.
సమాజ దీర్ఘకాలిక ప్రయోజనం కోసం చేపట్టే ఏ ప్రాజెక్టు పనికైనా హికమత్ ఉండాలె, ఇంగితం ఉండాలె… అంటే తక్కువ ఖర్చుతో, మంచి టెక్నాలజీతో, నాలుగు కాలాలు నిలిచేలా ఉండాలె…
దీనికి పూర్తి భిన్నంగా కట్టబడినవి కాళేశ్వరం బరాజులు… శాటిలైట్ మ్యాపులో నదీప్రవాహాన్ని చూసి, అడ్డంగా గీతలు గీసి, వేల కోట్ల ఖర్చుతో బరాజులు కట్టిపడేస్తే, అది ఓ మేడిగడ్డ, ఓ అన్నారంలా బుంగలు పడతయ్, పగుళ్లు పడి తస్కుతయ్…
Ads
చివరకు వాటినెలా రిపేర్లు చేయాలో కూడా తెలియక ఇప్పటి ప్రభుత్వం తలపట్టుకునే సిట్యుయేషన్… ఈ దశలోనే పాత ప్రాణహిత- చేవెళ్లను పునరుద్ధరించాలని సంకల్పించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం, గుడ్… తుమ్మడిహెట్టి (మైలారం)లో ఓ ఆనకట్ట కట్టి, అక్కడి నుంచి ఎల్లంపల్లికి నీటిని పంప్ చేయాలనేది పాత ప్రతిపాదన…
కానీ తక్కువ ఖర్చుతో, ఎక్కువ ప్రయోజనం సాధించగల మరో ప్రత్యామ్నాయ ప్రతిపాదనను ఇంజినీర్లు చెప్పారు ప్రభుత్వానికి… (అవును, కేసీయార్ హయాంలోలాగా తను చెప్పినట్లు ఇంజినీర్లు గొర్రెల్లా తలూపడం కాదు… ఈ ప్రభుత్వం ఇంజినీర్లు చెప్పింది విని, విజ్ఞత, వివేచన ప్రదర్శిస్తోంది… థాంక్ గాడ్…)
ఇప్పుడు కొత్త ప్రతిపాదన ఏమిటయ్యా అంటే… తుమ్మడిహెట్టి నుంచి సుందిళ్లకు గ్రావిటీ ద్వారా నీళ్లు తీసుకురావాలి… ఆల్రెడీ సుందిళ్ల దగ్గర పార్వతి పంప్ హౌజ్ ఉంది కదా, దాని సాయంతో ఎల్లంపల్లికి నీళ్లు ఎత్తిపోయాలి… అంటే, ఇప్పటికే ఉన్న వ్యవస్థల్ని వాడుకోవడం, తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం పొందడం…
నిన్న రేవంత్ రెడ్డి చెప్పాడు, 80 టీఎంసీల నీటి వాడకానికి తగినట్టు ఈ కొత్త ప్రతిపాదనను పూర్తి స్థాయిలో ప్రిపేర్ చేయాలని..! కానీ తుమ్మడిహెట్టి పాయింటులో అంత నీరుందా..? ఉంటుంది..! కానీ ఎప్పుడు, ఎలా..?
మహారాష్ట్ర గనుక అంగీకరిస్తే… 150 నుంచి 152 మీటర్ల ఎత్తు ఆనకట్ట కట్టుకుంటే..! ఆల్రెడీ 148 మీటర్లకు మహారాష్ట్ర వోకే అనేసింది, అలా కాదు, మరో మూణ్నాలుగు మీటర్ల ఎత్తుకు మీరు వోకే అంటే, 1467 ఎకరాల ముంపు భూములకు మేం భారీగా పరిహారమిస్తాం అంటోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం… తద్వారా ఈజీగా 80 నుంచి 100 టీఎంసీల మేరకు నికరంగా నీటిని మనం వాడుకోవచ్చు…
(అవునూ, మహారాష్ట్ర అంగీకరించిన 148 మీటర్ల ఎత్తు కట్ట నిర్మాణాన్ని కూడా కేసీయార్ పక్కన పడేశాడు కదా, మరి కాళేశ్వరం ప్రారంభానికి అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నీవస్‌ను ఎందుకు పిలిచినట్టు..? తన మెహర్బానీ ఏముందసలు..? అలాగే కాళేశ్వరంతో అప్పటి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి కూడా లింక్ లేదు కదా, తననెందుకు పిలిచినట్టు..? తన మెహర్బానీ ఏముంది..? హేమిటో, కేసీయార్ ఏమాత్రం అంతుపట్టడు…)
సరే, ప్రస్తుత ప్రతిపాదన మేరకు తుమ్మిడిహెట్టి టు ఎల్లంపల్లి నీటి తరలింపుకి నిర్మాణవ్యయంలో బాగా ఆదా అవుతుంది… ఇదే రాజకీయ నాయకుల డిజైనింగుకూ, ఇంజినీర్ల డిజైనింగుకూ నడుమ తేడా… మైలారం నుంచి సుందిళ్లకు 20.6 కి. మీ. మేర టన్నెల్ తవ్వి, ఆ తర్వాత నీటిని టేకుమట్ల వాగులో వేస్తే నేరుగా సుందిళ్లకు చేరుతాయి… ఇదీ ప్రస్తుత డిజైన్..!!
కానీ కేసీయార్ నిర్మించిన టెక్నాలజీతో సుందిళ్ల కూడా నాసిరకం బరాజు కదా… మరెలా..? అదీ ముందుగా రిపేర్ చేయించుకుని, తుమ్మిడిహెట్టితో లింక్ చేయాల్సిందే… తప్పదు… మొత్తం లక్ష కోట్ల ప్రాజెక్టును ఎంత కంపు చేశావయ్యా కేసీయారూ..!?
Share this Article