Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రెండు రాష్ట్ర ప్రభుత్వాలు… క్రూరహింసకు గురవుతున్న ఓ గుడి ఏనుగు కథ…

September 2, 2022 by M S R

నిన్నో, మొన్నో యాంకర్ రష్మి వినాయకుడికి దండ వేస్తున్న ఓ గజరాజు వీడియో పోస్ట్ చేస్తే… వెనకాముందూ చూడకుండా, ఆమె గురించి తెలియకుండా హిందూ ద్రోహి అని ట్రోల్ చేసే ప్రయత్నం చేశారు కొందరు… సరే, ఆ వివాదం ఎలా ఉన్నా, ఆ వార్తల్ని చెక్ చేస్తుంటే మరో ఇంట్రస్టింగ్ వార్త కనిపించింది… అదీ ఏనుగుదే… ఓ ఏనుగు బాధ… ఎందుకు ఒక్కసారిగా కనెక్టయ్యానంటే… ఆ ఏనుగు కోసం ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి రంగంలోకి దిగడం… రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం…

అస్సోం చీఫ్ మినిస్టర్ హిమంత విశ్వ శర్మ ప్రత్యేకంగా ఒక ఏనుగు రెస్క్యూ కోసం అటవీ మంత్రి సహా నలుగురు సభ్యుల ఓ హైలెవల్ కమిటీని ఏర్పాటు చేసి, తమిళనాడుకు పంపిస్తున్నాడు… అదీ వార్త… క్రూరహింసకు గురైన ఆ ఏనుగును తిరిగి తమ రాష్ట్రానికి తీసుకుపోవడానికి ఆ కమిటీ… కానీ ఎందుకలా..? తమిళనాట ప్రతి గుడిలోనూ ఓ ఏనుగు కనిపిస్తుంది… వాటి పోషణకు మావటీలు ఉంటారు… దేవస్థానాలు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటాయి… మరి ఈ ఏనుగు దుస్థితి ఏమిటి..?

నిజానికి ఆ ఏనుగు పేరు జైమాల్యత… తమిళనాడుకు వచ్చాక జయమాలగా మారింది… అస్సోంలోని కాకోపత్తర్ నుంచి 13 ఏళ్ల క్రితం, అంటే 2008లో తమిళనాడుకు వచ్చింది ఈ ఏనుగు… అప్పట్లో మంచి ఫిట్‌గా ఉండేది… ఓనర్ గిరిన్ మోహన్… జస్ట్, ఆరు నెలల లీజుతో ఓ గుడి అస్సోం నుంచి రప్పించుకుంది, కానీ తరువాత లీజు పునరుద్ధరణ లేదు, వాపస్ పంపించిందీ లేదు… కానీ ఎప్పటికప్పుడు క్రూరహింసకు గురవుతోంది…
అదేమిటో గానీ… ఈ ఏనుగు తను వెళ్లిన ప్రతి గుడి దగ్గర మావటీలకు టార్గెటయింది… టార్చర్‌కు గురైంది… గత ఏడాది శ్రీవల్లిపుత్తూరులోని ఆండాళ్ టెంపుల్ పరిధిలో స్వస్థశిబిరంలో ఉన్నప్పుడు కూడా దెబ్బలకు గురైంది… ఆ వీడియో బయటపడ్డాక మావటీని, సహాయకుడిని సస్పెండ్ చేశారు.. పోలీసులు అరెస్టు కూడా చేశారు… తరువాత కృష్ణన్ కోయిల్‌కు మార్చారు… ప్రస్తుతం అక్కడే ఉంది… మరింత క్రూరమైన హింస సాగింది…
దేహం మీద గాయాలతో, ఎప్పుడు కుప్పకూలుతుందో తెలియనంత దయనీయంగా మారిపోయింది ఏనుగు ఆరోగ్య పరిస్థితి… మొన్నటి జూన్ 12న తమిళ చానెల్ ఏబీపీనాడు ఓ స్టోరీ చేసింది… కానీ పెద్దగా జనంలోకి వెళ్లలేదు… కానీ పెటా ఇండియా దాన్ని గమనించింది, గుడికి వెళ్లింది… ఏనుగును స్వయంగా చూసింది… గత నెలలోనే ఓ వీడియోతో ట్వీట్ చేసింది… చాలామంది సోషల్ మీడియా యూజర్స్ దాన్ని షేర్ చేసుకున్నారు…
పెటా స్వయంగా యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా దగ్గర కంప్లయింట్ ఫైల్ చేసింది… Indian Penal Code తోపాటు the Prevention of Cruelty to Animals Act, the Wild Life (Protection) Act (WPA) 1972, the Tamil Nadu Captive Elephant (Management and Maintenance) Rules, 2011ల కింద ఎఫ్ఐఆర్ నమోదైంది… అస్సోంలో అదే ఏబీపీనాడుకు చెందిన జర్నలిస్టు నందన్ ప్రతిమ్ శర్మ ఏనుగు దురవస్థకు సంబంధించి వీడియోను ట్వీట్ చేయడంతో అస్సోం ప్రభుత్వంలో కదలిక మొదలైంది…

అస్సోం నుంచి ఏనుగులు ఏ పద్ధతిలో తమిళనాడుకు వెళ్తున్నాయి… వాటి నిర్వహణ, పోషణ ఎలా ఉంది..? ఇప్పుడు జయమాలను అవసరమైతే తిరిగి అస్సోంకు తిరిగి తీసుకురావడమే గాకుండా… ఇతర ఏనుగుల పరిస్థితేమిటో ఆ హైలెవల్ కమిటీ అధ్యయనం చేయనుంది… వాటి మీద సాగుతున్న క్రూరహింసకు తెరవేయడం ఎలా..? వాళ్లకు అప్పగించిన మరో టాస్క్ అది..! తమిళనాడు ప్రభుత్వం మాత్రం కిక్కుమనడం లేదు..!!

Ads

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • టర్కీ, అజర్‌బైజాన్… శత్రువుకు మిత్రులు… కాళ్లబేరానికి వస్తున్నారు…
  • పాకిస్థాన్ భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోయింది..!!
  • భారీగా బోరాన్ తరలింపు దేనికి..? ఆ అమెరికా విమానం ఏమిటి..?
  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…
  • అంతటి ప్రమాదకరమైన ఫ్యాక్టరీపై ఏమిటింత నిశ్చేష్టత..!?
  • ఆ సైంటిస్టులందరూ ఎక్కడెక్కడ ఉన్నారో గానీ ఆనందిస్తూనే ఉంటారు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions