Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇంట్రస్టింగ్… తండ్రి కబ్జా చేసిన ఆస్తిని… ఊరికి తిరిగిచ్చేస్తున్న బిడ్డ…

June 25, 2023 by M S R

ఇలాంటి బిడ్దలు కూడా ఉంటారా..? తండ్రి ఏదో ఊరి భూమి కబ్జా చేసి, బిడ్డ పేరిట రిజిస్ట్రేషన్ చేస్తే… ఆ బిడ్డ దాన్ని ఛీత్కరించి, నాకు ఆ భూమి అక్కర్లేదని, తిరిగి లీగల్‌గా ఆ భూమిని ఆ ఊరికే రాసిచ్చేయడం గొప్ప విశేషమే… అత్యంత అరుదు కూడా… ఆహా, అందరు నాయకుల వారసులు ఇలా ఉంటే ఎంత బాగుండు అనిపిస్తోందా..?

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి… కబ్జాలకు సంబంధించి పలు ఆరోపణలున్నాయి… అప్పట్లో జనగామ కలెక్టర్‌తో కూడా ఏదో చెరువు స్థలం కబ్జాపై వివాదం… బీఆర్ఎస్ ప్రభుత్వం కదా, కలెక్టర్‌ను అక్కడి నుంచి పంపించేసింది… ముత్తిరెడ్డికి మద్దతుగా నిలబడింది… జనగామ నియోజకవర్గం పరిధిలోకే వచ్చే చేర్యాల మునిసిపాలిటీలో కొంత భూమిని కబ్జా చేసి ఎమ్మెల్యే బిడ్డ పేరిట రిజిస్ట్రేషన్ చేశాడు…

ఊరివాళ్లు తిరగబడటం, గొడవ, స్థలం చుట్టూ ప్రహారీ నిర్మాణం వార్తలు చేర్యాల జోన్ పేజీల్లో కనిపించేవి అప్పుడప్పుడూ… ఈ నేపథ్యంలో ఇంట్రస్టింగ్ ట్విస్ట్… ఎమ్మెల్యే ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేశాడో ఆ బిడ్డ ఎదురుతిరిగింది… ఆమె పేరు తుల్జా భవానీరెడ్డి… ఆ భూమి నాకెందుకు అంటూ ఎమ్మెల్యే మీద బహిరంగంగానే తూలనాడింది…

Ads

తుల్జా

ఆమె తిరస్కరణ వెనుక అంతరార్థం ఏమిటో గానీ… తండ్రి భూమి రాసిస్తే బిడ్డ రిజెక్ట్ చేసిన తీరు మాత్రం బాగా చర్చనీయాంశమైంది… ఆమె ఊరివాళ్లకు క్షమాపణలు చెప్పి, ఆ భూమిని మున్సిపాలిటీకి లేదా హాస్పిటల్‌కు రాసిచ్చేస్తున్నట్టు బహిరంగంగా చెప్పింది… నాయకులందరి బిడ్డలూ ఇలా ఉంటే ఎంత బాగుండు అనిపిస్తోందా…? ఇప్పుడు చేర్యాలలో ఇదే టాపిక్… చాలామంది ఇది చెబితే నమ్మడం లేదు…

తుల్జా

కబ్జా చేసిన స్థలం చుట్టూ ఉన్న ప్రహారీని గ్రామస్థులతో కలిసి కూలదోసి… ‘‘మా నాన్న ఇలా చేసి ఉండకూడదు… కానీ తప్పు జరిగింది… ఎమ్మెల్యే గాకమునుపే 1000 కోట్ల ఆస్తులున్నయ్… 70 ఏళ్ల వయస్సు ఇప్పుడు… ఇంకా ఇవన్నీ దేనికి..?’’ అని తండ్రి మీద విరుచుకుపడింది… మామూలుగా వేరే ఎమ్మెల్యేల బిడ్దలయితే ఏం చేసేవాళ్లు..? సంతోషంగా గంతులేసేవాళ్లు… మన సొసైటీయే అలా ఉంది… కానీ తుల్జా దీనికి భిన్నంగా స్పందించింది… అయితే లోగుట్టు ఏమిటి..? ఎందుకు తిరస్కరిస్తోంది..? నాన్నతో గొడవేమిటి..? ఇవి ఇంకా అంతుపట్టని మర్మాలే… కానీ ఆమె చేసిన పని మాత్రం ఓ కొత్త ఆదర్శాన్ని చూపిస్తోంది…

తుల్జా

గ్రామస్థులకు బిడ్డ క్షమాపణ చెప్పడం, ఆస్తి వాపస్ రాసిచ్చేయడం ఒకరకంగా తండ్రిని బజారున నిలబెట్టినట్టే… కేసీయార్ సార్, మన ఎమ్మెల్యేల ధోరణి గమనిస్తున్నారా అని పరోక్షంగా అడుగుతున్నట్టే… ఐనా ఇన్నేళ్లుగా సిట్టింగులను వెనకేసుకొస్తూ, మద్దతు పలుకుతూ, అన్ని వ్యవస్థలనూ ఎమ్మెల్యేలకు దాసోహం చేయించిన వికృతఫలాలు కేసీయార్ గమనిస్తున్నాడా అనే ప్రశ్ననూ తుల్జా భవానీరెడ్డి చర్య మోసుకొచ్చింది… అవును సారూ… ముత్తిరెడ్డికి మళ్లీ టికెట్టు ఇస్తారా..?

https://muchata.com/wp-content/uploads/2023/06/WhatsApp-Video-2023-06-25-at-11.10.47.mp4

డాక్యుమెంట్స్ రెడీ చేశాను… కోర్టు ద్వారా అప్పగిస్తాను అంటోంది ఆమె… నిజమే, మామూలు రిజిస్ట్రేషన్ అయితే ఎమ్మెల్యే ఏదైనా చేయగలడని ఆమె సందేహం… అందుకే కోర్టు ద్వారా ఊరి ఆస్తిని ఊరికే అప్పగిస్తాను అంటోంది… గుడ్… కానీ కొన్ని డౌట్లు అలాగే ఉండిపోయాయమ్మా… మూణ్నాలుగేళ్ల క్రితమే నీ పేరిట రిజిస్ట్రేషన్ జరుగుతుంటే అప్పుడు ఎందుకు వ్యతిరేకించలేదు..? తెలిసే కదా రిజిస్ట్రేషన్ జరిగింది…? తప్పు జరిగింది అని చెబుతున్నావ్ సరే, కానీ ఆ తప్పును అప్పుడే ఎందుకు కడిగేయలేదు…? ఈమధ్యలో ఏం జరిగి, ఆస్తి వాపస్ ఇస్తున్నట్టు..? ఐనాసరే, ఊరి ఆస్తి ఊరికి దక్కడం ఆనందమే…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions