Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఉక్రెయిన్ యుద్ధతంత్రం… ఇండియాకు ఓ పెద్ద మేలుకొలుపు…

June 5, 2025 by M S R

.

నిజానికి ఉక్రెయిన్ రష్యా మీద అమలు చేసిన ఓ భిన్నమైన, తెలివైన యుద్దవ్యూహం… ప్రపంచంలోని అన్ని దేశాల సైన్యాన్ని, రక్షణ విభాగాల్ని నివ్వెరపరిచింది…

ఇది ఒక ఇంట్రెస్టింగ్ స్పై కథ… ఉక్రెయిన్ సీక్రెట్ ఏజెంట్ Artem Tymofieiev డీజే అవతారం ఎత్తి, నాలుగు సంవత్సరాలు అండర్ కవర్ ఆపరేషన్ లో ఉండి…, ఆర్డర్స్ రాగానే 117 డ్రోన్లను హవాలా మార్గం ద్వారా రష్యాలోకి రప్పించుకొని…

Ads

తన కమర్షియల్ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీ ద్వారా నలుగురు డ్రైవర్లని మాట్లాడి, వుడన్ ఫామ్ హౌస్ డెలివరీ అని చెప్పి… ఒకేసారి అన్ని డ్రోన్లని ప్రయోగించి… రష్యాలోని దాదాపు 6000 కి.మీ పరిధిలోని 4 ముఖ్య సైనిక స్థావరాలను పేల్చేసిన తీరు అద్భుతం…

మామూలు ఆపరేషన్ కాదు అది… “ఆపరేషన్ స్పైడర్ వెబ్ ” ఒక 37 ఏళ్ళ అండర్ కవర్ ఏజెంట్ ఒంటరిగా ఎగ్జిక్యూట్ చేసిన, మానవ చరిత్రలో ఒక అతిపెద్ద సీక్రెట్ కవర్ ఆపరేషన్… దీనివలన రష్యా నష్టపోయింది దాదాపు 50 వేల కోట్ల రూపాయలు…

అంతే కాదు, రష్యాను కొట్టిన దెబ్బ భవిష్యత్తు యుద్దవ్యూహాలు, ప్రమాదాలను ఓ పాఠంగా చెప్పిచూపించింది… 30 శాతం యుద్ధవిమానాల్ని ఒకేసారి కోల్పోవడం రష్యాకు కోలుకోలేని షాక్… 41 nuclear-capable long-range bombers were hit in the attack, with 34 per cent of Russia’s fleet of air missile carriers destroyed … ఇక్కడే ఇండియా కళ్లు తెరుచుకోవాలి… తప్పదు…

ఉక్రెయిన్‌కు బ్రిటన్ లక్ష డ్రోన్లను సప్లయ్ చేయడం కాదు సమస్య… ఇండియాపై పోరుకు చైనా, టర్కీ అందించే డ్రోన్లే పెద్ద సమస్య… మన బ్రహ్మోస్, మన ఆకాశ్‌తీర్, మన రాఫెల్, మన ఎస్-400 ఒక్క పురుగునైనా మన గగనతలంలోకి రానివ్వం, కొట్టిపారేస్తాం, మొన్న చేసి చూపించాం కదానేది మన ధీమా…

కానీ బయటి నుంచి వచ్చే శతృ డ్రోన్లను మన గగనతల రక్షణ వ్యవస్థలు పర్‌ఫెక్ట్‌గా అడ్డుకుంటాయి, పేల్చేస్తాయి సరే, గ్రేట్… కానీ రష్యా స్థావరాలను రష్యా గడ్డ మీద నుంచే కొట్టిన ఉక్రెయిన్‌లాగా పాకిస్థాన్ కూడా వ్యూహాన్ని పన్నితే… అదుగో అదీ డేంజర్… తక్షణం ఇండియా దృష్టి సారించాల్సిన విషయమిదే…

ఎందుకంటే..? మన దేశంలో పాకిస్థాన్ ప్రేమికులు ఎక్కువ… ఐఎస్ఐకి మన దేశంలో చాలా పెద్ద నెట్‌వర్క్… స్లీపర్ సెల్స్, అండర్ కవర్ ఏజెంట్లు, ఉగ్రవాదుల మద్దతుదారులకు తోడు పార్టీల క్షుద్ర రాజకీయాలు… గుడ్, మన యుద్ధం బహుముఖం… నీళ్లు బంద్, వ్యాపారం బంద్, అంతర్జాతీయంగా ఎండగట్టే దౌత్యం వంటివి అవసరమే…

అదేసమయంలో మన గడ్డ మీద నుంచే ప్రమాదం తలపెట్టే శక్తుల గుర్తింపు, ఏరివేత మరీ ముఖ్యం… ఉక్రెయిన్- రష్యా తాజా యుద్ధం తీరు నేర్పిన పాఠం ఇదే… ఆపరేషన్ సిందూర్ మరో నాలుగు రోజులు అలాగే కొనసాగించి ఉంటే, కథ వేరే ఉండేది… ప్చ్, వెనక్కి తగ్గడం పొరపాటేనేమో..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇండియాలోకెల్లా హయ్యెస్ట్ పెయిడ్ ఫిమేల్ టీవీ ఆర్టిస్ట్ ఎవరో తెలుసా..?!
  • వేములవాడ ఆవులు, కోడెల ఉసురు ఎవరికి తగలబోతోంది..?!
  • ఈవారం తెలుగు టీవీ వినోద చానెళ్ల స్థితిగతులు, రేటింగులు ఇవీ…
  • తెలుగు టీవీ న్యూస్ చానెళ్లలో ప్రస్తుతం ఎవరు ఏ ప్లేసులో..?!
  • బాలయ్య దంచూదంచూ అని దరువేశాడు గానీ… దంచికొట్టింది భానుమతే…
  • ఫాఫం అనసూయ..! కాస్త మారిందేమో అనుకున్నారా..? నో, నెవ్వర్..!!
  • ట్రంపుపై మస్క్ పేల్చిన చీకటి బాంబు… అమెరికాలో కలకలం… అసలు కథ ఇదీ…
  • దిక్కుమాలిన క్షుద్రానువాదాలు… దరిద్రపు పర్యవేక్షణ అంటే ఇదే…
  • సిల్క్ స్మిత హర్టయ్యింది… ఆ గ్రేట్ కొరియోగ్రాఫర్ కెరీర్ క్లోజయ్యింది…
  • కథ కన్నీళ్లు పెట్టిస్తుంది… కానీ ఈ కథ ఎక్కడిది..? ఎవరిది..? ఆ కథేమిటి..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions