Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ట్రంపుకూ ఓ రెడ్ బుక్… అందులో ఇరాన్ ఖొమెనీ పేరు కూడా..!!

November 11, 2024 by M S R

.

డోనాల్డ్ ట్రంప్ Vs ఆయతోల్లా అలీ ఖోమేని!

‘‘The guy ( Donald Trump ) was kicked out of the White House, but Islamic Republic is standing proudly.

Ads

డోనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ నుండి గెంటివేయబడ్డాడు కానీ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ గర్వంగా అలానే తల ఎత్తుకొని నిలబడి ఉన్నది!’’

2020 లో ట్రంప్ ఎన్నికలలో ఓడిపోయినప్పుడు ఇరాన్ సుప్రీం లీడర్ ఖోమేని అన్న మాటలవి! ఖోమేని వ్యాఖ్యలు ట్రంప్ మీద అక్కసుతో చేసినవే! ట్రంప్ అన్నీ గుర్తు పెట్టుకొన్నాడు! ఖోమేని కి ట్రంప్ అంటే ఎందుకంత కోపం?

గుర్తుందా?
ఇరాన్ కి ప్రాక్సీలయిన హెఙబొల్లా, హమాస్, హుతిలకి బిగ్ బాస్ అయిన కాసేమ్ సులేమాని ( Qassem Soleimani ) ని 2020 జూన్ 3న హత్య చేయడం… అదీ ఇరాక్ లోని బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయం బయట…  హత్య మోస్సాద్ పనే కానీ CIA చేయి కూడా ఉంది…

సులేమానిని IRGC కమాండర్ మరియు అలీ ఖోమేనికి అత్యంత నమ్మకమైన వ్యక్తి. కాసేమ్ సులేమాని ఇరాక్ లోని అమెరికన్ బేస్ మీద దాడి చేసి, అమెరికన్ సైనికులని చంపడానికి ప్లాన్ చేశాడు సక్సెస్ అయ్యింది కూడా.

ట్రంప్ హయాంలోనే ఇరాన్ చమురు ఎగుమతుల మీద, ఎలెక్ట్రానిక్ స్పేర్ పార్టుల దిగుమతుల మీద ఆంక్షలు విధించాడు!

IRGC ని ఉగ్రవాద సంస్థగా ప్రకటించి, నిషేధం విధించాడు ట్రంప్!

ముఖ్యంగా ఇజ్రాయేల్ ప్రధాని నేతన్యాహుతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ట్రంప్ కి… అది పదవిలో ఉన్నా లేకపోయినా సరే!

డోనాల్డ్ ట్రంప్ 2014 – 2020 హయాంలో అమెరికా రాయబార కార్యాలయంని జెరూసలేంకి మార్చి జెరూసలేం ఇజ్రాయేల్ దే అని కుండబద్దలు కొట్టాడు.

గోలన్ హైట్స్ ని ఇజ్రాయేల్ దేశంలో ఒక భాగంగా గుర్తించాడు. ఈ విషయంలో UAE, బహ్రెయిన్ దేశాలని ఒప్పించాడు… దరిమిలా UAE లో ఇజ్రాయేల్ రాయబార కార్యాలయం ఏర్పాటు చేయడంలో ట్రంప్ సహకారం ఉంది.

ఒకప్పుడు ఏ దేశ రాజకియం ఆ దేశానికి ప్రత్యేకంగా ఉండేది. ఇప్పుడు దాదాపుగా అన్ని దేశాలలో ఒకే విధమైన రాజకీయం నడుస్తున్నది.

Power Politics!

పవర్ పాలిటిక్స్ ఏ స్థితికి చేరుకున్నాయి అంటే ఒక పక్షం అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతల మీద తప్పుడు కేసులు పెట్టి జైలుకి పంపించడం, తరువాత అధికారం కోల్పోగానే వీళ్ళని జైలుకి పంపించడం చూస్తూనే ఉన్నాం కదా?

డోనాల్డ్ ట్రంప్ దీనికి మినహాయింపు కాదు. తన రెడ్ బుక్‌లో పెద్ద లిస్టే వ్రాసుకున్నాడు డెమోలు, ప్రాసిక్యూటర్లు, జడ్జిలు, విదేశాంగ శాఖ డిప్లొమాట్లు, అధికారులు, చివరికి FBI, CIA అధికారులు కూడా ట్రంప్ లిస్టులో ఉన్నారు. జో బిడెన్ కొడుకు హంటర్ బిడెన్ లిస్టులోని మొదటి పేరు అని తెలుస్తున్నది. హిల్లరీ క్లింటన్ మూడో నంబర్, బరాక్ ఒబామా నాలుగో నంబర్ లో ఉన్నాడు. త్వరలో యాక్షన్ ఉంటుంది!

మరి అలాంటిది అలీ ఖోమేనిని వదిలేస్తాడా?

Mike Evans ( మైక్ ఇవాన్స్ ), ఇవాన్జలికల్ అడ్వైసర్, డోనాల్డ్ ట్రంప్ కి. డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడుగా ఎన్నిక అవగానే ఇజ్రాయేల్ టుడే ప్రతినిధికి ఇంటర్వూ ఇచ్చాడు మైక్ ఇవాన్స్.

ఆ ఇంటర్వ్యూలో మైక్ ఇవాన్స్ చెప్పింది ఏమిటంటే ‘‘ట్రంప్ ఇజ్రాయేల్ కి ఫ్రీ హ్యాండ్ ఇస్తాడు. జనవరి 10, 2025 లోపు ఇరాన్ లో ఇజ్రాయేల్ ఎక్కడెక్కడ దాడి చేయాలనుకుంటుందో దాడి చేయడానికి అనుమతి ఇవ్వడమే కాదు జనవరి 10 లోపు పూర్తిచేయాలి అని డెడ్ లైన్ కూడా పెట్టాడు!’’

జో బిడెన్ (డెమోలు) దృష్టిలో ఇరాన్ అనే దేశం ఇజ్రాయల్ బాధిత దేశం! ట్రంప్ ( రిపబ్లికన్స్ ) దృష్టిలో ఇరాన్ పూర్తి భిన్నం..! విడమరచి చెప్పాలి అంటే పుస్తకం వ్రాయాల్సి ఉంటుంది!

అక్టోబర్ 7, 2023 న హమాస్ దాడి చేస్తే ప్రతిగా ఇజ్రాయేల్ అక్టోబర్ 10 మిలిటరీ యాక్షన్ మొదలు పెడితే ఇంతవరకు లక్ష్యం నెరవేరలేదు! రష్యా ఉక్రెయిన్ యుద్ధం అయినా, ఇజ్రాయేల్ ఇరాన్ యుద్ధం అయినా తొందరగా అయిపోకూడదు అని డెమోల ఉద్దేశ్యం!

అదే ట్రంప్ అయితే రెండు నెలల సమయం మాత్రమే ఇస్తున్నాడు ఇజ్రాయేల్ కి. ఇంతకీ అలీ ఖోమేనిని గద్దె దింపి ఇరాన్ రాజు షా పహ్లావి ని గద్దె మీద కూర్చోపెడతాడా ట్రంప్? రెండు నెలలు ఆగాలి..!    (పొట్లూరి పార్థసారథి)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • టర్కీ, అజర్‌బైజాన్… శత్రువుకు మిత్రులు… కాళ్లబేరానికి వస్తున్నారు…
  • పాకిస్థాన్ భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోయింది..!!
  • భారీగా బోరాన్ తరలింపు దేనికి..? ఆ అమెరికా విమానం ఏమిటి..?
  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…
  • అంతటి ప్రమాదకరమైన ఫ్యాక్టరీపై ఏమిటింత నిశ్చేష్టత..!?
  • ఆ సైంటిస్టులందరూ ఎక్కడెక్కడ ఉన్నారో గానీ ఆనందిస్తూనే ఉంటారు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions