.
ఆశ్చర్యమేసింది… రాబోయే డాకూ మహారాజ్ సినిమాలో దబిడి సాంగ్ కోసం బాలకృష్ణ ఊర్వశి రౌటేలాతో కలిసి వేసిన స్టెప్పులు చూస్తుంటే…
పుష్పలో జర్దా గుట్కా హాట్ కిస్సుల దుర్వాసన ఇంకా తగ్గనేలేదు… బాలయ్య తాజా స్టెప్పులు వెగటు వాసన వేస్తున్నాయి… గతంలో ఏదో సినిమాలో పైసా వసూల్ అంటూ చేతి వెకిలి సైగల స్టెప్పులు వేశాడు కదా, అది నయం అనిపిస్తోంది…
Ads
గతంలో కొన్ని సినిమాలో సీనియర్ ఎన్టీఆర్‌తో డాన్సులాడే హీరోయిన్లు ఇంటికెల్లి కాపడం పెట్టించుకునేవారని జోక్ వినిపించేది… ఉక్కు ప్రేమ, రాక్షస రొమాన్స్ అని చెణుకులు పడేవి… బాలయ్య తన వారసుడు కదా… ఆనవాయితీని నిలుపుతున్నాడు…
అదేదో సినిమాలో హీరోయిన్ కాళ్లు పట్టుకుని పార్కులో అటూ ఇటూ గుంజేస్తుంటాడు… అదీ గుర్తొచ్చింది… ఈ దబిడి పాటలో ఐటమ్ గరల్ ఊర్వశి పృష్ణ భాగంపై మృదంగం వాయిస్తుంటాడు బాలయ్య, అంతేనా, మొదట ఒకటే చేతితో చరుస్తూ, డోస్ సరిపోలేదని రెండు చేతులూ బిగించి చరుస్తుంటాడు…
https://www.facebook.com/reel/2391892031144347
ఓసారి దబిడి దిబిడి పాట వీడియో చూసి మీరే నిర్ధారించుకొండి… ఇదా ఓ ప్రజాప్రతినిధి టేస్ట్..? తన బావ సీఎం, అల్లుడు యాక్టింగ్ సీఎం… తోటి హీరో డిప్యూటీ సీఎం… ఏమిటా స్టెప్పులు..? ఇదుగో ఇలాంటి స్టెప్పులతోనేనా తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకుపోతున్నామని బన్నీ డొల్ల ప్రకటనలు… పిచ్చి కూతల్లో రామగోపాలవర్మను తలపిస్తున్న నాగవంశీ శుష్క ప్రగల్భాలు…
బాలయ్య సినిమా అనగానే స్ఫురించే డైలాగులతో కాసర్ల శ్యామ్ ఏదో రాశాడు… బాలయ్య పదాల్ని అక్కడక్కడా అమర్చాడు పాటలో… అంతకుమించి ఏమీ లేదు, నిర్మాత- దర్శకులు అదే కోరారు కాబట్టి తనకు తప్పలేదు… పాటలో అశ్లీలం లేదు…
కానీ థమన్ ట్యూన్ నాసిరకం… తెలుగు ఇండియన్ ఐడల్ విజత వాగ్దేవికి తను గతంలో హామీ ఇచ్చినట్టే ఈ పాట పాడించాడు, ఆమె బాగానే పాడింది, టోన్ మాడ్యులేషన్‌తో… ఎటొచ్చీ శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీయే అసభ్యంగా ఉంది… తను ఎందుకిలా తయారయ్యాడు..?
పిరుదులపై గుద్దడం, చరచడం డాన్సా..? పైగా తను ఈటీవీ వారి ఘనమైన డాన్స్ షో ఢీకి న్యాయమూర్తి..? షేమ్ శేఖర్ మాస్టర్… ఈ స్టెప్పులకు బాలయ్య ఎలా అంగీకరించాడు..? దర్శకుడు- నిర్మాతలది నీచాభిరుచి కావచ్చుగాక… బాలయ్య తన ప్రజాజీవితంలోని స్టేటస్ కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా…
అప్పట్లో ముద్దయినా పెట్టాలి, కడుపైనా చేయాలి అంటూ వెగటు డైలాగులు వదిలి, పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో తరువాత చింతించిన బాలయ్య ఆ తరువాతైనా జాగ్రత్తగా ఉండాలి కదా… ప్చ్, ఏదీ లేదు… వయస్సు, హోదా, ప్రజాజీవితం, టేస్ట్ గట్రా చాలా చూసుకోవాలి కదా బాలయ్యా..!! ఆల్రెడీ నెటిజనం నెగెటివ్‌గా రియాక్టవుతున్న తీరు గమనించావో లేదో..!
చివరగా… ఊర్వశి రౌటేలాకు ఇస్తామన్న పారితోషికం రెట్టింపు చేసి ఇస్తే బెటర్, అలాగే ఫ్రీ ఫిజియోథెరపీ చేయించాలి నిర్మాతలు..!! నిర్మాత ఎవరంటారా…? ఇంకెవరు రీసెంట్ ది గ్రేట్ నాగవంశీ..!! దర్శకుడు బాబీ..!!
Share this Article