Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈ రెండు యాడ్స్… భారత వాణిజ్య ప్రకటనలకు అప్పట్లోనే కొత్త పాఠాలు…

March 7, 2023 by M S R

సెవెన్టీస్… 1970 లలో… రెండు యాడ్స్ వినియోగదార్లను బలంగా ఆకర్షించాయి… యాడ్స్ రంగంలో ఇవి అందరికీ పాఠాలు నిజానికి..! ఒక యాడ్ లిరిల్ స్నానపు సబ్బు… రెండో యాడ్ లలితాజీ సర్ఫ్… రెండూ భిన్నమైనవి… పరస్పరమూ భిన్నమైనవి… లిరిల్ యాడ్ లోకాన్ని మరిచి ఆనందాతిరేకాన్ని ఆస్వాదిస్తున్న చిత్రం… ఇందులో పొదుపు వంటి పదాలు, ఆలోచనలు పరిగణనలోకి రావు… సర్ఫ్ యాడ్ సగటు వినియోగదారుడి తెలివైన కోణం… ప్రతి పైసాకు ప్రయోజనం చూపించే యాడ్…

ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ రెండు యాడ్స్ భారతీయ మహిళ ద్వంద్వత్వం…! ఓ మార్కెటింగ్ నిపుణుడి మాటల్లో చెప్పాలంటే… ‘‘లిరిల్ యాడ్ వర్తమానం, భవిష్యత్తులను సూచిస్తే… సర్ఫ్ యాడ్ గతం, వర్తమానాల ప్రతిబింబం… వాస్తవంగా ఈ రెండు యాడ్స్ మొత్తం వాణిజ్య ప్రకటనకర్తల మైండ్ సెట్, పోకడలనే మార్చేశాయంటే అతిశయోక్తి కాదు…

రెండురకాల యాడ్స్… ఒకటేమో ఆర్థికసూత్రాలను చెప్పదు… ఆనందసూత్రాల్ని చెబుతుంది… రెండోది అతి జాగ్రత్తను, మనీ విలువను చెబుతుంది… ఏ సరుకుకు ఎలాంటి ప్రకటన కావాలో ఉత్పత్తిదారుడి ఇష్టం… ఈ రెండు యాడ్స్ వాళ్లకు ఉదాహరణలు… 1970 లలో హిందుస్థాన్ లీవర్ ఓ నిమ్మసబ్బును ఇంట్రడ్యూస్ చేయాలని అనుకుంది… (లైమ్ సోప్)… ఇండియాలో ఫస్ట్ టైమ్… అదిరిపోయే యాడ్స్ కావాలి… సబ్బు ఏం చేస్తుంది..? దేహాన్ని శుభ్రం చేయడమే గాకుండా… స్నానం చేస్తున్నంతసేపూ మనోల్లాసాన్ని ఇస్తుంది…

liril n surf

సో, సబ్బు యాడ్ కూడా తాజాదనం, వినోదానికి లింకై ఉండాలని అనుకున్నారు… వినియోగదారుల్లో ఓ సర్వే చేశారు… ఈ వాటర్ ఫాల్ సీన్ అలా సర్వే ప్రకారం ఫైనలయిందే… ‘‘ప్రతి మహిళకు ఒక రోజులో కొద్దిక్షణాలే తనకు సొంతం… ఆ క్షణాల్లోనే తాము తమకోసం బతుకుతారు… కాసింత ఆనందాన్ని, శుభ్రతను, స్వచ్చతను మూటగట్టుకుంటారు… అవే స్నానక్షణాలు… ఈ అభిప్రాయం నుంచి రూపొందింది ఈ జలపాత స్నానం…

జలపాతం షవర్ కింద ఎగిసిపడే ఆనందం మా లిరిల్ సబ్బుతో మీ సొంతం అనే భావనను వినియోగదారుల్లోకి ఇంజక్ట్ చేశారు… ఫస్ట్ హిట్టయిన ఆ యాడ్ తరహాలోనే మోడల్స్‌ను చాలాసార్లు మార్చి ఇతర యాడ్స్ కూడా షూట్ చేశారు… లాలలలలా అనే ఆ మ్యూజిక్ ట్రాక్ కూడా భలే క్లిక్… ఈ యాడ్ దశాబ్దాల తరబడీ వాణిజ్య ప్రకటనల సమయాన్ని ఏలింది… రేడియో, టీవీ, సినిమా, పత్రికల్లో దుమ్మురేపాయి ఈ యాడ్స్…

ఇదేసమయంలో లలితాజీ యాడ్ మరో కోణంలో సూపర్ హిట్… ఇదొక స్పెషల్ కేరక్టర్… టిపికల్ ఇండియన మదర్ లేదా ఇండియన హోమ్ మేకర్ మనస్తత్వాన్ని బట్టి రూపొందిన యాడ్… ఆమె సూటిగా సర్ఫ్ ఎందుకు తెలివైన ఎంపికో చెబుతుంది… చవకగా వచ్చే బట్టల డిటర్జెంట్ పొడి… నీళ్లు ఆదా, డబ్బు ఆదా, తళతళ తెలుపు, శుభ్రత… ఇంకేం కావాలి సగటు గృహిణికి… అందుకే అంతగా చొచ్చుకుపోయింది వినియోగదారుల్లోకి ఆ యాడ్… ఇవి రెండూ ఈ దేశపు సగటు మహిళ భిన్నమైన మొహాలకు ప్రతీకలు… ఒకటి ఆర్థికం… ఒకటి హార్ధికం…!!

Share this Article






Advertisement

Search On Site

Latest Articles

  • రంగమార్తాండ సినిమాలో కృష్ణవంశీ ఎక్కడెక్కడ రాంగ్‌స్టెప్స్ వేశాడంటే..?!
  • ధమాకా, ఖిలాడీ మూవీల కంబైన్డ్ కిచిడీ… విష్వక్సేనుడి దాస్‌కాధమ్కీ…
  • Rangamarthanda… ప్రకాష్‌రాజ్ ‘అతి’… బ్రహ్మానందం పర్‌ఫెక్ట్… రమ్యకృష్ణ వోకే…
  • రంగు సోడాల కడుపులు కొట్టి… ఆర్గానిక్ షర్బతుల పనిపట్టి… కూల్‌డ్రింక్స్ రసాయనదాడి…
  • ఢిల్లీ టు మద్రాస్… గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్‌లో రెండు రోజుల ప్రయాణం…
  • FingerTip… సోషల్ మీడియా కోట శ్రీనివాసరావును చంపేశాక ఇది గుర్తొచ్చింది…
  • ఈసారి ఉగాది టీవీ షోస్… పులుపు లేని చింత, తీపి లేని బెల్లం, చేదెక్కువ వేప్పువ్వు…
  • 186 అమెరికన్ బ్యాంకులు దివాలా దిశలో… అగ్రరాజ్యంలో ఆర్థిక సంక్షోభం…
  • థూమీబచె… ఎంతకు తెగించార్రా… ఇది ఉగాది స్పెషల్ షో అట..!!
  • కన్నతల్లికి మళ్లీ కల్యాణం… పెళ్లీడుకొచ్చిన కొడుకులే ఈ పెళ్లికి పెద్దలు…

Archives

Copyright © 2023 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions