.
అబుదాబి రాజుకు స్వయంగా స్వాగతం పలికిన మోడీ అమిత ప్రాధాన్యం వెనుక మన అవసరాలు ఏమిటో చెప్పుకున్నాం కదా… మరో కారణమూ ఉంది… అది మన ఇంధన భద్రతకు సంబంధించింది… అది చెప్పుకోవడానికి ముందుగా చిన్న ఇంట్రో అవసరం…
రష్యా నుంచి చమురు కొంటే టారిఫ్‌తో, పెనాల్టీలతో తాటతీస్తాను అని బెదిరిస్తున్నాడు కదా ట్రంపరి… మరోవైపు వెనెజులాను కబ్జా చేశాడు… ఇప్పుడు ఇరాన్ మీద కన్ను పడింది… చమురుపై ఆధిపత్యం అంటే ప్రపంచం మీదే ఆధిపత్యం…
Ads
ఈ స్థితిలో చమురు విషయంలో పూర్తిగా విదేశాల నుంచి దిగుమతులపైనే ఆధారపడ్డ ఇండియాను అమెరికా దిక్కేతోచని స్థితిలోకి నెట్టేస్తోంది… (అమెరికా ఎప్పుడూ నమ్మలేని, నమ్మకూడని దేశమే ఇండియాకు… ఇప్పుడిక పాకిస్థాన్ ఆర్మీ చీఫుతో ట్రంపుకి ఏకంగా వ్యాపార సంబంధాలు… టెర్రరిజానికి మరింత ఊపు…)
ఈ స్థితిలో ఎనర్జీ డిప్లొమసీ ప్రదర్శిస్తోంది ఇండియా..! కొన్ని సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయి… వెనెజులాలో మదురో ప్రభుత్వం కూలిపోయి, కొత్త ప్రభుత్వం వచ్చి, ఇండియాకు అనుకూల వైఖరిని కనబరుస్తోంది…
అక్కడ ONGC ఒప్పందాలున్నాయి… వెనిజులాలోని ‘శాన్ క్రిస్టోబల్’ వంటి ప్రాజెక్టుల్లో ONGC విదేశ్ (OVL) కు భారీ వాటాలు ఉన్నాయి… మదురో హయాంలో ఆంక్షల వల్ల నిలిచిపోయిన లాభాలు (దాదాపు $600 మిలియన్లు) ఇప్పుడు చమురు రూపంలో భారత్‌కు అందనున్నాయి…
తరువాత గయానా… గయానాలోని 11 బిలియన్ బ్యారెళ్ల నిల్వల్లో భాగస్వామ్యం కోసం గయానా ప్రభుత్వం తలుపులు బార్లా తెరిచింది… ONGC & రిలయన్స్ 2026 వేలంలో పాల్గొనడం ద్వారా, అక్కడ చమురును వెలికితీసే హక్కులను భారత్ దక్కించుకోబోతోంది… అంటే, మన చమురును మనమే సొంతంగా భూమిలోంచి తీసుకునే స్థాయికి భారత్ చేరుతోంది…
ఇక రష్యాలో ONGC (ONGC Videsh Ltd – OVL) కు భారీ ఎత్తున చమురు, గ్యాస్ ప్రాజెక్టులు ఉన్నాయి… అవి… సాఖాలిన్-1 (Sakhalin-1), ONGC విదేశ్‌కు 20% వాటా ఉంది… వాంకోర్ చమురు క్షేత్రం (Vankor Field) 26% వాటా ఉంది… ఇంపీరియల్ ఎనర్జీ (Imperial Energy) రష్యాలోని టామ్స్క్ (Tomsk) ప్రాంతంలో ఉన్న ఈ కంపెనీని 2009లోనే ONGC పూర్తిగా కొనుగోలు చేసింది…
ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్… అబుదాబి… మన బీపీసీఎల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కలిసి ఉర్జా భారత్ పేరిట సంస్థ నెలకొల్పి, 2019లో ‘ఆన్‌షోర్ బ్లాక్-1’ (Onshore Block 1) లో ఆల్రెడీ చమురు కనుగొని, తవ్వకాలు చేపట్టగా… తాజాగా రెండు చోట్ల చమురు నిక్షేపాలను కనుగొన్నట్లు ప్రకటించింది…
-
XN-76 బావి…: షిలైఫ్ (Shilaif) అనే అన్ కన్వెన్షనల్ ప్లేలో తవ్వకాలు జరపగా, అక్కడ తేలికపాటి ముడి చమురు (Light Crude Oil) లభ్యమైంది…
-
XN-79 02S బావి…: హబ్షాన్ (Habshan) రిజర్వాయర్‌లో కూడా చమురు నిక్షేపాలు బయటపడ్డాయి. ఈ ప్రాంతంలో చమురు లభించడం ఇదే తొలిసారి….
గతంలో కేవలం అన్వేషణ (Exploration) దశకే పరిమితమైన ఈ సంస్థకు, సెప్టెంబర్ 2024 లో అబుదాబి సుప్రీం కౌన్సిల్ ఫర్ ఫైనాన్షియల్ అండ్ ఎకనామిక్ అఫైర్స్ పూర్తి ఉత్పత్తి హక్కులను కల్పించింది… ఈ బ్లాక్ సుమారు 6,162 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది, దీనిపై ఉర్జా భారత్‌కు 100% హక్కులు ఉన్నాయి… ఇండియా భారీగా పెట్టుబడి పెడుతోంది…
అమెరికా, చైనా తరువాత ఇండియాకు అతి పెద్ద వ్యాపార భాగస్వామి అరబ్ ఎమిరేట్స్… ఇప్పుడు ఇంధన భద్రతకూ సహాయకారి… అందుకే అబుదాబి రాజుకు మోడీ అంత ప్రాధాన్యం ఇచ్చింది…
అంతిమంగా… సౌదీతో సత్సంబంధాలతో నిరంతర చమురు సరఫరా, రష్యా చమురు క్షేత్రాల్లో సొంత ఉత్పత్తి, వెనెజులాలో చమురు తవ్వకాల పునరుద్ధరణ, గయానాలో చమురు వెలికితీత… తాజాగా అబుదాబిలో మన సొంత బావులు… ఇవీ మన ఇంధన భద్రతకు భరోసాలు…!!
ఎప్పటికప్పుడు ఇండియాను బ్లాక్ మెయిల్ చేస్తూ, మంగన్‌లో పెట్టి ఒత్తాలని అనుకుంటున్నా సరే... ఇండియా లొంగిపోవడం లేదనేదే అమెరికా అక్కసు... అందుకే మం డు తు న్న ట్టుం ది..!!
Share this Article