గణేష్ ఆచార్య… ఆమధ్య పుష్ప సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ ఊఅంటావా ఊఊఅంటావా మామ పాటకు డాన్స్ కంపోజ్ చేసింది ఈయనే… ఎక్కువగా బాలీవుడ్ సినిమాలే తన ప్రపంచం… ముప్ఫయ్యేళ్లుగా చాలా హిట్ సినిమాలకు కొరియోగ్రాఫర్ తను… ఈయన తండ్రి కూడా డాన్సరే… గణేష్ డాన్సర్ మాత్రమే కాదు, యాక్టర్, డైరెక్టర్ కూడా…! తను ఇరవై ఏళ్ల క్రితం విధి అనే సినిమా నిర్మాతను పెళ్లి చేసుకున్నాడు… సౌందర్య అనే కూతురు కూడా ఉంది… ఇదీ బ్రీఫ్‌గా గణేష్ ఆచార్య…
నాణేనికి మరో కోణం ఉంది… ఒక దశలో 200 కిలోల దాకా బరువు పెరిగాడు… నడవడమే కష్టమైపోయేట్టుగా… వెయిట్ లాస్ ప్రక్రియలన్నీ ప్రయత్నించి ఏకంగా 98 కిలోల మేరకు తగ్గించుకున్నానని కపిల్ శర్మ షోలో స్వయంగా చెప్పాడు… దీనికి పట్టిన సమయం ఒకటిన్నరేళ్లు… అసలు ఇది కూడా కాదు విశేషం…
తనతోపాటు పనిచేసిన ఓ మాజీ డాన్సర్ లైంగిక వేధింపుల కేసు పెట్టింది తనమీద… ఆంధేరి పోలీసులు కేసు నమోదు చేసి, ఏడు సెక్షన్లతో ఓ చార్జి షీటు కూడా కోర్టులో దాఖలు చేశారు… అప్పట్లో మిటూ ఉద్యమంలాగా నడిచినప్పుడు కూడా పలువురు తనమీద ఇవే ఆరోపణలు చేసినట్టు గుర్తు… Indian Cine and TV Choreographers Association కు ఈ సారు ప్రధాన కార్యదర్శి అట… ఇదంతా ఒకవైపు… మనం చెప్పుకునే స్టోరీ వేరు…
Ads
తను కూతురు సౌందర్యతో కొన్ని పాటలకు డాన్సులు చేశాడు… అవి యూట్యూబులో కూడా వైరల్ అయ్యాయి… ఒకటీరెండు తనే ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు… అయితే హఠాత్తుగా ఈ డాన్సు వీడియోల పట్ల నెగెటివ్ కామెంట్స్ పెరిగాయనే వార్త ఎక్కడో కనిపించింది… నీ సొంత కూతురితో బీగీ బీగా రాతోమ్మే అని రొమాంటిక్ సాంగ్స్‌కు డాన్సులు ఏమిట్రోయ్ అనే ట్రోల్ స్టార్టయిందిట… బిడ్డతో రొమాంటిక్ సాంగ్స్ ఎబ్బెట్టుగా ఉంటాయి, ఎక్కడో మనసు చివుక్కుమంటుంది…
అబ్బే, ప్రొఫెషనల్‌గా ఆలోచించేవాళ్లు ఇవి పట్టించుకోకూడదు అని వితండవాదం చేసేవాళ్లు కూడా బోలెడుమంది… ఏది ప్రొఫెషన్..? ప్రొఫెషనలిజం ఎప్పుడూ ఎబ్బెట్టుతనాన్ని ప్రోత్సహించదు… ప్రోత్సహిస్తే అది ప్రొఫెషనలిజం అనబడదు… ప్రతి దానికీ ఓ పరిమితి ఉంటుంది… ఓ గీత, ఓ లక్ష్మణరేఖ ఉంటుంది… అయితే ఇది ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే…
మనకు మంచి మెరిట్ ఉన్న ఓ కొరియోగ్రాఫర్ ఉన్నాడు… పేరు శేఖర్ మాస్టర్… జెమ్… డౌట్ లేదు… టీవీ షోలకు జడ్జిగా కూడా వస్తుంటాడు… ఆమధ్య టెన్త్ చదివే తన కూతురితో (సాహితి..?) రెండుమూడు పాటలకు డాన్సులు చేశాడు… అమ్మాయి కూడా మంచి డాన్సర్… కళావతి పాట, చంద్రుడిలో ఉండే కుందేలు పాటలకు కలిసి డాన్సులు చేసినట్టు గుర్తు… ఎబ్బెట్టుగా ఉంది… ‘ముచ్చట’లో కూడా అదే ప్రస్తావించాం… కానీ కొందరికి అది ప్రొఫెషనల్ ధోరణిగా, అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేని పనిగా కనిపించిందట…
ఇప్పుడు గణేష్ ఆచార్య, ఆయన కూతురి రొమాంటిక్ స్టెప్పుల మీద కనిపిస్తున్న కామెంట్స్‌తో మళ్లీ ఇదంతా గుర్తొచ్చింది… ఏ ప్రొఫెషన్ అయినా సరే, ఎంత ప్రొఫెషనలిజం అయినా సరే… ఎలా సమర్థించుకున్నా సరే… కొన్ని ఉద్వేగసంబంధమైన, సున్నితమైన మర్యాదపూర్వక కట్టుబాట్లు ఉంటయ్… ఆ రేఖ దాటినరోజు ఎంత మంచి ప్రతిభ అయినా సరే వెగటుగా అనిపిస్తుంది..!!
Share this Article