Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కవిత బాటలోనే కనిమొళి..? ఉదయనిధి వారసత్వంపై అసహనం..!!

April 4, 2026 by M S R

.

సేమ్, కేసీయార్ బీఆర్ఎస్ కుటుంబ పార్టీలోలాగే… డీఎంకే స్టాలిన్ కుటుంబ పార్టీలోనూ ముసలం బయల్దేరుతోందా..? ఆల్రెడీ కవిత బయటికి వచ్చేయబడి, తెలంగాణ జాగృతి పార్టీ అని కొత్త పార్టీ పెట్టుకుని, మగవారసత్వ పోకడల్ని సవాల్ చేయబోతోంది కదా… సేమ్, కనిమొళి కవిత బాటలో నడవబోతోందా..?

తమిళనాట ఆసక్తి కలిగిస్తున్న వార్తలు, విశ్లేషణల్ని ఓసారి చూద్దాం… డీఎంకేలో స్టాలిన్- అళగిరి వారసత్వ గొడవల్ని చూశాం, అది డీఎంకేను నష్టపరచకుండా స్టాలిన్ అన్నీ చక్కదిద్దుకున్నాడు… అది వోకే… కరుణానిధికి భార్య దయాళు అమ్మాళ్‌తో కలిగిన సంతానం వీళ్లు… (స్టాలిన్ సోదరుడు తమిళరసు, సోదరి సెల్వి కూడా…)

Ads

కానీ కనిమొళి మాత్రం కరుణానిధికి తన మూడో భార్య రాజాతి అమ్మాళ్ వల్ల కలిగిన బిడ్డ… సో, స్టాలిన్, కనిమొళి ఒక్క తల్లి బిడ్డలు కారు… సరే, పైన ఫరూక్ అబ్దుల్లా కుటుంబం నుంచి కింద కరుణానిధి కుటుంబం దాకా… అందరికీ మగవారసుల ధోరణులే కదా… ఆడపిల్ల ఎప్పటికైనా అత్తింటి పిల్లే… మన వారసత్వానికి మగ బిడ్డలే అనేది ఈ ధోరణి…

స్టాలిన్ బాగానే ఉన్నాడు, కనిమొళి మాత్రం జైలుపాలైంది… సేమ్, కేటీయార్ బాగానే ఉన్నాడు, కవిత మాత్రం జైలుపాలైంది… కనిమొళి సమయం కోసం వేచి చూస్తున్నట్టుంది… స్టాలిన్ తన కొడుకు ఉదయనిధిని డిప్యూటీని చేసేసి, తదుపరి వారసుడిగా పరోక్ష ప్రకటన చేసేశాడు… అదీ కనిమొళి కేడర్‌లో మండుతోంది… ఆమెనూ అభిమానించే కేడర్ బాగానే ఉంది… (ఈమె తూత్తుకూడి ఎంపీ)… డిఎంకే మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా, పార్లమెంటరీ పార్టీ లీడర్‌గా ఉంది…

పార్టీలోని సీనియర్లకు కూడా ఉదయనిధికి దక్కుతున్న ప్రాధాన్యం పట్ల కోపం ఉంది, కానీ బయటపడరు… భయం..!!

ప్రస్తుత ఎన్నికల్లో ప్రచారం కోసం వెళ్తున్నప్పుడు… అనేేకచోట్ల… ఉదాహరణకు తిరునల్వేలి జిల్లా, పాళయంగొట్టయ్‌ వేదిక దగ్గరకు రాగానే జనం పెద్ద ఎత్తున ‘కాబోయే సీఎం కనిమొళి’ అని నినాదాలు చేశారు… ఆమె నవ్వుతూ వేదిక ఎక్కింది, కానీ నెగెటివ్‌గా స్పందించలేదు… తిరునల్వేలి, కోవిల్‌పట్టి కేంద్రాల్లో ఉదయనిధి పాల్గొనాల్సిన యువజన సదస్సులు రద్దయ్యాయి…

కారణం… వాటికి కనిమొళిని ఆహ్వానించకపోవడమే… ఆమె మద్దతుదారులు కనిమొళికి పార్టీలో పడుతున్న కత్తెర పట్ల, తగ్గుతున్న ప్రాధాన్యం పట్ల అసహనంగా ఉన్నారు… ఆ ఆగ్రహం సభల్లో వ్యక్తమవుతోంది…

కనిమొళి

మీరు జాగ్రత్తగా గమనించండి… ప్రాంతీయ, కుటుంబ పార్టీల్లో ఎప్పుడూ మగవారసత్వమే… ఆడపిల్లలకు వారసత్వంపై ఆసక్తి ఉన్నా, సామర్థ్యం ఉన్నా పక్కన పెట్టేయడమే, తొక్కేయడమే… (మగ వారసుల్లేని చోట మాత్రమే ఆడ సంతానానికి కాస్తో కూస్తో ప్రాధాన్యత… ఉదాహరణకు శరద్ పవార్ బిడ్డ సుప్రియా సూలే, ముఫ్తి మెహబూబ్…)

మాయావతి, మమత కూడా సోదరీసోదరుల కొడుకులనే నమ్ముతారు… నమ్మారు… కానీ కనిమొళి కవితలాగా బయటికి వచ్చి, సొంత ఆకాంక్షలకు కార్యరూపం ఇస్తుందా..? ప్రస్తుతానికి ఇది ఓ ప్రశ్న… ఈ ఎన్నికలైపోయాక ఆమె స్టాలిన్ తదుపరి అడుగులను బట్టి నిర్ణయం తీసుకోనుంది అంటున్నారు… ప్రస్తుతానికి తన ఉనికి తన ఫ్యాన్స్ నినాదాల ద్వారా చాటబడుతోంది…

అభ్యర్థుల ఎంపిక, మిత్రపక్షాలకు సీట్ల సంఖ్య, కేటాయింపుల్లో కూడా తనను పూర్తిగా పక్కన పెట్టేసిన తీరు మీద కూడా ఆమె తీవ్ర అసంతృప్తితో ఉందట… సో, ముసలం ఎటు దారితీస్తుందో చూడాలిక..!! కవిత ఏమాత్రం సక్సెసైనా కనిమొళికి స్పూర్తి కావడం తథ్యం..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రాజకీయ విమర్శల్లో ఘాటు వోకే… కానీ జాతుల్ని కించపరచడం దేనికి..?
  • ప్రళయ్..! ఇక ప్రేక్షకులందరి చూపూ ఈ కొత్త సినిమాపైనే..!
  • ఇరాన్‌లో చిక్కుకున్న అమెరికన్ పైలట్‌ను కాపాడింది ఇదేనా..?!
  • ఏడేళ్ల ‘బాలీవుడ్ బాద్‌షా’ పీఠానికి ఎసరు..! తొలిసారి రణబీర్‌కు కిరీటం..!
  • కొబ్బరి బొండాం..! అప్పట్లో కామెడీ హీరో అంటే ఓన్లీ రాజేంద్ర ప్రసాద్..!
  • అర్చకుల విదేశీ ప్రయాణాలు నిషిద్ధమా..? శృంగేరీ చెప్పిందే ఆగమమా..?!
  • అసెంబ్లీ నక్సలైట్..! ముందస్తు జాగ్రత్తగా ఉపా కేసు వర్తిస్తుందా యువరానర్..!!
  • అన్నదాత చెమట చుక్కకు తెలుసు మెతుకు విలువ… అవమానించకండి…
  • గాలికదుపు లేదు- కడలికంతు లేదు… ప్రతి పదంలోనూ మార్మిక భావన…
  • జంట నెలవంకలుండే నింగి ఉంటుందేమో…. ‘అలాంటి పిల్ల’ దొరకదు…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions