ఇద్దరూ ఆ రాజరికపు కుళ్లు బుద్దులు, వాతావరణం నుంచి బయటపడి, మేఘన్ పుట్టిన కాలిఫోర్నియా వెళ్లి బతుకుతున్నారు… ఎహె, వాళ్లు విడిపోతారు అంటాడు ట్రంప్… తనకు అవసరమా..?
Ads
పోనీ, విడిపోతే పోతారు… విడాకులు ఏమైనా నేరమా..? పాపమా..? ఆమెకు విడాకులు కొత్త కాదు… అసలు ట్రంప్ వివాహ సంబంధాల గురించి మాట్లాడటం ఏమిటి ట్రాష్ కాకపోతే… ఈ తెల్లోళ్లతో ఇదే చిక్కు… పశ్చిమ దేశాల్లో విడిపోవడాలు ఏమైనా కొత్తా..? కామనే… అయితే ఇక్కడ విషయం అది కాదు… మేఘన్ తెలివైంది… నల్లజాతి రూట్స్ కూడా… బహుశా అందుకే ఈ ప్యూర్ తెల్ల వివక్షకులకు పడటం లేదేమో… (వర్ణాంతర ప్రేమను ఎవరూ ఎక్కడా సహించరా..?)
నిజానికి ఈ మేఘన్ దివంగత అత్తగారు డయానా పెద్ద అందగత్తె… ఆమెతో పోలిస్తే ఈ మేఘన్ అంత అందగత్తె కాకపోయినా డయానాలోని లేని ఆత్మవిశ్వాసం ఈమెలో కనిపిస్తుంటుంది… డయానా సున్నిత మనస్కురాలు… మేఘన్ కాస్త దూకుడు… ఈ కాలపు ఆడపిల్లలకు ప్రతినిధిగా కనిపిస్తుంటుంది…
డయానాను వేధించినట్టే ఆ ముసలి ఎలిజబెత్, చార్లెస్ రెండో పెళ్లాం కెమిల్లా ఈ పిల్లనూ వేపుకు తిన్నారు… అందుకే మొత్తం ఆ రాజరికానికే పెద్ద దండం పెట్టేసి వెళ్లిపోయింది… సీత వెంట రాముడిలా…(??) హ్యారీ ఆమెను అనుసరించాడు… ఐనా సరే వేధిస్తూనే ఉంది ఆ రాజకుటుంబం, వాళ్ల మీడియా… ఈ మీడియా వల్లే కదా మేఘన్ అత్త డయానా ప్రాణాలు కోల్పోయింది… ఎప్పుడో తనకూ అదే గతి పట్టిస్తారని సందేహించింది మేఘన్… అందుకే దూరం వెళ్లిపోయింది…
ప్యాలెస్‌లో ఉన్నప్పుడైనా సరే, ఆమె మీడియాను లైట్ తీసుకుంది… ఆమధ్య అసోసియేట్ ప్రెస్ మీద కోర్టులో దావా కూడా వేసింది… తన ప్రైవసీకి భంగం కలిగిస్తున్నారనది కేసు… ఇదే ధైర్యం డయానాకు ఉండి ఉంటే అలా చచ్చిపోయేది కాదేమో పాపం… ఇక ప్రిన్స్ విలియమ్స్ భార్య కేథరిన్ తెల్లతోలు… పైగా యువరాణి… ఎలిజబెత్ పోతే రాణి అయ్యేది తనే… వాళ్ల రాజవంశానుక్రమం ప్రకారం కెమిల్లాకు యువరాణి హోదా ఉండదు… చార్లెస్‌కు ఆమె రెండో భార్య కాబట్టి…
డయానా పెద్ద కొడుకు భార్యగా కేథరిన్‌కే అర్హత… అందుకే ఈ మసలోళ్లు ఆమె చుట్టూ తిరుగుతుంటారు… ఆ పిల్ల కూడా మహా తెలివైంది… మేఘన్ కడుపుతో ఉన్న రెండుసార్లూ… పుట్టే పిల్ల నల్లగా ఉండొద్దు, తెల్లగా ఉండాలంటూ ఒకటే వార్నింగులట… (ఈసారి గనుక ఆడపిల్లే పుడితే, ఈ ఇంట్లో అడుగుపెట్టొద్దు అని గర్భిణి కోడళ్లను బెదిరించే లక్షలాది మంది భారతీయ అత్తలు గుర్తుస్తున్నారా..? ఇదీ అంతే…) ఆ వార్నింగులతో తెగ టెన్షన్ పడ్డానంటూ ఓ ఇంటర్వ్యూలో వాపోయింది మేఘన్… ఇప్పుడేం జరగబోతుందో చూడాలిక… మూడు అధికారిక పెళ్లిళ్ల ట్రంపు హ్యారీకి మేఘన్ అంటే బోర్ వస్తోందనీ, ఆమెను వదిలేసి హ్యారీ లండన్ వెళ్లిపోతాడని కూయడమేమిటో… పాపిష్టి నోరు…!! (స్టోరీ లైన్, ఇన్‌పుట్స్ :: Devika Reddy… )
Share this Article