Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నకిలీ రైతు ఉద్యమాలపై ఇప్పుడిక ఉక్కుపాదం… రోజులు మారాయ్…

March 22, 2025 by M S R

.

Pardha Saradhi Potluri ……. తులసి గబ్బార్డ్ డైరెక్టర్ అఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్, అమెరికా- భారత పర్యటన – ప్రధాని మోడీతో భేటీ!

డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఒక మంచిపని చేశాడు. అది ప్రపంచ దేశాలకి అమెరికా ఇస్తున్న USAID ( United States Agency for International Development) ని ఇజ్రాయేల్, ఈజీప్ట్ కి తప్ప మిగతా అన్ని దేశాలకి నిలిపివేసాడు!

Ads

అదేదో బాంగ్లాదేశ్ కి నిలిపివేస్తున్నట్లు ప్రచారం చేశారు కానీ అది నిజం కాదు. USAID నిలుపుదల అనేది ఒక్కో దేశానికి ఒక్కొక్క ప్రభావం చూపిస్తుంది! మన దేశానికి ఇచ్చే సహాయం 228.2 మిలియన్ డాలర్లు. అంటే 1978 కోట్ల రూపాయలు. దీనిని ఇన్ఫ్రాస్ట్రక్చర్, వైద్యం మరియు ఇతర రంగాలకి ఖర్చు చేయాలి! మనకి USAID నిలిపివేయడం మీద ఏదో ఘోరం జరిగిపోయింది మోడీ ఆపలేకపోయారు అంటూ విమర్శలు చేస్తున్నారు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వైద్యానికి 1978 కోట్లు ఏపాటికి పనికి వస్తాయి? ఆ మాత్రం డబ్బులు మన దగ్గర లేవా?

మన దేశం సంగతి పక్కన పెట్టేస్తే USAID నిలిపివేయడం అనేది జార్జ్ సోరోస్ కి చెందిన NGO లు తీవ్రంగా నష్టపోయాయి. చాలా దేశాలలో జార్జ్ సోరోస్ ఫౌండెషన్ కి చెందిన NGO లకి USAID నిధులు వెళుతున్నాయి. NGO లు ప్రభుత్వాలని కూల్చడానికి మరియు ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు చేసేవారికి ఆర్ధిక సహాయం చేస్తున్నాయి.

భారత ప్రధాని మోడీతో భేటీ అయిన తులసి గబ్బార్డ్ ఎలాంటి సందేశం తెచ్చిందో తెలీదు కానీ సందేశం చేరవలసిన వాళ్లకి చేరుతున్నది! నకిలీ రైతు ఉద్యమానికి అడ్డుకట్ట పడ్డది!
పంజాబ్ రాష్ట్రం ధర్నాలకి కేంద్ర బిందువు అయ్యింది. పంజాబ్ రాష్ట్రం ధర్నాలతో ఆర్ధికంగా చాలా నష్టపోయింది… పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ సింగ్ మాన్ వ్యాఖ్య ఇది!

పంజాబ్ ముఖ్యమంత్రి నిజం తెలుసుకున్నాడు అని అనుకోవడం భ్రమ! తప్పనిసరి పరిస్థితుల్లో కేజ్రీ వాల్ కి ఇష్టం లేకపోయినా ఆ మాట అనాల్సి వచ్చింది!
మళ్ళీ నకిలీ రైతు ధర్నాలకి కూచోబోతున్న నకిలీ రైతులకి, నకిలీ రైతు నాయకులకి షాక్ తగిలింది!

1.పంజాబ్ పోలీసులు హర్యానా సరిహద్దుల వద్ద ఉన్న శంభు అనే ప్రదేశం వద్ద ఉన్న ధర్నా కోసం ఉద్దేశించిన స్టేజీ, టెంట్లు, జెనరేటర్స్, చిన్నపాటి గోడౌన్లని బుల్డోజర్స్ తో నేల మట్టం చేసేసారు!
2.ఇటు ఢిల్లీ, అటు హర్యానాలో బీజేపీ ప్రభుత్వాలు ఉండడంతో భారం మొత్తం పంజాబ్ మీద పడడంతో విధిలేక నకిలీ రైతు నాయకులని అక్కడ నుండి తరలించి ఆ ప్రదేశాన్ని నేల మట్టం చేశారు.

3.2020 నుండి శంభు ప్రాంతం నకిలీ రైతు ధర్నాలకి కేంద్ర స్థానంగా ఉంటూ వచ్చింది! కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్లు నకిలీ రైతు నాయకులకి ఆర్ధికంగా సహాయం చేయడమే కాక, డీజిల్, పెట్రోల్, మందులు, మంచినీళ్లు, ఆహారం సరఫరా చేయడమే కాదు తాత్కాలిక మీడియా పాయింట్ కూడా ఏర్పాటు చేశాడు!

