పుష్ప సీక్వెల్ ఖచ్చితంగా కష్టాల్లో ఉంది… రకరకాల వార్తలు… దాన్ని తీవ్ర అయోమయంలో పడేస్తున్నాయి… వందల కోట్ల రూపాయల బిజినెస్ ప్రస్తుతం గందరగోళంలో చిక్కుకుంది… అది నిజం…
ఎప్పుడో ఆగస్టులో అనుకున్నారు రిలీజ్ అని… అది కాస్తా డిసెంబరుకు వాయిదా… కారణం, ప్రస్తుతం జనసేన, పవన్ కల్యాణ్ బలగం బన్నీని వ్యతిరేకిస్తుందనీ, అందుకే వాయిదా వేస్తున్నారనీ వార్తలు… హంబగ్… ఒక్క ఆంధ్రాలో బిజినెస్ కోసం, పాన్ ఇండియా మూవీని వాయిదా వేసుకుంటారా..?
పోనీ, నిజమే అనుకుందాం… డిసెంబరులో కూడా పవన్ కల్యాణే డిప్యూటీ సీఎం కదా… సిట్యుయేషన్ ఏమీ మారదు కదా… నిజానికి ఇవన్నీ ఏమీ కావు, పైగా అల్లు అరవింద్ అప్పుడే వెళ్లి పవన్ కల్యాణ్ పక్క కుర్చీలో బైఠాయించేశాడు కూడా… మరీ అవసరమొస్తే చిరంజీవి ఉండనే ఉన్నాడు, పైగా చంద్రబాబు కక్షసాధింపు పర్సనాలిటీ కాదు… సో, అది కాదు కారణం…
Ads
అబ్బే, ఇప్పటివరకూ జరిగిన షూటింగ్ బాపతు ఫీడ్ మీద బన్నీ అసంతృప్తిగా ఉన్నాడు, రీషూట్ కావాలంటున్నాడు… పాన్ ఇండియా రేంజులో ప్రభాస్, రాంచరణ్, జూనియర్‌లకు దీటుగా నిలబడాలంటే ఇప్పటివరకూ జరిగిన షూట్ బాపతు ఫీడ్ సంతృప్తిగా లేదని బన్నీ భావిస్తున్నాడు అని మరికొన్ని వార్తలు… అవీ నమ్మశక్యం కావు…
ఎందుకంటే..? షూటింగు జరుగుతున్నప్పుడు తను దూరంగా లేడు కదా… తను ఎన్నాళ్లుగానో షూటింగులో ఉన్నవాడే కదా… దారి తప్పితే ఇప్పటికే చెప్పేవాడు కదా… పైగా సుకుమార్‌కు జీవితాంతం కృతజ్ఞుడిగా ఉంటాను అనే నీతిబోధ పదే పదే చెబుతుంటాడు కదా… అసంతృప్తి ఉంటే తనకే నేరుగా చెప్పేవాడు కదా… ఒకవేళ అసంతృప్తి ఉన్నా సరే, సుకుమార్ మీద ప్రదర్శించలేడు… సో, అది కాకపోవచ్చు కారణం…
ఎహె, అసలు సుకుమారే అసంతృప్తిగా ఉన్నాడు, మెగాఫోన్, ఫోన్ విసిరికొట్టి విసురుగా స్పాట్ నుంచి వెళ్లిపోయాడు… ఇదిప్పట్లో తేలే యవ్వారం కాదు అని మరికొన్ని వార్తలు… అవీ నిజం కాకపోవచ్చు… ఎందుకంటే, నటీనటులు సరిగ్గా పర్‌ఫామ్ చేయకపోతే అది తన వైఫల్యమే అవుతుంది… పైగా ఇప్పటిదాకా 80 శాతం జరిగిన షూటింగులో బాగానే చేసిన నటీనటులు హఠాత్తుగా నటన మరిచిపోయారా..? నో, అవీ పిచ్చి వార్తలే… కాకపోతే సుకుమార్ తన కోపాన్ని ఎవరి మీదో పరోక్షంగా వ్యక్తీకరిస్తున్నాడు… బన్నీ మీద చూపించలేడు, నిర్మాతల మీద అసలే చూపించలేడు…
ఒకవైపు బన్నీ గడ్డం ట్రిమ్ చేసి విదేశాలకు టూర్ మీద చెక్కేశాడు… అంటే ఇప్పట్లో షూటింగ్ రిస్టోర్ అయ్యే చాన్స్ లేనట్టే… పైగా సుకుమార్ కూడా విదేశాలకు వెళ్లిపోయాడు… వెరసి అయోమయం జగన్నాథం… నిర్మాతల మీద ఫుల్లు ప్రెజర్… ఇప్పటిదాకా జరిగిన నిర్మాణ వ్యయం మీద వడ్డీలు, తప్పనిసరి టీం మెయింటెనెన్స్ ఖర్చులు తడిసిమోపెడు…!! ఇదిలాగే కొనసాగితే అది ఇండస్ట్రీకే మంచిది కాదు… అల్లు అరవింద్ ఇన్వాల్వ్ గాకుండా తప్పేట్టు లేదు..!!
Share this Article