.
తరణ్ ఆదర్శ్… వర్తమానంలోని మంచి సినిమా క్రిటిక్… అన్ని భాషల ఇండస్ట్రీ ముఖ్యులు తన రివ్యూలు ఫాలో అవుతుంటారు… సరళంగా నాలుగు ముక్కల్లో సినిమా నాణ్యతను తేల్చిపడేస్తాడు…
కానీ నెవ్వర్… ఆయన కూడా ఓ సినిమాను విశ్లేషించలేడు… సమీక్షించలేడు… జుత్తు పట్టుకుంటాడు… ఓ విషమ పరీక్షలాగా మారుతుంది… తన సమీక్ష సామర్థ్యం మీదే తనకు డౌటొస్తుంది… ఆ సినిమా పేరు యూఐ…
Ads
నిజం… ఉపేంద్ర కొత్త సినిమా ఒకటి వచ్చిందిగా,.. దాని పేరే యూఐ… ఆ పేరెందుకు పెట్టాడో తనకే తెలియదు… ఆ సినిమా కథలోనూ ఓ యూఐ సినిమా ఉంటుంది… దాన్ని చూసిన కిరణ్ ఆదర్శ్ అనే క్రిటిక్‌కు ఏమాత్రం అంతుపట్టదు అది… (తరణ్ ఆదర్శ్ పాత్రకే ఈ పేరు పెట్టారన్నమాట…)
మీరేం చదువుతున్నారో అర్థం కావడం లేదు కదా… ఈ యూఐ సినిమా ఏమిటి..? సినిమాలోనూ ఓ యూఐ సినిమా ఏమిటి..? అవును, ఈ సినిమా అంతా అలాగే అర్థం గాకుండా సాగుతుంది… సరే, సినిమా కథకొస్తే యూఐ సినిమా చూసినవాళ్లంతా అదోమాదిరిగా బిహేవ్ చేస్తుంటారు… అసలు ఇదేమిటో అర్థం గాక నేరుగా ఉపేంద్ర ఇంటికే వెళ్తాడు ఈ క్రిటిక్…
అక్కడ సగం కాలిన సినిమా కథ కనిపిస్తుంది… సినిమాలో రకరకాల వింత వేషాలు వస్తుంటయ్, పోతుంటయ్… ఏది ఎందుకు వస్తుందో పోతుందో అర్థం కాదు… మనిషి జాతి పుట్టుక దగ్గర నుంచి వర్తమానంలోని అనేకానేక నమ్మకాల మీద సెటైర్లు వేస్తున్నట్టుగానే కనిపిస్తూ ఉంటుంది, కానీ బుర్రకెక్కవు…
అసలు ఉపేంద్ర సినిమా అంటేనే అదో టైపు… టైటిళ్లతోపాటు కథలూ అంతే… ఈమథ్య సినిమాలు, టీవీల్లో ఓ డైలాగ్ తరచూ వినిపిస్తూ ఉంటుంది తెలుసు కదా… ఇది అర్థం కావాలంటే మినిమం డిగ్రీ చదివి ఉండాలి అని..! యూఐ సినిమా అర్థం కావాలంటే డిగ్రీ కాదు, పీజీ, పీహెచ్‌డీ చేసినా సరిపోదు,., అదీ కథ ‘‘తీవ్రత’’…
మొన్నామధ్య వచ్చిన సినిమాలో కల్కి ఉంటాడు కదా… ఇందులోనూ కల్కి భగవానుడు ఉంటాడు… కొత్త కొత్త లోకాలు సృష్టించాడు ఉపేంద్ర… ఒకటి చూసి అర్థం చేసుకుని, అంటే జీర్ణం చేసుకునేలోపు మరొకటి వస్తుంది…
సరే, తన గురించి తెలుసు కదా… హీరోయిన్లు, పాటలు గట్రా పెద్దగా ఉండవని… ఇందులోనూ అంతే… బహుశా అయిదారు సీన్లలో కనిపిస్తుందేమో… హీరోయిన్ అనలేం… అసలు ఉపేంద్ర సినిమా అంటేనే అదొక యూనిక్ జానర్… అదెవడికీ చేతకాదు.,. ఎస్, అదెవడికీ అర్థం కాదు కూడా…
సినిమా మొదలు కాగానే ఓ కార్డ్ పడుతుంది… ‘‘మీరు తెలివైనవాళ్లు అయితే వెంటనే థియేటర్ వదిలేసి వెళ్లిపొండి, మీరు మూర్ఖలైతేనే సినిమా చూస్తూ ఉండండి’’ అని… సినిమా కథలో యూఐ సినిమా చూసినవాళ్లు మెంటల్ అయిపోతూ ఉంటారు… ఎస్, వర్తమానంలోని యూఐ సినిమా మూర్ఖంగా అలాగే చివరిదాకా చూస్తే… మెంటల్ ఎక్కిపోతారు..!!
చివరగా… ఉపేంద్ర పలు అంశాల మీద సెటైర్లు వేయాలనుకున్నాడు… అదీ భిన్నంగా… కానీ ఏదైనా సరే జనానికి అర్థమయితేనే కదా…!! #uimoviereview , #HeroUpendra
Share this Article