4.జార్జ్ సోరోస్ ఫండింగ్ చేశాడు! జార్జ్ ఫండింగ్ భారత్ మీడియాకే కాదు సోకాల్డ్ అంతర్జాతీయ మీడియాకి కూడా చేశాడు భారత్ లో రైతుల మీద దౌర్జన్యం చేస్తున్నది హిందూ నేషనలిస్ట్ ప్రభుత్వం అంటూ.
5.అంతర్జాతీయ మీడియా హిందూ నేషనలిస్ట్ ప్రభుత్వం అంటూ వ్రాయడం ఒక ఎత్తయితే ది హిందూ పత్రిక కూడా హిందూ నేషనలిస్ట్ గవర్నమెంట్ అనే ఇప్పటికి వ్రాస్తుంది!

6.మరి ఇప్పుడు పంజాబ్ పోలీసులు శంభు దగ్గర ధర్నా పాయింట్ నేల మట్టం చేస్తే అదేదో చిన్న వార్తగా వ్రాసాయి తప్పితే ఏదో ఘోరం జరిగిపోయింది అంటూ ఊదరగొట్టడం లేదు ఎందుకు? డబ్బులు ముట్టలేదనా? లేకపోతే పడగొట్టింది కేజ్రీవాల్ ఆప్ ప్రభుత్వం అనా? ఎంతైనా డబ్బులు తీసుకున్నందుకు విశ్వాసం చూపించాలి కదా?

7. మూడు నెలలలోపే తులసి గబ్బార్డ్ రెండు సార్లు భేటీ అయ్యారు మోడీతో. సందేశం క్రీస్టల్ క్లియర్ గా వెళ్ళింది చేరాల్సిన వాళ్లకి!
8.బాంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తిరిగి ఢాకా వెళ్ళడానికి నిర్ణయం జరిగిపోయింది! ఎప్పుడు అన్నదే తెలియాల్సి ఉంది. ఇప్పటికే ఢాకాలో షేక్ హసీనా మద్దతుదారులు స్వాగత ఏర్పాట్లు చేసుకుంటున్నారు!

9. హఫీజ్ సయీద్ మరణ వార్తని నేషనల్ మీడియా ధ్రువీకరించడం అయ్యింది!
10.పాకిస్థాన్ సైన్యానికి పరిస్థితి అర్ధం అయినా జీర్ణించుకోలేక పోతున్నది! కానీ జరిగేది జరగక మానదు!
11.ఖలీస్తాన్ వేర్పాటుని ప్రోత్సహిస్తున్న కెనడాలో కెనడా, పాకిస్తాన్లలో పరిస్థితులు తారుమారు అయ్యాయి. సోరోస్ ఫండింగ్ ని అడ్డుకుంటున్నారు! ఇక మిగిలింది లండన్ మాత్రమే. అఫ్కోర్స్! లండన్ నుండి నేరుగా నిధులు భారత్ కి రాకుండా న్యూజీలాండ్ ద్వారా వస్తున్నాయి.

12.న్యూజీలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ భారత పర్యటనికి వచ్చి వెళ్లారు ఇటీవలే! మోడీ ఢిల్లీలోని స్వామి నారాయణ్ మందిరానికి మరియు అమృత్ సర్ గోల్డెన్ టెంపుల్ కి తీసుకెళ్లారు న్యూజీలాండ్ ప్రధానిని! ఖలీస్తాన్ టెర్రరిస్టులు న్యూజీలాండ్ నుండి పంపిస్తున్న నిధుల గురుంచి వివరంగా చెప్పారు మోడీ!

13. లెఫ్ట్ లిబరాండులకి, ఆందోళన జీవులకి ఇక ముందు గడ్డు కాలమే! ఒక్క రూపాయి కూడా అందదు నకిలీ ngo ల నుండి! పాపం గంజాయి అక్కకి నా సానుభూతి!
14. ఒక్క యూట్యూబ్ ఛానెల్స్ కే కాదు పేరు గొప్ప అంతర్జాతీయ మీడియాకి కూడా గడ్డు కాలమే!
15. విరాళాలు లేకుండా ఏ అంతర్జాతీయ మీడియా కూడా ఎక్కువ కాలం మనుగడలో ఉండలేవు. USAID ని ట్రంప్ ఆపేయడం వెనుక ఉన్న ఉద్దేశ్యం ఆ డబ్బు పరోక్షంగా లెఫ్ట్ మీడియాకి వెళుతుండడమే!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions