Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అంటే అన్నామంటారు గానీ… ఈ యాడ్ పరమార్థం ఏమిటి సార్..?!

December 1, 2024 by M S R

.

ఒక ప్రపంచంలోకెల్లా అత్యధిక ధనవంతుడైన, ప్రభావమంతమైన హిందూ దేవుడి గుడికి పాలకమండలి అధ్యక్షుడయ్యాడు ఆయన…

వోకే… కారణాలు ఇక్కడ అప్రస్తుతం… పక్కా రాజకీయ పదవి… మన గుళ్లు రాజకీయ క్రీడల్లో చిక్కిన ఫలితం… పోనీలే పాపం… ఎవడెవడో నాస్తిక చక్రవర్తులు కూడా భ్రష్టుపట్టించే దుర్మార్గాలు చేశారు, ఈయన నయం కదా అంటారా..? సరే… అంగీకరిద్దాం…

Ads

తనను చూసి కాదు… మన గుళ్ల పరిస్థితి చూసి..! సరే, అయ్యాడు… అక్కడ సగటు భక్తుడికి, వోకే, వోకే, ఆ దేవుడికి వీసమెత్తు మంచి చేసే సిట్యుయేషన్ ఉందా..? అది బ్రహ్మపదార్థం వంటి ధర్మసందేహం… సరే, అదీ వదిలేద్దాం…

ఆ అధ్యక్ష పదవి రాగానే నాయకుల ఇళ్లకు వెళ్లి తను ‘‘ఆశీస్సులు’’ తీసుకోవడం దేనికి..? అభినందించడానికి వాళ్లు రావాలి కదా… అది కదా ఆ పోస్టు విశిష్టత..? పైగా ఏ తెలుగుదేశం క్యాంపు ఈ పదవిని ప్రసాదించిందో ఆ బాబు గారు, ఆ కొడుకు గారిని కలిసి కృతజ్ఞతలు చెబితే సరిపోయేది కదా…

తెలంగాణ సీఎంను కలిశాడు… సరే, అస్మదీయుడే అనుకుందాం, తెలంగాణలో ఉంటున్నాడు కాబట్టి కలిశాడు అనుకుందాం… హరీష్, కేటీయార్‌నూ కలిశాడు… తెల్లారిలేస్తే తెలుగుదేశం అధినేతను ఉతికి ఆరేసే బ్యాచ్ అది… వాళ్లను కలవడం దేనికి..? వోకే, తెలంగాణలో ఉంటున్నాడు, రేప్పొద్దున వీళ్లతో అవసరం అనుకుందాం…

naidu

మరి ఆ శ్రీనివాస యాదవ్‌ను కూడా కలవాలా..? స్పీకర్, మండలి చైర్మన్ అలా కలుస్తూ వెళ్తున్నాడు… అసలు ఏమిటిది..? జగన్ ఓదార్పు యాత్రలాగా… ఇదోరకం స్వీయ ఆశీస్సుల ఆకాంక్షా యాత్ర అనుకోవాలా..? ఆ దేవదేవుడి భృత్యుడిగా ఏమిటీ యాత్రలు..? చివరకు హార్డ్ కోర్ టీడీపీ అభిమానులకే మింగుడపడటం లేదు ఈ అత్యంత విచిత్రమైన ‘‘మర్యాదపూర్వక కలయికలు’’…

అవునూ ఇక్కడ మర్యాద అనగానేమిటి..? ఇదొక ధర్మసంకటమైన ప్రశ్న… ప్రపంచంలో టీవీ5 కూడా సమాధానం చెప్పలేని ప్రశ్న… ఇలాంటి విచిత్ర యాత్ర గతంలో ఏ టీటీడీ అధ్యక్షుడికీ రాని ఆలోచన… శ్రీవారు అదృష్టవంతుడు… ఇంకెన్ని చూడాలో…

సరే, వెళ్లాడు… ఆ రాధాకృష్ణనూ కలిశాడు, ఈనాడు కిరణ్‌నూ కలిశాడు… సరే, అందరూ జగన్ పీడ నుంచి రాష్ట్ర విముక్తికి అక్షరయజ్ఞాలు చేశారు, సేమ్ వేవ్ లెంత్, సేమ్ ఫ్రీక్వెన్సీ… తోెటి మీడియాను అక్కున చేర్చుకునే ఓ సరికొత్త వ్యూహ యాగం అనుకుంటే… మరి ఫాఫం టీవీ9, ఎన్టీవీ ఏం పాపం చేశాయి..? పనిలోపనిగా ఎంచక్కా ఓసారి జగన్‌ను కూడా కలిసే అవకాశముందా సార్..?

