.
మలయాళ సినిమాల్ని మెచ్చుకుంటే మనలో కొందరికి కోపం… ఏం, మనకేం తక్కువ అని ఓ గీర… అలాంటోళ్లు ఓసారి తుడరం చూడాలి… గొప్ప సినిమా అని కాదు…
ఆ ఇండస్ట్రీ ఎంత స్టార్ హీరో అయినా సరే, కథలోకి ఓ పాత్రలా మాత్రమే తీసుకొస్తుంది… మితిమీరిన యాక్షన్లు, సూపర్ ఎలివేషన్లు, వెగటు కామెడీలు… ఎంత ముసలి హీరో అయినా సరే మమత బైజులు, మీనాక్షి చౌదరిలు, వీలైతే శ్రీలీలలు, ప్రజ్ఞా జైస్వాల్‌లు, ఇంకెవరైనా కొత్త పిల్ల హీరోయిన్లు కావాలని అనరు… డ్యుయెట్లు, పిచ్చి స్టెప్పులు, కూతలు ఉండవు…
Ads
బుల్లిరాజు వంటి చెత్తా పాత్రల్ని అసలు పెట్టరు… తుడరం సినిమాలో హీరోయిన్ శోభన… 55 ఏళ్ల వయస్సు… చాన్నాళ్లయింది తెర వదిలేసి… మళ్లీ తెర మీదకు వచ్చింది… ఆ పాత్రకు తగినట్టు ఒదిగిపోయింది, హీరో మోహన్‌లాల్‌కు దీటుగా నటించింది… బాగుంది వెటరన్ జంట…
పేరుకు క్రైమ్ థ్రిల్లర్… కానీ ఎన్ని ఎమోషన్స్‌కు ఎంత చక్కటి స్క్రీన్‌ప్లేలో ఇమిడ్చారో చూడాలి… ఓచోట మోహన్‌లాల్ బాత్‌రూంలో కూర్చుని నిస్సహాయంగా రోదించే సీన్ హైలైట్… కథకొస్తే… గతంలో ఓ స్టంట్ మాన్… తరువాత ట్యాక్సీ డ్రైవర్‌గా భార్యా పిల్లలతో ఓ సుందరమైన కొండ ప్రాంత పట్టణంలో బతుకుతూ ఉంటాడు…
తనకు ఆ కారంటే ప్రాణం… కారణం, తనకు అది గురువు భారతీరాజా ప్రజెంట్ చేసింది… భార్య ఇంట్లోనే ఓ చిన్న పిండి మిల్లు నడుపుతూ ఉంటుంది… ఓరోజు తన కొడుకు, కాలేజీ ఫ్రెండ్స్ సరదాగా డ్రైవ్ చేయడానికి తీసుకెళ్లి యాక్సిడెంట్ చేస్తారు… వర్క్ షాపు తీసుకెళ్లాక కారు సీజ్ చేస్తారు పోలీసులు… తోడుగా ఓ గంజాయి కేసు…
ఆ కారును తెచ్చుకోవడానికి హీరో పడే కష్టాలే సినిమా… విలన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్… దృశ్యం పోలికలు కొన్ని ఉన్నా, కథ పూర్తిగా వేరు… ఇందులోనూ కుటుంబం కోసం ప్రయాస, న్యాయం కోసం పోరాటం, కుటుంబ బంధాలు, ఉద్వేగాలు…
తుడరం అంటే సశేషం… ఈ పేరే తెలుగులో పెడితే బాగుండేది… కథనం అక్కడక్కడా స్లో అనిపించినా సరే, క్లైమాక్స్‌లో హీరో న్యాయాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడంలో దృశ్యం సినిమా తాలూకు గ్రిప్ కనిపించదు… దర్శకుడు తరుణ్ మూర్తి చివరలో గందరగోళానికి గురయ్యాడు… సింపుల్ ఫైట్‌తో కథకు ఎండ్ కార్డు వేశాడు…
బట్, మోహన్‌లాల్‌ను వర్తమాన హీరోల్లో ఎందుకు కంప్లీట్ మ్యాన్ అంటారో ఈ సినిమా చూసి అర్థం చేసుకోవచ్చు… కాస్త ఎలివేషన్లు ఎక్కువే కనిపించినా సరే, ఇబ్బందిగా ఏమీ అనిపించదు… ఓపెనింగ్ టైటిల్స్‌లో ఎఐని ఉపయోగించుకున్నారు…
అసలే కేరళ, అందులోనూ షాజీకుమార్ సినిమాటోగ్రఫీ, పైగా జాక్స్ బిజోయ్ బీజీఎం… అందంగా అమిరాయి… కొన్ని విజువల్ మెటాఫర్స్… దర్శకుడు తరుణ్ మూర్తి రాసుకున్న స్క్రీన్‌ప్లేలో ఏనుగుల కుటుంబాన్ని, హీరో కుటుంబంతో కంపేర్ చేయడం బాగుంది… హీరో గజరాజు అన్నమాట..!!
Share this Article