.
ట్రంపు గెలుపు- ప్రపంచ భావి రాజకీయాలు – part 2
డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అవడం వల్ల భారత్ కి ఒనగూరే ప్రయోజనాలు ఏమిటి?
Ads
ముందు బంగ్లాదేశ్ సమస్య పరిష్కార దిశగా అడుగులు పడతాయి!
వారం క్రితం బంగ్లాదేశ్ సుప్రీం కోర్టు మాజీ ప్రధాని షేక్ హసీనాతో పాటు హసీనా మంత్రివర్గ సహచరులకి మరణ శిక్ష విధించింది! ఈ విషయం పెద్దగా ప్రాచుర్యంలోకి రాలేదు!
షేక్ హసీనా మీద మోపబడ్డ అభియోగాలు ఏమిటంటే రిజర్వేషన్ల మీద ఆందోళనలని అణిచివేసే క్రమంలో విద్యార్థులని కాల్చమని ఆదేశాలు ఇచ్చింది షేక్ హసీనా అని!
షేక్ హసీనా భారత్ లో ఉండగా కేసు ట్రయల్స్ ఎలా జరిగాయి కోర్టులో? షేక్ హసీనా తరపున కోర్టులో ఎవరు వాదించారు? అంతా నకిలీ అభియోగాలు. నకిలీ విచారణ.
ఇదంతా దేని కోసం? ఎవరి కోసం?
జస్ట్ నరేంద్ర మోడీ కోసం!
జస్ట్ RSS కోసం!
ఎలా?
షేక్ హసీనా ప్రధానిగా ఉన్న చివరి నిముషాలలో ఏం జరిగిందో మనకి తెలుసు. షేక్ హసీనా బలం భారత్. బంగ్లాదేశ్ కాదు. ఇందిర హయాంలో కూడా షేక్ హసీనా భారత్ తనకి సురక్షిత ప్రదేశం అని భావించారు. పార్టీలు మారినా, ప్రభుత్వాలు మారినా షేక్ హసీనాకి భారత్ సురక్షితమే!
నిజానికి 2014 లో మోడీ ప్రధాని అయ్యాక షేక్ హసీనా మెల్లగా తన విదేశాంగ విధానం కోసం భారత్ నుండి సలహాలు, సూచనలు తీసుకోవడం మొదలు పెట్టి అది 2020 కి వచ్చే సరికి తారస్థాయికి చేరుకుంది. సుష్మా స్వరాజ్ ఉన్నప్పుడు కానీ, తరువాత వచ్చిన జై శంకర్ వచ్చినా షేక్ హసీనా వారి సలహాలు తీసుకుంటూ వచ్చారు!
So..! మోడీని బెదిరించాలి. నెల క్రితం జమాతే ఇస్లామీ నాయకులు పరోక్షంగా మోడీని బెదిరిస్తూ షేక్ హసీనా ని బాంగ్లాదేశ్ కి అప్పగించాలి అంటూ డిమాండ్ చేశారు.
మన వైపు నుండి ఎలాంటి స్పందన లేదు!
అప్పుడే అనుకున్నాను కోర్టులో హసీనాని దోషిగా నిరూపించి శిక్ష వేసి, అప్పుడు అధికారికంగా భారత్ లేదా మోడీని డిమాండ్ చేయవచ్చు అని. అదే జరిగింది!
కానీ ఏకంగా మరణ శిక్ష వేయడమే ఆశ్చర్యం కలిగించింది!
అయితే కుట్రని పరిశీలిస్తే మనకి రెండు ఉదాహరణలు కనపడతాయి.
1.ఇరాక్ లో సద్దాం హుసేన్ కి ఉరి శిక్ష వేయడం. అఫ్కోర్స్! ముద్దాయికి కోర్టులో మాట్లాడే అవకాశం ఇచ్చాము అని అనిపించుకోవడానికి సద్దాం హుస్సేన్ కి మాట్లాడే అవకాశం ఇచ్చారు. కానీ అది కంటి తుడుపు చర్య!
2. సద్దాం హుస్సేన్ కష్టంలో ఉన్నప్పుడు రష్యా కానీ, చైనా కానీ ఆదుకోవడానికి ముందుకు రాలేదు!
3. 2011 లో లిబియా అధ్యక్షుడు మొహమ్మద్ గడాఫీని అయితే తిరుగుబాటుదారులు గడాఫీని ఒక డ్రైనేజి పైపు నుండి బయటికి లాగి కొట్టి చంపేశారు. అప్పుడూ రష్యా కానీ, చైనా కానీ గడాఫీకి సహాయం చేయలేదు!
4. ఎందుకు సద్దాం హుస్సేన్, మొహమ్మద్ గడాఫీ విషయంలో రష్యా, చైనాలని ప్రస్థావించవలసి వచ్చింది? ఎందుకంటే… రష్యా, చైనాలు ఇరాక్, లిబియాలకి ఆయుధాలు అమ్మాయి. అవసరం అయితే రష్యా, చైనాలు తమకి సహాయం చేస్తాయి అని భావించారు సద్దాం హుస్సేన్, మొహమ్మద్ గడాఫీ… కమ్యూనిస్ట్ భావజాలం కలిగిన సద్దాం హుస్సేన్, మొహమ్మద్ గడాఫీలు ఎప్పుడూ మిలిటరీ యూనిఫార్మ్ లోనే ఉండేవారు.
5. ఇరాక్, లిబియా దేశాలలో ఆరాచకం సృష్టించి ఇప్పటికి కోలుకోలేని విధంగా దెబ్బ తీయడంలో జార్జ్ సోరోస్ పాత్ర గణనీయంగా ఉంది.
6. అసలు బంగ్లాదేశ్ ప్రజలలో షేక్ హసీనా పట్ల ఎలాంటి వ్యతిరేకత కానీ, ద్వేషభావం కానీ లేదు. కానీ రాడికల్ ఇస్లామిస్టులతో ప్రదర్శనలు చేయించి చివరికి షేక్ హసీనాని దేశం విడిచి వెళ్లేలా చేయగలిగాడు సోరోస్!
7.కానీ ఇంగ్లాండ్ లో ఆశ్రయం తీసుకుంటుంది అనుకుంటే అనూహ్యంగా భారత్ లో ఆశ్రయం తీసుకుంది అజిత్ దోవల్ సలహా మేరకు!
********
అందుకే షేక్ హసీనాకి మరణ శిక్ష డ్రామా!
మరి RSS టార్గెట్ ఎందుకు?
జస్ట్ బీజేపి మూలాలు RSS కాబట్టి. బంగ్లాదేశ్ లో గత దసరాకి దుర్గా మాత మండపం పెట్టాలి అంటే లక్షా ఇరవై అయిదు వేల బంగ్లా టాకాలు చెల్లించాలి అని డిమాండ్ చేశారు! ఇదేమి బంగ్లాదేశ్ ప్రభుత్వ రుసుము కాదు. ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ ల రుసుము!
ఈ చర్య పరోక్షంగా RSS మీద ఒత్తిడి తెస్తుంది అనే దురాలోచన మాత్రమే!
ప్రధాని మోడీ కూాడ ఏమీ చేయలేరా బంగ్లాదేశ్ హిందువుల దుస్థితి మీద? ఇలా ఉత్తర భారతంలోని సోషల్ మీడియాలలో అసంతృప్తి వెల్లువెత్తిన మాట నిజం! రాడికల్ ఇస్లామిస్టుల, సోరోస్ వ్యూహం కూడా ఇదే!
కానీ మోడీ ఎలాంటి భావావేశాలకి లోను కాలేదు! మరో విషయం ఏమిటంటే 2011 లో లిబియాలో మొహమ్మద్ గడాఫీని డ్రైనేజి పైపు నుండి మెడకి తాడు కట్టి బయటికి లాగుతున్నప్పుడు తీసిన ఫోటోని మార్ఫింగ్ చేసి గడాఫీ తల స్థానంలో మోడీ తల పెట్టి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశారు.
అంటే అర్ధం ఏమిటి? గడాఫీకి పట్టిన గతే మోడీకి పడుతుంది అని హెచ్చరించడం! ఉత్తర ప్రదేశ్ లో బీజేపికి మెజారిటీ రాలేదు చూసారా అంటూ బెదిరించడం వాళ్ళ ఉద్దేశం. ఇవన్నీ సోరోస్ నుండి వచ్చిన ఫీడ్ బ్యాక్ తో చేసినవే!
2011 లో స్మార్ట్ ఫోన్లు లేవు లిబియాలో. సోరోస్ ఎంతలా డబ్బు ఖర్చు పెట్టాడు అంటే గడాఫీ ఎక్కడ తల దాచుకొని ఉంటాడో అని విచ్చలవిడిగా డబ్బు వెదజల్లి ప్రయివేట్ ఫోటోగ్రాఫర్స్ ని నియమించాడు. గడాఫీ దొరికినప్పుడు ఆ దృశ్యాలు తీసిన ఫోటో గ్రాఫర్ లేదా వీడియో గ్రాఫర్ కి భారీ మొత్తంలో బహుమతి ఇస్తానని ఆశపెట్టాడు! ఆ విధంగా గడాఫీ విజువల్స్ బయటికి వచ్చాయి. వాటినే బంగ్లాదేశ్ కి పంపించి వైరల్ చేశారు.
ఒకవేళ సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫోటోలు చూసి ప్రజలు హింసకి దిగితే RSS ని ఉగ్రవాద సంస్థగా ప్రకటిస్తుంది అమెరికా!
*******
మూడు గంటలు చాలు!
ఒక దశలో బంగ్లాదేశ్ మీద సైనిక చర్య తీసుకోవాల్సి వస్తే ఎలావుంటుంది అన్న దాని మీద అధ్యయనం కూడా జరిగింది!
భారత ఆర్మీ పక్కా స్కెచ్ వేసి అమలు చేస్తే మూడు గంటల్లో భారత ఆర్మీ బంగ్లాదేశ్ ని స్వాధీనం చేసుకోగలదు అనేదే ఆ ప్లాన్! కానీ దానిని రిజర్వ్ లో పెట్టారు!
2025 కల్లా భారత ఎకానమిని 5 ట్రిలియన్ డాలర్లకి తీసుకెళ్ళాలి అనే ధ్యేయంతో ఉన్న మోడీ తొందరపడలేదు! కానీ అవసరం అయితే సైనిక చర్య తీసుకోవాల్సి వస్తే ఏం చేయాలి అనేది సిద్ధంగా ఉంచారు!
ఇంతకీ నోబెల్ గ్రహీత బంగ్లాదేశ్ ప్రధాని యూనస్ మాత్రం ఎలాంటి డిమాండ్ చేయలేదు ఇంతవరకు. మన EAM జై శంకర్ నుండి ఎలాంటి రిప్లై వస్తుందో సోరోస్ కి తెలుసు!
********
బంగ్లాదేశ్ మీద తీవ్ర ఒత్తిడి పెట్టిన మోడీ!
అదాని పవర్ నుండి బంగ్లాదేశ్ కి సప్లై అవుతున్న విద్యుత్ ని 50% తగ్గించాడు అదాని. పాత బకాయిలు చెల్లించకపోతే అసలుకే మొత్తం ఆపేస్తామని నోటీసులు ఇచ్చాడు అదాని!
నవంబర్ 7 అంటే ఈ రోజుతో గడువు ముగుస్తుంది అన్నమాట!
గత అక్టోబర్ లో అజిత్ దోవల్ రష్యా వెళ్లి పుతిన్ తో చర్చలు జరిపి వచ్చిన మరుసటి రోజే పుతిన్ ఒక ప్రకటన చేశాడు.
బంగ్లాదేశ్ అధర్మ ప్రధాని మొహమ్మద్ యునస్ ని ఉద్దేశిస్తూ తీవ్ర హెచ్చరిక చేశాడు….. బంగ్లాదేశ్ రష్యాకి ఇవ్వవలిసిన 630 మిలియన్ డాలర్లని వెంటనే చెల్లించాలి లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని.
బంగ్లాదేశ్ రష్యా కి 630 మిలియన్ డాలర్లు ఎందుకు ఇవ్వాలి?
Well..! బంగ్లాదేశ్ లో అణు విద్యుత్ కేంద్రం కోసం అంటూ రష్యా దగ్గర అప్పు తీసుకొంది బంగ్లాదేశ్! అణు విద్యుత్ ప్లాంట్ సగంలోనే ఆగిపోయింది బంగ్లాదేశ్ తనవంతుగా పెట్టుబడి పెట్టాల్సిన మొత్తం సకాలంలో కట్టకపోవడం వలన. సగం ప్లాంట్ వరకూ రష్యా అప్పుగా ఇచ్చింది! ఇప్పుడు అగ్రిమెంట్ ప్రకారం 630 మిలియన్ డాలర్లు ఇవ్వాల్సి ఉంటుంది వడ్డీతో సహా!
అవే వెంటనే తిరిగి కట్టాల్సిందిగా పుతిన్ హేచ్చరించాడు!
కట్టకపోతే?
జస్ట్ MIG 29 జెట్ ఫైటర్స్ కి స్పేర్ పార్టులు ఆపేస్తాడు. బంగ్లాదేశ్ కి MIG 29 జెట్స్ 8 ఉన్నాయి. ఇవే ఆధునిక జెట్ లు బాంగ్లాదేశ్ కి ఉన్నవాటిలో. తరువాత చైనా J 7 (Mig 21 చైనా కాపీ ). అందుకే బంగ్లాదేశ్ ని మూడు గంటల్లో స్వాధీనం చేసుకోవచ్చు అని భారత ఆర్మీ అన్నది.
ప్రస్తుత పరిస్థితి ఏమిటి?
అదాని పవర్ 50% విద్యుత్ కోత పెట్టగానే 80 టెక్స్టైల్ పరిశ్రమలు మూత పడ్డాయి. ఈ రోజుతో గడువు ముగియగానే మిగతా 50% కూడా అంటే మొత్తానికే విద్యుత్ సరఫరా ఆపేస్తాడు అదాని.
ఎంతో కొంత విదేశీ మారక ద్రవ్యం అయిన డాలర్లు తెచ్చేది రెడీ మెడ్ దుస్తుల ఫాక్టరీలు. అవి మొత్తం మూత పడితే డాలర్ రిజర్వ్ అనేది ఉండదు బాంగ్లాదేశ్ కి!
ఈ రోజున వరకూ పగలు విద్యుత్ సరఫరా ఉండడం లేదు. సాయంత్రం 6 నుండి ఉదయం 9 వరకే విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
నిత్యావసర వస్తువులు భారత్ నుండి ఎగుమతి అవుతాయి కానీ చెల్లింపులు చేయడం లేదని వాటి సరఫరా కూడా తగ్గించడంతో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి!
ప్రధానంగా భారత్ నుండి ఎగుమతి అయ్యేది పత్తి, డీజిల్, పెట్రోల్, విద్యుత్. విద్యుత్ లేకుండా పత్తి దిగుమతి చేసుకొని ఏం చేస్తారు?
పెట్రోల్, డీజిల్ ఆపేస్తే ఏం చేస్తారు?
బంగ్లాదేశ్ మీద సైనిక చర్య అవసరం లేదు! అనవసరంగా సోషల్ మీడియాలో బీజేపి మీద దుమ్మెత్తి పోశారు కానీ ఇప్పటి పరిస్థితిని చూస్తే తల దించుకోవాలి!
*********
జుట్టు ఉన్న ఆమె ఎన్ని కొప్పులు అయినా పెడుతుంది!
డబ్బు లేకపోతే? అధికారం ఉండదు!
బంగ్లాదేశ్ ఆర్ధిక పరిస్థితి చక్కదిద్దెందుకు కాను మొత్తం 8 బిలియన్ డాలర్లు World Bank, IMF లనుండి అప్పు ఇప్పిస్తానని జో బిడెన్ హామీ ఇచ్చాడు. గత జూన్ నెలలో 900 మిలియన్ డాలర్లు అందుకున్నది బంగ్లాదేశ్! మిగతా మొత్తం విడతల వారీగా విడుదల చేయాల్సి ఉంటుంది. కానీ రాజకీయ సంక్షోభం ఏర్పడడం వలన 2024-25 ఆర్ధిక సంవత్సరం కోసం విడుదల చేయాల్సిన నిధులు ఆపేశారు.
డోనాల్డ్ ట్రంప్ చేయగలిగేది?
జస్ట్ బంగ్లాదేశ్ విషయంలో జో బిడెన్ మంత్రాంగం చేసిన తప్పులని సరిదిద్దడం!
ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వం ఉంటేనే WB, IMF లు నిధులు విడుదల చేస్తాయి అనే కండిషన్ పెట్టడం.
జో బిడెన్ అండతో బంగ్లాదేశ్ లో చిచ్చుపెట్టిన వారిని దూరం పెట్టడం. ఈ పని వెంటనే జరిగి తీరుతుంది.
షేక్ హసీనా తిరిగి బంగ్లాదేశ్ వెళ్లి మళ్ళీ ప్రధాని పగ్గాలు చేపడుతుంది త్వరలో!
మొహమ్మద్ యూనస్ తిరిగి లండన్ వెళ్ళిపోతాడు వచ్చేవారంలో.
ఇక వకర్ ఉజ్ జమాన్ ( Waker uz Zaman ) చీఫ్ ఆఫ్ బంగ్లాదేశ్ ఆర్మీ ఒక్కడే పెద్ద అడ్డంకి హసీనాకి.
మాట వింటాడా సరే! లేకపోతే పాకిస్తాన్ లోలాగా బంగ్లాదేశ్ ని తన గుప్పిట్లో పెట్టుకొని నియంతలా ఉంటాడా అన్నదే ప్రశ్న. మాట వినకపోతే భారత్ సైనిక చర్య తీసుకుంటుంది!
మన పక్కనే ఉన్న బంగ్లాదేశ్ లో సైనిక నియంత పాలన ఉండడం మనకి శ్రేయస్కరం కాదు.
Contd.. Part 3………… (పొట్టూరి పార్థసారథి)
Share this Article