ఈమధ్య కొన్ని అంశాల్లో స్టాలిన్ పనితీరును మెచ్చుకుంటున్నాం కదా… అలాగని తను అన్ని అంశాల్లోనూ సమర్థించదగినవాడు అని కాదు… ప్రత్యేకించి మతం అనే అంశం దగ్గర రిజిడ్‌గా ఉంటున్నాడు ఇప్పటికీ… తను నాస్తికుడు, అందులో తప్పులేదు, దేవుడిని నమ్మాలా లేదా అనేది వ్యక్తిగతం… కానీ నాస్తికత్వానికీ యాంటీ-హిందూ ధోరణికీ సంబంధం ఉండకూడదు, అన్ని మతాలకూ-దేవుళ్లకూ దూరంగా ఉండాలి… కానీ స్టాలిన్ తన తండ్రి, తన పార్టీ వ్యవస్థాపకులు పాటించిన యాంటీ-హిందూ ధోరణికే తను కూడా కట్టుబడి వ్యవహరిస్తున్నాడు…
ఇప్పుడు లావణ్య కేసులో ఎందుకు ఉలిక్కిపడుతున్నాడో అర్థం కాదు… ఆ కేసు గుర్తుంది కదా… ఓ స్కూల్‌లో మతమార్పిడి కోసం వేధిస్తే 17 ఏళ్ల అమ్మాయి సూసైడ్ చేసుకుంది… ఇప్పుడది మలుపులు తిరుగుతోంది… ఈ కేసును ఎక్కడికక్కడ డైల్యూట్ చేసేసి, అసలు ఈ కేసులో మతమార్పిడి అనే కోణమే లేదన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది… మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ కూడా ఇదే అభిప్రాయపడింది… ‘‘మరణ వాంగ్మూలం ఉంది, అది ఫేక్ అనిపించడం లేదు, దాన్ని దర్యాప్తు చేయాలి కదా, ఎస్పీ కావాలనే మాతం అనే కోణాన్ని దాచేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది, ఓ సీనియర్ మంత్రి అలాగే స్టాండ్ తీసుకున్నాడు, ఈ స్థితిలో రాష్ట్ర పోలీసులు నిష్పక్షపాతంగా ఎలా దర్యాప్తు చేయగలరు..? సీబీఐ దర్యాప్తు బెటర్’’ అని చెప్పింది…
సీబీఐకి కేసు అప్పగిస్తే తప్పేముంది..? నష్టమేముంది..? కానీ స్టాలిన్ ప్రభుత్వం ఎందుకు ఉలిక్కిపడుతున్నట్టు..? సీబీఐకి అప్పగించాలన్న హైకోర్టు తీర్పు మీద స్టే ఆర్డర్ కోసం సుప్రీంకోర్టు తలుపు తడుతోంది… సోవాట్..? సీబీఐ దర్యాప్తు చేస్తే ఏ నిజాలు బయటపడతాయని స్టాలిన్ ప్రభుత్వం భావిస్తున్నట్టు..? అసలు నిజాలు బయటపడితే తప్పేమిటి..? తమిళనాడులోనే కాదు, దేశంలో మతమార్పిళ్లు చాలా కామన్ వ్యవహారమే కదా, కొత్తేమీ కాదు, మరెందుకు ఈ కలవరం..? తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకు వెళ్తుందనే విషయం తెలియడంతో లావణ్య తండ్రి సుప్రీంలో కేవియట్ దాఖలు చేశాడు… ఇక్కడ ప్రశ్న ఏమిటంటే..? స్టాలిన్ బలమైన చర్చి ఒత్తిళ్లకు తలొగ్గుతున్నాడా..?! నిష్పాక్షికతకు అందుకే నీళ్లు వదులుతున్నట్టా..?! తను సీఎం అయ్యాక పాలన, పాలిటిక్స్ కోణాల్లో కనబరుస్తున్న మెచ్యూరిటీ ఇక్కడ ఏమైంది..?!
Ads
Share this Article