ఓ వార్త కనిపించింది… టీవీ5 చరిత్రలోనే అత్యంత వివాదస్పదమైన అంశం నూజెన్ హెయిర్ ఆయిల్… ఆ ప్రచారాలు అప్పట్లో ఓ సంచలనం… ఏదంటే అది ప్రచారం చేసుకుని అమ్మకాలు చేసుకోవచ్చు మన వ్యవస్థలో అనడానికి తార్కాణంగా చూపించేవాళ్లు… ఇదే రాధాక‌ృ‌ష్ణ అప్పట్లో తను కూడా విమర్శలు చేశాడు తన ఏబీఎన్ చానెల్ తరఫున… (అదే గుర్తుంది)…

ఏకంగా బట్టతల మీద జుట్టు మొలిపిస్తామనే ప్రకటనలు… చేయి వెంటనే కడుక్కొండి, లేకపోతే చేయిపైనే వెంట్రుకలు మొలుస్తాయన్నంత ధాటిగా… అప్పట్లో ఆ ప్రచారం మీద ఏబీఎన్ వర్సెస్ టీవీ5 ఓ యుద్ధమే సాగింది… ఆంధ్రజ్యోతిలో కథనాలు కూడా… బాధితుల ఇంటర్వ్యూలు కూడా…

nuzen

తరువాత ఆ హెయిర్ ఆయిల్ ప్రచారాలు వెనక్కి తగ్గాయి… ఇప్పుడు సారు గారు టీటీడీ పెబ్బ అయిపోయాడు కదా… మనం మనం బరంపురం… ఇదే రాధాకృష్ణ పత్రిక ఆంధ్రజ్యోతి చివరి పేజీలో ఇదే హెయిర్ ఆయిల్ ప్రకటన మళ్లీ కనిపించింది… నూజెన్ ఉత్పత్తులన్నింటికీ ప్రచారం… (హఠాత్తుగా సుజన కథనాలు కూడా యాదికొచ్చాయి…)

అవును సార్, పదేళ్ల తరువాత నూజెన్ విశిష్టత, మహత్తు తమకు బోధపడిందా సారూ..? ఇక రాబోయే రోజుల్లో నూజెన్ ప్రచారాలు దుమ్మురేపుతాయా..? సార్, సార్, చంద్రబాబు నాయుడు గారూ… ఈ నాయుడి గారి తలనూనె ప్రచారాలను తమరు ఎండార్స్ చేస్తున్నారా సార్..!?

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • డ్రోన్ల యుద్ధమే కాదు… భీకరమైన సైబర్ యుద్ధానికీ దిగిన పాకిస్థాన్…
  • ఆట నుంచి క్రమేపీ దూరమవుతూ… ఆధ్యాత్మిక అంశాలకు దగ్గరగా…
  • ఓ చిన్న గుడి… కృష్ణా నదిలో ఓ ద్వీపంలో… పూర్తిగా చదవండి ఓసారి…
  • ఔరా అక్కినేనీ… నాసిరకం ఉత్పత్తుల్లో నువ్వూ తక్కువేమీ కాదు….
  • పాక్ పీచమణిచిన S-400 కాదు… దాని తాత S-500 కూడా వస్తుంది…
  • ఇది నిజంగా బాపు తీసిన పాటేనా..?! ఆమె అసలు ఆ జయప్రదేనా..?!
  • వేలాడదలుచుకోలేదు… క్లియర్ ప్లానింగ్… జస్ట్, అలా వదిలేశాడు…
  • మోడీజీ… అన్నీ బాగానే చెప్పావు… కానీ ఆ ఒక్క ప్రశ్నకు జవాబు..?!
  • ఆ భూకంపాలు ప్రకృతి కోపమా..? అణ్వస్త్ర గోదాముకు పడిన తూట్లా..?!
  • నీకోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో… ఇదో వింత కథ…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions